
ముంబై: భారతీయ కుబేరుడు ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్ పిరమాల్ వివాహం ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట వివాహ వేడుకలకు వచ్చిన అతిథులకు బాలీవుడ్ తారా గణం కొసరి కొసరి వడ్డించడం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ అగ్రతారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లతో పాటు ఏడేళ్ల ఆరాధ్య కూడా భోజనం వడ్డిస్తూ అతిథులకు మర్యాద చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతుంది.
ఇషా పెళ్లికి హాజరైన అతిథులకు బాలీవుడ్ తారలు మర్యాదలు చేయడంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై అభిషేక్ ట్విటర్‌లో స్పందించారు. ‘పెళ్లి వేడుకల్లో అతిథులకు భోజనం వడ్డించే సంప్రదాయాన్ని ‘సజ్జన్ ఘోట్’ అంటారు. వధువు తరఫు కుటుంబ సభ్యులు వరుడి తరఫు వారికి భోజనాలు వడ్డిస్తారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment