
హాఫ్ శారీ కాదు...ఫుల్ శారీ కాదు... ఇది త్రీ ఫోర్త్ శారీ!
లంగా ఓణీ కాంబినేషన్‌ని హాఫ్ శారీ అని ముచ్చటగా పిలుస్తాం. చీర కట్టును ఫుల్ శారీ అని హుందాగా చెబుతాం. ఈ రెండింటి నడుమ ఇప్పుడు మరో స్టైల్ వచ్చింది. అదే త్రీ ఫోర్త్ శారీ! పొడవాటి లెహంగా లేదా పొట్టి స్కర్ట్ ధరించి దాని మీద అదే కాంబినేషన్ లేదా కాంట్రాస్ట్ చీరను మోకాలు కింది వరకు లెహెంగా కనిపించేలా కట్టాలి. ఇది కాటన్ కాంట్రాస్ట్ కాంబినేషన్‌లో హైలైట్ అయిన స్టైల్. ఇతరత్రా అలంకరణలు అవసరం లేదు. కావాలనుకుంటే ఫంకీ ఫ్యాషన్ జువెల్రీని అలంకరించుకోవచ్చు.
– నిఖిత, డిజైనర్,ఇన్‌స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్
Comments
Please login to add a commentAdd a comment