
PC: Mithila Palkar
Mithila Palkar- Fashion Brands: సినిమా అభిమానులకు ‘కారవాన్’, వెబ్ ప్రియులకు ‘లిటిల్ థింగ్స్’ తెలిస్తే.. మిథిలా పాల్కర్ తెలిసినట్టే! ఆమె నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆమె ఫ్యాషన్‌కూ అంతేమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ గ్లామర్‌ను మెరిపిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..
ఏకయా...
చేనేత బట్టలకు కూడా లగ్జరీని అందించిన మొదటి బ్రాండ్ ‘ఏకయా’. నాలుగు తరాలకు పైగా బనారస్ సిల్క్ దుస్తుల సంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఈ బ్రాండ్ పేరుగాంచింది. సుమారు పదివేల మందికి పైగా చేనేత కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు.
ఇవి చేనేత దుస్తులే అయినా సామాన్యుడికి ధరించడం అసాధ్యమే. కారణం ధరలే. డిజైన్‌ని బట్టి ఆ ధరలు అందనంత ఎత్తులో ఊరిస్తుంటాయి. ఆన్‌లైన్ లోనూ కొనుగోలు చేసే వీలుంది.
ఆమ్రపాలి జ్యూయెలరీ
రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇక్కడ వివిధ సంప్రదాయ ఆభరణాలను చూడొచ్చు. నచ్చితే కొనుగోలూ చేసుకోవచ్చు. అయితే ధర మాత్రం లక్షల్లో ఉంటుంది.
అందుకే ఆ యాంటిక్ జ్యూయెలరీకి రెప్లికా డిజైన్స్‌ను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చారు. ఆమ్రపాలి ట్రైబల్ డిజైన్ ఆభరణాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్ వీటిని ఇష్టపడతారు. ఆన్‌లైన్ లోనూ కొనుగోలు చేయొచ్చు.
బ్రాండ్ వాల్యూ
బ్రాండ్: ఏకయా
ధర: రూ. 74,975
జ్యూయెలరీ
బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
మా అక్క బట్టలే వేసుకుంటా
షాపింగ్ చాలా తక్కువగా చేస్తా. ఎందుకంటే మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. చాలా మంది ఇళ్లల్లో చెల్లెళ్లు.. అక్కల బట్టలు వేసుకుంటున్నట్టే మా ఇంట్లోనూ నేను మా అక్క బట్టలే వేసుకుంటా ఎక్కువగా! – మిథిలా పాల్కర్
-దీపికా కొండి
చదవండి: Retro Style: రెట్రో స్టైల్.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా
Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్! చీర ధర ఎంతంటే