Trending Western Style Beautiful Painting Lehenga - Sakshi
Sakshi News home page

పెయింటింగ్‌ లెహంగా.. కొంచెం వెస్ట్రన్‌ స్టైల్‌లో..!

Published Fri, Oct 22 2021 11:19 AM | Last Updated on Fri, Oct 22 2021 5:34 PM

Trending Western Style Beautiful Painting Lehenga - Sakshi

ఏ వేడుక అయినా అమ్మాయిలకు వెంటనే గుర్తుకు వచ్చేది లెహంగా! పూర్తి సంప్రదాయంగా కాకుండా... కొంచెం వెస్ట్రన్‌ స్టైల్‌ కూడా మిక్స్‌ అవాలని కోరుకుంటారు. అందుకు సరైన ఎంపిక ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌తో ముస్తాబు చేసిన ముచ్చటైన లెహంగా!!

దినచర్యలో భాగంగా ఉదయాన్నే పూలను సేకరించే చేతులు, అందంగా అలంకరించుకుంటున్న అతివలు, ఆనంద నృత్యకేళీ, అంబారీ యాత్ర... బొమ్మలా కనిపించే అమ్మాయిల లెహంగా పైన రూపుదిద్దుకున్న అందమైన ఈ బొమ్మలు మరింత ఆకర్షణీయంగా చూపులను కొల్లగొడుతున్నాయి. సంప్రదాయ వేడుకలకు, వెస్ట్రన్‌ గెట్‌ టు గెదర్‌లకు మరిన్ని వన్నెలను అద్దుతున్నాయి. ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌లో వచ్చిన కొత్త నైపుణ్యాలు, మరిన్ని డిజైన్లు లెహంగాలను మరింత వైభవంగా అలంకరిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ–పెయింటింగ్‌ కాంబినేషన్‌లోనూ వచ్చే డిజైన్లు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.

చదవండి: మందారం- ఉసిరి: ఈ ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement