ఇషా అంబానీ పెళ్లి వేడుక..! | Isha Ambani Wedding | Sakshi
Sakshi News home page

Dec 13 2018 9:19 AM | Updated on Dec 13 2018 7:42 PM

Isha Ambani Wedding - Sakshi

ముంబై : పెళ్లంటేనే ఆకాశమంత పందిరి - భూదేవంత అరుగు, అతిథులు - ఆర్భటాలు, విందులు - వినోదాలు, సంతోషాలు - సరదాలు. మామూలు పెళ్లిలే ఓ రేంజ్‌లో జరుగుతున్న రోజుల్లో.. ఇక భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నీతా - ముఖేష్‌ అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ, పిరమిల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమిల్‌ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు.. విదేశీ అతిథుల మధ్య అత్యంత వైభవంగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు ఇషా - ఆనంద్‌లు.  పెళ్లి వేదికయిన ముకేశ్‌ అంబానీ స్వగృహం ‘అంటిలియా’ను దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన పూలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.

అనంతరం పెళ్లికుమార్తె ఈశాను సోదరులు ఆకాశ్‌, అనంత్‌, అన్‌మోల్‌ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్‌ పట్టి మండపానికి తీసుకువచ్చారు. నృత్య కళాకారులతో బారాత్‌ బృందం ముందు రాగా.. ఆ వెనకనే రోల్స్‌ రాయల్‌ కారులో వరుడు ఆనంద్‌ పిరమాల్‌, తన  కుటుంబసభ్యులతో కలిసి అంటిలియాకు చేరుకున్నారు. అంబానీ సోదరులు ముకేశ్‌, అనిల్‌లు పెళ్లి కొడుకు ఆనంద్‌ పిరమిల్‌ను సాదరంగా ఎదుర్కొని వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత సంప్రదాయ పద్ధతిలో ఇశా, ఆనంద్‌ల వివాహం జరిగింది.

ఈ వివాహ వేడుకకు హిల్లరీ క్లింటన్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, అమితాబ్‌ దంపతులు, రజనీకాంత్‌ దంపతులు, ఐశ్వర్య-అభిషేక్‌ బచ్చన్‌, సచిన్‌ - అంజలి, ఆమీర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావు, సల్మాన్‌ఖాన్‌, ప్రియాంకా చోప్రా-నిక్‌ జోనాస్‌, అనిల్‌కపూర్‌, సోనమ్‌కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌ - దీపికా పదుకొనే, కరీనాకపూర్‌ - సైఫ్‌, కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. వీరేకాక ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement