benaras
-
దటీజ్ నీతా అంబానీ : ఈ బెనారసీ చీర స్పెషాల్టీ ఏంటో తెలుసా?
సందర్భానికి తగినట్టు దుస్తులను, నగలను, అలంకరణను ఎంచుకోవడంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీది ఎపుడూ అందెవేసిన చేయి. పట్టు చీరలు, బెనారసీ, స్వదేశీ నేత చీరలు అంటే ఆమెకు ప్రాణం. తాజాగా తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి గుట్టపూసల నెక్లెస్, స్టైలిష్ చెవిపోగులు, బన్, గజ్రా (మల్లె పూల దండ)తో ఇలా ప్రతీ విషయంలో తన ష్యాషన్ స్టయిల్‌ను చాటుకున్నారామె. తన సిగ్నేచర్ స్టైల్లో ఆమె లుక్, ముఖ్యంగా చీరలోని మరో ప్రత్యేకత విశేషంగా నిలిచింది. అనంత్-రాధిక వివాహ సన్నాహాకాలు జోరందుకున్న నేపథ్యంలో జూలై 12,మంగళవారం నిరుపేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలో నీతా అంబానీ ముదురు ఎరుపు రంగు బెనారసీ చీరలో మహారాణిలా కనిపించారు. ముఖ్యంగా చీర ఒక విషయంలో అందరినీ ఆకర్షించింది. పవిత్ర గాయత్రీ మంత్రాన్ని బంగారంతో ఎంబ్రాయిడరీ చేయించడమే దీనికి కారణం. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బంగారు జరీ వర్క్, పక్షుల డిజైన్‌తో తీర్చి దిద్దిన అద్భుతమైన బెనారసి చీరకు తగ్గట్టుగా గుట్టపూసల నెక్లెస్‌ను ధరించారు. ఈ నెక్లెస్ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాంప్రదాయ దక్షిణ భారత డిజైన్‌తో పోలి ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే చెవిపోగుల్లో శ్రీకృష్ణుని బొమ్మను కూడా గమనించవచ్చు.కాగా సామూహిక వివాహ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు పెద్ద కుమారుడు, ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ పిరమల్,, భర్త ఆనంద్ పిరమల్ పాల్గొన్నారు. శ్లోకా, నీతా ఇద్దరూ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. దేశవిదేశాలకు అతిరథ మహారథులసమక్షంలో జూలై 12న అనంత్-రాధిక వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. -
ఈ నటి ధరించిన డ్రెస్ ధర 74,975! ఏకయా బ్రాండ్ స్పెషాలిటీ అదే
Mithila Palkar- Fashion Brands: సినిమా అభిమానులకు ‘కారవాన్’, వెబ్ ప్రియులకు ‘లిటిల్ థింగ్స్’ తెలిస్తే.. మిథిలా పాల్కర్ తెలిసినట్టే! ఆమె నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆమె ఫ్యాషన్‌కూ అంతేమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ గ్లామర్‌ను మెరిపిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. ఏకయా... చేనేత బట్టలకు కూడా లగ్జరీని అందించిన మొదటి బ్రాండ్ ‘ఏకయా’. నాలుగు తరాలకు పైగా బనారస్ సిల్క్ దుస్తుల సంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఈ బ్రాండ్ పేరుగాంచింది. సుమారు పదివేల మందికి పైగా చేనేత కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవి చేనేత దుస్తులే అయినా సామాన్యుడికి ధరించడం అసాధ్యమే. కారణం ధరలే. డిజైన్ని బట్టి ఆ ధరలు అందనంత ఎత్తులో ఊరిస్తుంటాయి. ఆన్లైన్ లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఆమ్రపాలి జ్యూయెలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇక్కడ వివిధ సంప్రదాయ ఆభరణాలను చూడొచ్చు. నచ్చితే కొనుగోలూ చేసుకోవచ్చు. అయితే ధర మాత్రం లక్షల్లో ఉంటుంది. అందుకే ఆ యాంటిక్ జ్యూయెలరీకి రెప్లికా డిజైన్స్‌ను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చారు. ఆమ్రపాలి ట్రైబల్ డిజైన్ ఆభరణాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్ వీటిని ఇష్టపడతారు. ఆన్లైన్ లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ బ్రాండ్: ఏకయా ధర: రూ. 74,975 జ్యూయెలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మా అక్క బట్టలే వేసుకుంటా షాపింగ్ చాలా తక్కువగా చేస్తా. ఎందుకంటే మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. చాలా మంది ఇళ్లల్లో చెల్లెళ్లు.. అక్కల బట్టలు వేసుకుంటున్నట్టే మా ఇంట్లోనూ నేను మా అక్క బట్టలే వేసుకుంటా ఎక్కువగా! – మిథిలా పాల్కర్ -దీపికా కొండి చదవండి: Retro Style: రెట్రో స్టైల్.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్! చీర ధర ఎంతంటే -
Arpita Mukherjee: వహ్వా.. గౌహర్ జాన్ పాత్రలో జీవించిన అర్పిత!
ప్లేబ్యాక్సింగర్గా పరిచితమైన అర్పిత ముఖర్జీ పరకాయ ప్రవేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు! కాని రంగస్థలంపై లెజండరీ సింగర్ గౌహర్ జాన్ పాత్రలో జీవించిన తీరు చూస్తే ఆమెకు పరకాయ ప్రవేశం వచ్చునని కాస్త సరదాగా అనుకోవచ్చు. గౌహర్ జాన్ జీవితంపై రూపొందించిన ‘మై నేమ్ ఈజ్ జాన్’ ప్లేలో అర్పిత ముఖర్జీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. నటన–నాట్యం– గానం మేళవింపు ఈ ప్లే. పాపులర్ ఓల్డ్ బెంగాలీ సాంగ్స్, పంజాబీ టప్పా, గుజరాత్ క్లాసికల్... ఒకటా రెండా కనుల విందుకు తోడు వీనుల విందు! ‘రంగస్థల గౌహర్ జాన్’ను చూసే ఇంత అబ్బురపడుతున్న ప్రేక్షక సమూహాలకు వాస్తవజీవితంలోని వ్యక్తి కళ్ల ముందు నిలిస్తే ఎంత అపురూపమో కదా అనిపిస్తుంది. ఈ తరానికి బొత్తిగా పరిచయం లేని పేరు... గౌహర్ జాన్. తొలితరం గ్రామ్‌ఫోన్ రికార్డ్ సింగర్ గా ప్రసిద్ధురాలైన గౌహర్ జాన్ ఎన్నో భాషల్లో 700 పాటలు పాడి ‘ది గ్రామ్‌ఫోన్ గర్ల్’ ‘ది ఫస్ట్ రికార్డింగ్ సూపర్‌స్టార్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. భారతీయ భాషల్లోనే కాదు అరబిక్, పర్షియన్, ఫ్రెంచ్.. మొదలైన భాషల్లోనూ పాటలు పాడి మెప్పించింది. ఈకాలంలో గౌహర్జాన్ను గుర్తు చేసుకోవడం అంటే... ఒక గాయని వ్యక్తిగతజీవితం తెలుసుకోవడం కాదు. చరిత్ర లోతుల్లోకి వెళ్లడం. ఆకాలంలో ప్రతిభావంతులైన మహిళలు ఎన్నెన్ని కష్టాలను భరించి, ఆ కష్టాలకు వెరవకుండా, లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నతస్థాయికి ఎలా చేరారో తెలుసుకోవడం. గౌహర్ జాన్ 1873లో ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించింది జాన్. ఇంజనీర్ రాబర్ట్ యెవర్డ్, గాయని, నృత్యకారిణి ఎలెన్ విక్టోరియా హెలెన్‌లకు జన్మించిన ఏంజెలినా యెవర్డ్ ‘గౌహర్ జాన్’గా గొప్ప పేరు తెచ్చుకునే స్థాయికి ఎదగడం వరకు నడిచింది నల్లేరుపై నడక కాదు. ముళ్ల కంచెపై ప్రయాణం. గొంతులో దాగిన విషయాన్ని కప్పిపెట్టి...అమృతంలాంటి పాటలు పాడింది. కాళ్లకు గుచ్చుకున్న ముండ్లను తీసేసి... అపురూపమైన నృత్యం చేసింది. ఒకానొకరోజు మిస్టర్ రాబర్ట్ భార్యా పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. ఉన్న ఊరు నుంచి పొట్ట చేతపట్టుకొని బిడ్డను తీసుకొని బెనారస్‌కు వెళ్లింది విక్టోరియా. అక్కడ ఖుర్షీద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కూతురి పేరుని ‘గౌహర్ జాన్’గా మార్చింది. ఈ పేరుతోనే కాకుండా ‘మల్కా జాన్’గా కూడా ప్రసిద్ధురాలైంది ఏంజెలినా. ప్రముఖ ఆడియో కంపెనీ ఒకటి గౌహర్ జాన్ ఆణిముత్యాలను రీ–రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉంది. రేపో మాపో బాలీవుడ్లో గౌహర్ జాన్ బయోపిక్ వార్త కూడా వినవచ్చు! చదవండి: Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ -
శిష్యుడిపై గురువుదే విజయం
⇒ కాశీ మఠం మఠాధిపతి సుధీంద్ర తీర్థ స్వామే ⇒ ఆ స్థానాన్ని ఆయన పరిత్యజించలేదు ⇒ తేల్చి చెప్పిన ఉమ్మడి హైకోర్టు ⇒ రాఘవేంద్ర తీర్థ స్వామి అప్పీళ్లు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముఖ్యమైన మఠాల్లో ఒకటైన కాశీ మఠం, బెనారస్ మఠాధిపతి విషయంలో జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటంలో శిష్యుడిపై గురువు విజయం సాధించారు. కాశీమఠం, బెనారస్ మఠాధిపతిగా శ్రీమధ్ సుధీంద్ర తీర్థ స్వామే కొనసాగుతారని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. మఠాధిపతి స్థానాన్ని ఆయన పరిత్యజించలేదని తెలిపింది. తాను కాశీమఠం, బెనారస్ మఠాధిపతిగా నియమితులయ్యానంటూ సుధీంద్ర స్వామి శిష్యుడు శ్రీమధ్ రాఘవేంద్ర తీర్థ స్వామి చేస్తున్న వాదనను తోసిపుచ్చింది. మఠాధిపతి స్థానాన్ని సుధీంద్ర తీర్థ స్వామి పరిత్యజించారని రుజువు చేసేందుకు రాఘవేంద్ర తీర్థ స్వామి ఎటువంటి ఆధారాలు చూపలేదని తేల్చిచెప్పింది. ఇదేసమయంలో మఠాధిపతి స్థానాన్ని తాను పరిత్యజించలేదని సుధీంద్ర స్వామి రుజువు చేయగలిగారని తెలిపింది. ఇందుకు సంబంధించి కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాఘవేంద్ర తీర్థ స్వామి దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. మఠాధిపతి స్థానాన్ని సుధీంద్ర తీర్థ స్వామి పరిత్యజించారని, దీంతో ఆయన శిష్యుడిగా తాను మఠాధిపతినయ్యానంటూ రాఘవేంద్ర స్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మఠం వ్యవహారాల్లో సుధీంద్ర స్వామితోసహా ఇతరులెవ్వరినీ జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ తిరుపతి కోర్టులో 2000 సంవత్సరంలో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు రాఘవేంద్రస్వామి పిటిషన్‌ను 2009లో కొట్టేసింది. దీనిపై ఆయన అదేఏడాది హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. మఠాచారాల ప్రకారం మఠాధిపతి మహాసమాధి అయ్యాకనే ఆయన వారసుడిని మఠాధిపతిగా నియమిస్తారని జస్టిస్ నాగార్జునరెడ్డి తన 34 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సుధీంద్ర స్వామి కేవలం పాలన వ్యవహారాలు, ఇతర దైవిక వ్యవహారాల బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నారని గుర్తుచేశారు. మఠాధిపతిగా కొన్ని బాధ్యతలను శిష్యుడికి అప్పగించడానికీ, మఠాధిపతి స్థానాన్ని పరిత్యజించడానికీ తేడా ఉందన్నారు. కొన్ని బాధ్యతలను శిష్యుడికి అప్పగించాక కూడా మఠపెద్దగా మఠాధిపతి స్థానంలో కొనసాగేందుకు సుధీంద్ర స్వామికి అధికారముందని తేల్చారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఓ మఠానికి చెందిన మఠాధిపతి శిష్యుడు గద్దెకోసం తన గురువునే వివాదంలోకి లాగారు. కింది కోర్టులో చుక్కెదురైనా తను అనుకున్నది పొందేందుకు హైకోర్టును ఆశ్రయించారు. తన గురువుపైనే ఈ సన్యాసి చేస్తున్న న్యాయపోరాటాన్ని చూస్తుంటే, ఇటువంటి వ్యక్తులు కూడా సాధారణ వ్యక్తులవలే ఉన్నత స్థానాలకోసం వెంపర్లాడుతారా? అని ఆశ్చర్యం కలుగుతోంది. - జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి