పెళ్లి కళ వచ్చేసింది.. | Isha Ambani Sabyasachi Lehenga for Pre-Wedding Puja | Sakshi
Sakshi News home page

పెళ్లి కళ వచ్చేసింది..

Nov 28 2018 4:53 PM | Updated on Nov 29 2018 7:41 AM

Isha Ambani Sabyasachi Lehenga for Pre-Wedding Puja  - Sakshi

సాక్షి,ముంబై: మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీకి పెళ్లి కళ వచ్చేసింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన సంప్రదాయ లెహంగ దుస్తులు, ఖరీదైన అన్‌కట్‌ సిండికేట్‌ డైమండ్స్‌, జాంబియన్‌ ఎమరాల్డ్స్‌ పొదిగిన నెక్లెస్‌, దానికి జతగా  మ్యాచింగ్‌ చెవి రింగులతో పెళ్లి కళ వచ్చేసిందే బాలా అన్నట్టుగా తళుక్కున మెరిసింది.

తాజాగా ఇషా అంబానీ ఈ అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. సాంప్రదాయకంగా వధువు నిర్వహించే గృహ శాంతి పూజకోసం ఈ అందమైన లెహంగాను, నెక్లెస్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు.

మరోవైపు తన కుమార్తె పెళ్లి వేడుక ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ ఇటీవల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని,  కేరళలోని గురువాయూర్‌ దేవాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాలను దర్శించుకొని విలువైన కానుకలను సమర్పించుకున్నారు బిలియనీర్‌ , రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.

కాగా ఇషా అంబానీ, ఆనంద్‌ పిరామల్‌ వివాహం ముహూర్తం డిసెంబర్ 12వ తేదీగా నిర్ణయించారు. వీరి పెళ్లి వేడుకకు ముందు నిర్వహించే పూజా కార్యక్రమాలు, ఇతర వేడుకలు డిసెంబర్‌ 8నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. సంప్రదాయ రాజస్థానీ శైలిలో ఉదైపూర్ ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారని భావిస్తున్నారు. కాస్ట్లీ వెడ్డింగ్‌గా చెబుతున్న ఈ కార్పొరేట్‌ దిగ్గజాల వివాహప్రక్రియలో ప్రతీ అంశమూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇటలీలోని లేక్ కామోలో ఒక విలాసవంతమైన విల్లాలో జంట నిశ్చితార్థ కార్యక్రమంతోపాటు,  వీరి వివాహ ఆహ్వాన పత్రికలు కూడా ప్రత్యేక  ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement