ప్రస్తుతం ప్రపంచంలో పెళ్లి అనేది కాస్ట్లీ వ్యవహారం. పెళ్లి పందిరి మొదలు, విందు భోజనాలు, పెళ్లి దుస్తులు దాకా అన్నీ ఖరీదైనవీ. ఇక ఫోటోలు,వీడియోలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు వీటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కలకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఒక ఎత్తయితే, ఫోటోలు ఇంతకు మున్నెడులేని విధంగా ఎవరికీ తీసిపోని విధంగా దుస్తులు ధరించడం ఒక ఎత్తు. ఇందులో పెళ్లి కుమార్తెలు ఫ్యాషన్ లెహంగాలు, డిజైనరీ గౌన్లు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాజాగా దీనికి సంబంధించి ఒక వాదన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కంటే లెహంగాలు అమ్ముకోవడం మేలు అంటూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో అమిత్ జగ్లాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు, ఢిల్లీలోని పాపులర్ షాపింగ్ సెంటర్ చాందినీ చౌక్‌లో రెండే రెండు గంటలు ఉన్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు లక్ష రూపాయల విలువ చేసే లెహంగాలు కూడా అలా హాట్ కేకుల్లా అమ్ముడు బోతున్నాయి. ఇలా ఎగరేసుకుపోతున్నారంతే.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అందుకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, లెహంగాలు అమ్మడంపైనే దృష్టి పెట్టండి అంటూ ఒక సలహా ఇచ్చిపడేశాడు. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ సార్ కొంతమంది అంటే.. ఈ పోలిక అస్సలు బాగాలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే లెహంగాస్ అమ్మడం చాలా కష్టం అని ఒకరు,. ఉద్యోగాలు వల్ల రెగ్యులర్‌గా జీతం వస్తుంది.. కానీ వ్యాపారంలో ఆదాయం సీజనల్‌గా వస్తుంది, 100 రెట్లు మూలధనం కావాలి అంటూ స్పందించారు.
అయితే లెహంగాలు విక్రయించడం అంటే అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఏదైనా పరిశ్రమలో వృద్ధి చెందాలంటే, వృత్తి ఏదైనా హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. లెహంగా సేల్స్ అయినా. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ అయినా అంటూ ఒకరు స్పందించారు. అసలు"లెహంగా అమ్మే ప్రయత్నం చేశారా అమిత్?" ఇందుకోసం ఎలాంటి లక్షణాలు కావాలో కూడా మీకు తెలుసా? అసలు కామెంట్లు పాస్ చాలా ఈజీ. కానీ కష్టపడితే తెలుస్తుంది అని ఒకరు రిప్లై ఇచ్చారు. మొత్తంగా ఈ ట్వీట్ పది లక్షల వ్యూస్‌ను, సుమారు 7వేల కామెంట్లను సాధించింది.
Been in Chandni chowk only 2 hours.
— Amit Jaglan (@iamjaglan) December 2, 2023
One advice:
Leave your software job and just sell lehngas.
I am at a loss of words.
Lehngas north of 1 lakh rupees flying off the counters.
Comments
Please login to add a commentAdd a comment