new style
-
ధోనిని ఇలాంటి స్టైల్లో ఎప్పుడైనా చూశారా?
-
డాన్స్ అనేది వైరల్ అని ఎందుకంటారంటే..
-
Pocket Dress: ఆమె ధరించే దుస్తులకు.. ప్రయోగాల పాకెట్!
‘మీరు బయటకు వెళ్లే సమయం లో వెంట ఓ ఫోన్, కొంత డబ్బు, కార్డుల్లాంటివి తీసుకెళ్లడం తప్పనిసరి. మీ డ్రెస్‌కి జేబులు ఉంటే చేతులను ఫ్రీగా వదిలేసి, సౌకర్యంగా ప్రయాణించే వీలుంటుంద’నే లక్ష్యంతో దుస్తులను రూపొందించి, దానినే వ్యాపారంగా మార్చుకుంది కేరళవాసి జయలక్ష్మి. ‘మహిళల దుస్తులను నేటి కాలానికి తగిన విధంగా రూపొందించాలి. ఆమె ధరించే దుస్తులకు పాకెట్స్ ఉండటం వల్ల ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని గుర్తించాలి’ అంటారు త్రిసూరులో ఉంటున్న జయలక్ష్మీ రంజిత్. పాకెట్స్.13 పేరుతో ప్రస్తుత స్థితిని మార్చడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నానంటోంది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! లాక్డౌన్ టైమ్‌లో రూపకల్పన పాకెట్స్ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినిదే అయినా 20 వ శతాబ్దం వరకు మహిళ లు ఉపయోగించే దుస్తులకు జేబులు ఉండటం అరుదైన విషయమే. ‘అవి కూడా చాలా సన్నగా ఉన్న మహిళలు ధరించే ప్యాంట్స్‌కు అంతే నాజూకుగా, శృంగారపు మూలాలకు సూచికగా ఉండేవి’ అంటారు జయలక్ష్మి. అగ్రికల్చర్ ఇంజినీర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అయిన జయలక్ష్మి కరోనా సమయంలో పరిస్థితుల కారణంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఖాళీగా ఉన్న ఆ సమయం తన ఆలోచన రూపుకట్టడానికి బాగా ఉపయోగపడిందనే జయలక్ష్మి, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ పాకెట్ డ్రెస్ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. చిన్నప్పుడే అనుకున్నాను మహిళల కోసం రూపొందించిన జీన్స్, ప్యాంట్లను జయలక్ష్మి తరచి తరచి చూస్తుంటుంది. ‘ఎందుకంటే, నేను పురుషులకు రూపొందించిన నా సైజు జీన్స్ కొన్నాను. వాటిని ధరించి, నా ఫోన్ వెనుక జేబులో ఉంచినప్పుడు, అది జారి కిందపడిపోయింది. పైగా నాకు అలా వెనుక వైపు పాకెట్‌ను ఉపయోగించే అలవాటు లేదు. చిన్న చిన్న పాకెట్స్ కేవలం కొన్ని నాణేలు ఉంచడానికి సరిపోతాయి. అందుకే, పురుషులందరికీ ఒకే విధంగా ఉండేలాంటి ఫంక్షనల్ పాకెట్స్ మహిళల దుస్తుల్లో ఉండకూడదనుకున్నాను’ అని తన పాకెట్ రూపకల్పన గురించి వివరిస్తుంది. ‘నాకు ఆరేడేళ్ల్ల వయసున్నప్పుడు డ్రెస్‌కు పాకెట్స్ పెట్టించమని మా అమ్మను అడిగేదాన్ని. దానికి మా అమ్మ పెద్ద శిక్షగా భావించేది. నేనే టైలర్ ఆంటీతో పరిచయం పెంచుకొని, నచ్చిన పాకెట్స్‌తో డ్రెస్ కుట్టించుకునేదాన్ని’ అని తన చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. జేబును బట్టి డ్రెస్ చదువు, ఉద్యోగం కోసం నగరానికి వెళ్లినప్పుడు కూడా ‘పాకెట్స్’అనే విషయం జయలక్ష్మి నుంచి దూరం కాలేదు. తన డ్రెస్సులను తనే సొంతంగా డిజైన్ చేసుకునేది. స్నేహితులు, సహోద్యోగులు ఆమె పాకెట్ దుస్తులను చూసి, తమకు కూడా డిజైన్ చేసిమ్మని అడిగేవారు. ‘అప్పుడు సమయం కుదరలేదు. మహమ్మారి మొదట్లో తగినంత సమయం ఉండేది. దీంతో కొన్ని డిజైన్లు పాకెట్ ఆధారంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించాను. చిన్న, మధ్యస్థ, లార్జ్ డ్రెస్సుల్లోనూ వాటికి తగిన విధంగా పాకెట్స్ రూపొందించాను. కొన్ని డిజైన్లు అందంగా ఉన్నాయని, కొన్ని డిజైన్లు అంతగా నప్పలేదని నా స్నేహితులే చెప్పారు. చాలా బాధపడ్డాను కూడా. దీంతో కొంతమంది టైలర్లను కలిసి, వారితో నా డిజైన్ల గురించి చర్చించాను. కొన్ని డిజైన్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘ఆర్డర్ చేసుకున్నవారు మీ శరీర కొలతలను పంపిస్తే, దానిని బట్టి రెండు వారాల్లో పాకెట్ డ్రెస్ డిజైన్ చేసి, పంపిస్తాను’ అని చెప్పాను. అలా ఒక రోజులో రూ.70 వేలు సంపాదించాను’ అంటారు జయలక్ష్మి. మార్కెట్లో పాకెట్ డ్రెస్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాకెట్స్.13ను వివిధ వాణిజ్య బ్రాండ్లకు దీటుగా రంగంలోకి దింపుతోంది జయలక్ష్మి. చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో.. -
Trending Style: పెయింటింగ్ లెహంగా.. కొంచెం వెస్ట్రన్ స్టైల్లో..!
ఏ వేడుక అయినా అమ్మాయిలకు వెంటనే గుర్తుకు వచ్చేది లెహంగా! పూర్తి సంప్రదాయంగా కాకుండా... కొంచెం వెస్ట్రన్ స్టైల్ కూడా మిక్స్ అవాలని కోరుకుంటారు. అందుకు సరైన ఎంపిక ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌తో ముస్తాబు చేసిన ముచ్చటైన లెహంగా!! దినచర్యలో భాగంగా ఉదయాన్నే పూలను సేకరించే చేతులు, అందంగా అలంకరించుకుంటున్న అతివలు, ఆనంద నృత్యకేళీ, అంబారీ యాత్ర... బొమ్మలా కనిపించే అమ్మాయిల లెహంగా పైన రూపుదిద్దుకున్న అందమైన ఈ బొమ్మలు మరింత ఆకర్షణీయంగా చూపులను కొల్లగొడుతున్నాయి. సంప్రదాయ వేడుకలకు, వెస్ట్రన్ గెట్ టు గెదర్‌లకు మరిన్ని వన్నెలను అద్దుతున్నాయి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లో వచ్చిన కొత్త నైపుణ్యాలు, మరిన్ని డిజైన్లు లెహంగాలను మరింత వైభవంగా అలంకరిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ–పెయింటింగ్ కాంబినేషన్లోనూ వచ్చే డిజైన్లు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. చదవండి: మందారం- ఉసిరి: ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు! -
వారెవ్వా ఆయుషి ! సర్దుకుపోలేదు.. సమస్యకు పరిష్కారం చూపింది
నలుగురితో నారాయణ గుంపులో గోవిందా అనుకుంటూ సమస్యలతో సర్దుకుపోవడం అందరూ చేసే పని. కానీ ఆ మహిళా అలా చేయలేదు. సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఊరూరా తిరుగుతూ టేపుతో కొలతలు తీసుకుంది.. ఆఫీసులో చీపురు పట్టి ఊడ్చింది.. చివరకు అనుకున్నది సాధించింది. దేశ వ్యాప్తంగా లక్షల మంది మహిళలు ఏళ్ల తరబడి సర్దుకుపోతున్న సమస్యలకు పరిష్కారం చూపింది. ఒకప్పుడు ఇళ్లకే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రోడ్డు పక్కన కూరగాయల షాపు మొదలుపెడితే కార్పొరేట్ ఆఫీసులో పెద్ద పనుల వరకు చక్కబెడుతున్నారు. కిక్కిరిసిన సిటీ బస్సులతో పాటు ఫ్లైట్లలో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూడా వెళ్తున్నారు. ఇలా వర్క్‌కి వెళ్తున్న మహిళలు బయట ఎదుక్కొంటున్న సమస్యకి పరిష్కారంగా ఓ స్టార్టప్ ప్రాణం పోసుకుంది. కంఫర్ట్ ఎక్కడ ? ఆయుషి గుడ్వాని ఢిల్లీలో సంపన్న కుటుంబానికి చెందిన యువతి. ఆర్థికంగా లోటు లేకపోయినా కట్టుబొట్టు విషయంలో సంప్రదాయం పాటించాలని కోరుకునే కుటుంబం నుంచి వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన వెంటనే ఐఐఎం కలకత్తాలో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ వెంటనే 2008లో మెక్‌కెన్సీ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించింది. సంప్రదాయ చుడీదార్ లేదా చీరకట్టులో ఆఫీస్‌కి వెళితే పెన్ను, ఫోను, పర్సు, ఐడీ కార్డు, ఫైల్స్ ఇలా అన్ని చేతితోనే పట్టుకుని పని చేయాల్సి వచ్చేది. అయితే ఫారిన్ టూర్లకు వెళ్లేప్పుడు అక్కడి దుస్తులే ప్రిఫర్ చేసేది. స్టార్టప్‌కి బీజం ఫారిన్ టూర్లలో ధరించే వర్క్ కల్చర్‌కి తగ్గట్టుగా ఉండేవి. అయితే ఆ బట్టలు ఇండియాలో ప్రతీ రోజు ధరించడం ఇబ్బందిగానే ఉంటుంది. విదేశాల్లో లభించే వర్క్ వేర్ అంతా అక్కడి కల్చర్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందుతాయి. ఇక్కడి వేడి వాతావరణ పరిస్థితులకు లోకల్ కల్చర్‌కి అవి పూర్తిగా నప్పవు. కానీ ఇండియాలో ఆఫీసులకు వెళ్లేందుకు మహిళలకు వర్క్ వేర్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇంట్లో ధరించే చీరకట్టు, చుడీదార్ వంటి సంప్రదాయ దుస్తులు తప్ప సరైన ప్రత్యామ్నాయం అందుబాటులో లేవు. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ఆటో డ్రైవర్ల నుంచి కార్పొరేట్ కంపెనీ సీఈఓలుగా లక్షల మంది మహిళలు వివిధ పనుల్లో ఉంటే వారి కోసం ప్రత్యేకంగా వర్క్ వేర్ లేకపోవడం పెద్ద లోటని ఆయుషి గుడ్వానీకి గుర్తించింది. ఉద్యోగానికి రాం రాం అసలే ఐఐఎం స్టూడెంట్ దానికి బ్యాక్‌గ్రౌండ్ బీటెక్ చదివింది ఆయుషి. ఓ సమస్య దాని వెంటే ఓ అవకాశం కనిపిస్తుంటే ఊరుకుంటుందా? వెంటనే తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా వినకుండా చేస్తున్న బంగారంలాంటి ఉద్యోగానికి 2015లో రాజీనామా చేసింది. చేతిలో ఉన్న సేవింగ్ మనీతో వర్క్ వేర్ మీద మనసు లగ్నం చేసింది. టేపు చేతబట్టి విదేశాల్లో ఒకే భాష ఒకే తరహా మనుషులు ఉంటారు. కానీ భారత్ పరిస్థితి దానికి భిన్నం, విభిన్న వాతావరణ పరిస్థితులు, భిన్న శరీర ఆకృతులు కలిసిన మనుషులు ఇక్కడున్నారు. వీరి తగ్గట్టుగా బట్టలను డిజైన్ చేయడం అతి పెద్ద సవాల్‌గా మారింది ఆయుషికి. కానీ పట్టు వదల్లేదు. ధైర్యం కోల్పోలేదు. ఒక్కతే బ్యాగులో చిన్న సైజు టేపు పెట్టుకుని ఆఫీసులు, అపార్ట్మెంట్లు, వీధుల వెంట తిరిగింది. వేయి మందికి పైగా మహిళల దగ్గర నుంచి కొలతలు తీసుకుంది. ఇలా ఏడాది పాటు శ్రమించి వాటి సాయంతో టెక్నాలజీ సాయంతో ఓ అల్గారిథం తయారు చేసింది. దాని ఆధారంగా మూడు భిన్న సైజుల్లో డ్రెస్సులు రూపొందిస్తే అవి ఇండియన్లకు నప్పుతాయనే నమ్మకానికి వచ్చింది. ఆన్‌లైన్‌తో మొదలు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తూ సేవ్ చేసిన మనీ అంతా ఏడాది పాటు రీసెర్చ్‌కే అయిపోయింది. ఉన్న కొద్ది పాటు డబ్బులతో వర్క్ వేర్ తయారు చేసింది. వాటిని ఫాబుల్ స్ట్రీట్ పేరుతో ఆన్లైన్లో 2016లో అమ్మకానికి పెట్టింది. కొత్త బ్రాండ్ ప్రచారం చేసేందుకు డబ్బులు చాలక ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా వంటి షోషల్ మీడియా ఫ్టాట్ఫామ్స్నే ఆమె నమ్ముకుంది. అప్పటికే ఆమెకు ఉన్న పరిచయాలతో తన స్నేహితులు, పరిచయస్తులకు తన డిజైన్స్ చూపించింది. అక్కున చేర్చుకున్నారు ఆఫీస్‌లో వర్క్ చేసుకునేందుకు అనువుగా ఉంటూ ఫ్యాషనబుల్ ఇక్కడి సెంటిమెంట్స్‌ని హర్ట్ చేయని ఫాబుల్ స్ట్రీట్ స్టైల్‌ను వర్కింగ్ విమెన్ అక్కున చేర్చుకున్నారు. ఏళ్ల తరబడి ఇంటి వాతావరణానికి అనువైన సంప్రదాయ దుస్తుల్లోనే ఇంటి బయట నెట్టుకొస్తున్న వర్కింగ్ క్లాస్ విమెన్‌కి ఆయుషి చేసిన డిజైన్స్ వరంలా తోచాయి. స్టైల్, కంఫర్ట్, క్వాలిటీ అందించే ఈ బట్టలను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆదరించారు. హ్యాండ్స్ ఫ్రీ బయట పనుల్లో ఉండే మగవారికి అవసరాలకు తగ్గట్టుగా షర్ట్, ప్యాంట్స్లకు జేబులు ఉంటాయి. కానీ మహిళలకు ఆ సౌకర్యం లేదు. ఏమైనా చేతిలో పట్టుకోవాల్సిందే లేదా బ్యాగును వెంట తెచ్చుకోవాల్సిందే. ఈ ఇబ్బందులు తొలగించేందుకు రూమీ పాకెట్స్‌ను పరిచయం చేసింది. ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ విమెన్ వర్కింగ్ వేర్ ఫ్యాషన్‌కి కొత్త బాటలు వేసింది. రెండేళ్లకే ఫ్యాబుల్స్ట్రీట్ మార్కెట్లో దూసుకుపోతున్న తీరుతో ఒక్కసారిగా వెంచర్ క్యాపిటలిస్టులు ఆయుషిని సంప్రదించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన స్టార్టప్‌లో మూడేళ్లకే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో కంపెనీ మరింతగా విస్తరించి వర్కింగ్ వేర్‌తో పాటు యాక్సెసరీస్ సైతం పరిచయం చేసింది. అన్నీ తానై ఎంఎన్సీ కంపెనీలో ఏడేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ హోదాలో అన్ని సౌకర్యాలను వదులుకుని తాను పడ్డ ఇబ్బందులు, తాను చూసిన అవకాశాల కోసం పట్టుదలగా పోరాడింది ఆయుషి గుడ్వానీ. తొలిసారిగా ఫాబుల్ స్ట్రీట్ స్థాపించినప్పుడు ఆఫీసు ఊడ్చే పని దగ్గర నుంచి వాటర్ క్యాన్ మార్చే వరకు అన్నీ పనులు ఒక్కతే చేసుకుంది. ఒంటరిగా స్టార్టప్ ప్రారంభించింది. ఇప్పుడు వందల మందికి ఉపాధి ఇవ్వడమే కాదు లక్షల మంది మహిళలకు వర్కింగ్ ప్లేస్‌లో ధరించేందుకు కంఫర్ట్ ఇచ్చే ఫ్యాషనబుల్ డ్రెస్‌లను అందుబాటులోకి తెచ్చింది. సోషల్ ఇంజనీరింగ్ నిజానికి ఫాబుల్ స్ట్రీట్ బ్రాండ్ ప్రీమియం వర్కింగ్ విమెన్ వేర్ కేటగిరిలో దుస్తులను విక్రయిస్తోంది. ఇండియాలో వివిధ పనుల్లో ఉన్న చాలా మంది మహిళలు ఈ దుస్తులు కొనలేకపోవచ్చు. కానీ ఆయుషి పరిచయం చేసిన చుడిదార్ ప్యాకెట్స్, స్ట్రెచ్ , వివిధ డిజైన్ల కాపీలు ఇప్పుడు సాధారణ మార్కెట్లో కూడా లభిస్తున్నాయి. చాలా మంది వర్కింగ్విమెన్ వీటిని ఉపయోగిస్తున్నారు. బిటెక్ చదివిన ఆయుషీ తనకు తెలియకుండానే చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఎక్సపెరిమెంట్ సక్సెస్ అయ్యింది. ఆమెకు మంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చింది. - సాక్షి, వెబ్ ప్రత్యేకం చదవండి: కలిసొచ్చిన కరోనా!.. బిలియనీర్స్ లిస్ట్‌లో రాధాకృష్ణన్ దమానీ -
జేబుర్దస్త్
అమ్మాయిలు సంపాదిస్తున్నారు.దాచిపెట్టుకుంటున్నారు.ఖర్చుపెట్టుకుంటున్నారు.. అబ్బాయిలకంటే ఎక్కువే..మరి జేబులు ఎందుకు తక్కువ? ఎస్..!అమ్మాయిలకీ జేబులుండాలి. జేబుర్దస్త్‌గా జీవించాలి. పాకెట్స్ ప్యాంట్స్‌కి ఉండాలి.. లెహంగాలకు కూడానా! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. సెల్‌ఫోన్, డబ్బులు వంటి అత్యవసరమైన కొన్నింటిని ఎక్కడకు వెళ్లినా తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిందే!వేడుకల్లో పాల్గొవాల్సి వచ్చినా, క్యాజువల్‌గా బయటకువెళ్లాలనుకున్నా వెంట ఓ బ్యాగ్ మోత ఇప్పుడిక అవసరంలేదు. పార్టీవేర్ లెహంగాలకు కూడా పాకెట్స్ వచ్చాయి.ఎంబ్రాయిడరీ లెహంగాలైతే పాకెట్కూ ఎంబ్రాయిడరీఉంటుంది. ప్లెయిన్ లెహంగాలైతే ప్లెయిన్ పాకెట్స్ ఉంటున్నాయి. కొన్ని ప్లెయిన్ లెహంగాలకు ఎంబ్రాయిడరీచేసిన పాకెట్స్ మరింత ఆకర్షణయంగా కనిపిస్తున్నాయి. ఇక నుంచీ మీరూ లెహంగాలకు జేబులు కుట్టించుకొని జేబుర్దస్త్‌గా నయా స్టైల్‌కి వెల్కమ్ చెప్పచ్చు. -
రాంబో బాణాలు.. రాకెట్ బాంబులు
న్యూఢిల్లీ: భద్రతా దళాలపై దాడులు చేయడం కోసం నక్సలైట్లు సరికొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారు. రాంబో బాణాలు, రాకెట్ బాంబులు వంటి ఆధునిక, ప్రాణాంతక సామగ్రితో భద్రతా దళాలకు సవాలుగా నిలుస్తున్నారు. ఈ మేరకు వామపక్ష తీవ్రవాద శిబిరంలో నెలకొన్న ధోరణులపై అధ్యయనం చేసిన ఉమ్మడి భద్రతా దళం (జేఎస్సీ) తాజా నివేదిక వెల్లడించింది. భద్రతా బృందాలకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను ఏమార్చేందుకు మావోయిస్టులు ముడి బాంబులను జంతువుల మలంలో దాచేస్తున్నారని తెలిపింది. 2017 తొలి త్రైమాసికంలో భద్రతా దళాల స్నిఫర్ డాగ్స్ ఈ కారణంగానే గాయపడటం లేదా మృతి చెందాయంది. నక్సల్స్ దాడులకు ఉపయోగించే సరికొత్త పద్ధతుల్లో ప్రముఖమైంది.. పేలుడు పదార్థంతో కూడిన రాంబో బాణం అని పేర్కొంది. గన్ పౌడర్ లేదా మందుగుండు కలిగిన ఆ బాణం లక్ష్యాన్ని తాకగానే పేలుతుంది. రాంబో బాణాలు ఎక్కువ నష్టాన్ని కలిగించకపోయినా భద్రతా సిబ్బందిలో ఆందోళన కలిస్తాయని.. తద్వారా దాడి చేయడానికి మావోలకు ఉపయోగపడతాయంది. -
పాత వంట.. కొత్త మంట
మధ్యాహ్న భోజనంలో కొత్తపద్ధ్దతి ► ఐదారు మండలాలకు ఒక వంటశాల ► అక్కడ నుంచే పాఠశాలలకు మధ్యాహ్న భోజనం ► పరిశీలించి ప్రతిపాదనలు పంపనున్న అధికారులు ► ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు శ్రీకారం మెమోలు జారీ ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీల నిర్వాహకులు నెల్లూరు (టౌన్) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణలో నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రసుత్తం పాఠశాలల్లో వంట చేసి భోజనం వడ్డించే విధానానికి చెక్ పెట్టనున్నారు. కేంద్రీకృత మధ్యాహ్న భోజన విధానాని(సెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్)కి శ్రీకారం చుట్టనున్నారు. దీనిని 2017–18 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలోసెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్ నిర్వహణకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జిల్లాలో 5 ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. 2018–19 విద్యా సంత్సరం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్(కేంద్రీయ భోజన వంటశాల) ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేంద్రీయ వంటశాలకు 5 అనువైన ప్రాంతాలను గుర్తించాలని డెప్యూటీ ఈఓలు, ఎంఈఓలకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు పంపారు. ప్రస్తుతం వెంకటాచలంతో పాటు పలు పట్టణ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్రవిద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నారు. జిల్లాలో మొత్తం 3,441 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న 2,29,434 మంది విద్యార్థులకు భోజనాన్ని వడ్డిస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజన నిర్వహణలో లోపాలు ఉన్నాయని, కొంతమంది వంట ఏజెన్సీ నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలో రుచి లేకుండా వండి పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్ విధానానికి నాంది పలుకుతోంది. ఒకే వంటశాలలో 22 వేల నుంచి 25వేల మంది వరకు పిల్లలకు సకాలంలో వండి పంపిణీ చేసే పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంత సామర్థ్యం ఉన్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖను ఉన్నతాధికారులు ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్‌కు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కిచెన్ స్టోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలను వాటి పరిధిలోకి చేర్చనున్నారు. ఐదారు మండలాలకు ఒకటి జిల్లాలో విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి ఐదారు మండలాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అ వంటశాల నిర్వహణకు రెండు ఎకరాల వీస్తీర్ణం కలిగి ఉండాలని నిర్ణయించారు. 20 కిలో మీటర్ల దూరంలో ఉండే పాఠశాలలు ఈ వంటశాల పరిధిలోకి వచ్చే విధంగా ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు. వంటశాలలో భోజనం, కూరలు వండి ఆయా పాఠశాలలకు వాహనాల్లో తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇస్కాన్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. ఈ విధానంలో పెద్దగా లోపాలు లేకపోవడం, నాణ్యత కలిగి ఉండటంతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా మహిళల ఆగ్రహం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇతరులకు అప్పజెప్పడంపై డ్వాక్రా మహిళలు, ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికులు మండిపడుతున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గతనెల 19న మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మెమోలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 3వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్నాయి. వీరిలో 90శాతానికి పైగా డ్వాక్రా మహిళలే. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అనేకమంది మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆరేడు నెలల నుంచి బిల్లులను నిలిపివేసినా కొంతమంది ముందుగానే పెట్టుబడులు పెట్టి భోజనం వడ్డిస్తున్న సందర్భాలున్నాయి. మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అర్ధంతరంగా ఒకే కేంద్రీయ వంటశాల విధానం అమలు చేస్తే దీని మీద బతుకుతున్న వేలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతారని చెబుతున్నారు. నిర్ణయం ఉపసంహరించుకోవాలి మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలో వేలాదిమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అకస్మాత్తుగా సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్‌ను తెస్తే వీరంతా ఎటుపోవాలి? మహిళా సాధికారిత కోసం ఇసుక, డ్వాక్రా రుణాలు అందజేస్తామని చెప్పిన చంద్రబాబు తర్వాత పట్టించుకోలేదు. తాజా నిర్ణయంతో మధ్యాహ్న భోజనం వడ్డించి ఉపాధి పొందుతున్న మహిళలు అన్యాయమైపోతారు. దీనిమీద ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను కలిసి ఉద్యమ బాట పడతాం. – రెహనాబేగం, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా గౌరవాధ్యక్షురాలు ప్రతిపాదనలు పంపమన్నారు సెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్ అమలుకు తగు ప్రాంతాలు గుర్తించి ప్రతిపాదనలు పంపమని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో ఐదు ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. మరో రెండు రోజుల్లో గుర్తించిన ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం అత్యున్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నాం. ఈ ఏడాది నుంచి కొత్త విధానం ప్రారంభమవుతుంది. – రామలింగం, డీఈఓ