
పండగల టైమ్‌లో షూటింగ్‌కి బ్రేక్ దొరికితే భలే ఉంటుంది. ఈసారి నాకా ఛాన్స్ దక్కింది. అందుకే ముంబై వెళ్లా. దీపావళి పండగని మేం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. స్నేహితులు, బంధువులు.. మొత్తం అంతా కలిపి దాదాపు వంద మంది మా ఇంటికొచ్చారు. రెండు రోజులు లక్ష్మీ పూజ చేస్తాం. ఆల్రెడీ బుధవారం ఒక పూజ చేశాం. గురువారం ఇంకో పూజ. ఫస్ట్ డే పూజకి నా కోసం మా అమ్మగారు గాగ్రా చోళీ కొన్నారు.
రెండో రోజు పూజకు హాఫ్ శారీ (లంగా, ఓణీ) కుట్టించారు. ఇంట్లో సందడి గురించి పక్కన పెడితే, నేను దత్తత తీసుకున్న పిల్లలను కూడా ఆనందపరచడం నా బాధ్యత అందుకే వాళ్లని కలిసి, దీపావళి గిఫ్ట్స్ ఇచ్చి, కాసేపు స్పెండ్ చేయాలను కుంటున్నాను. నిన్న కుదరలేదు. పిల్లలకు క్రాకర్స్ మాత్రం ఇవ్వను. అవి కాల్చడానికి సరదాపడతారు కానీ, పర్యావరణానికి మంచిది కాదు. అందుకే, ఎంకరేజ్ చేయను.
Comments
Please login to add a commentAdd a comment