ఓ టెక్కీ ఫ్యాషన్ రంగంలోకి అడుపెట్టి అద్భుతమైన డిజైన్‌లను క్రియేట్ చేసి ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చాడు. మహామహా ఫ్యాషన్ డిజైనర్‌లకు పోటీ ఇచ్చేలా లెహాంగాలు తీర్చిదిద్ది ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏడాదికి రూ 5 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతూ స్టైలిష్ రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఎవరతను..? ఎలా ఈ రంగంలోకి వచ్చారు.
మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, నాన్సి త్యాగి వంటి ప్రముఖ డిజైనర్లు భారతీయ ఫ్యాషన్‌ని తమదైన శైలిలో పునర్నిర్వచించారు. ఆ కోవలోకి సూరత్‌కి చెందిన మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మయూర్ భరత్‌భాయ్(Mayur Bharatbhai) కూడా చేరిపోయాడు. ఆయన మహిళల కోసం తయారు చేసే ప్రసిద్ధ పెళ్లి లెహంగాల(Lehenga Business) బీఎల్ ఫ్యాబ్రిక్ వ్యవస్థాపకుడు.
ఈ కంపెనీ మూడు రకాల ఎంబ్రాయిడరీ లెహంగాలను తయారు చేస్తుంది. థ్రెడ్‌వర్క్, జరీ వర్క్, సీక్విన్ వర్క్‌లతో రూపొందిస్తుంది. ఈ కంపెనీకి చెందిన సెమీ-స్టిచ్డ్ లెహంగాలు చాలా సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయి. ఈస్టార్టప్ వెంచర్ తన ఉత్పత్తులను సాంప్రదాయ మార్కెట్ల కంటే దాదాపు 65% నుంచి 70% వరకు తక్కువ ధరకే విక్రయిస్తుంది.
అంతేగాదు వినియోగదారులు తమకు నచ్చిన రీతిలో లెహంగాలను డిజైన్ చేయించుకునే వెసులబాటు కూడా అందిస్తోది. అందుకోసం ఈ కంపెనీలో దాదాపు 25 మంది అంతర్గత కళాకారుల బృందం ఉంటారు. ప్రస్తుతం ఈ ఎల్‌బీ ఫ్యాబ్రిక్ వద్ద దాదాపు 200 డిజైన్ల అద్భుతమైన కలెక్షన్లు ఉన్నాయి
ప్రారంభమైంది..
మయూర్ తన దుస్తుల వ్యాపారాన్ని 2021లోనే ప్రారంభించారు. అంతకుముందు తన సోదరుడి దుస్తుల వ్యాపారంలో కొన్నాళ్లు పనిచేశారు. ఆయన సృజనాత్మకతతో కూడిన పనికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ ఆసక్తే ఆయన్ను సాఫ్ట్‌వేర్ రంగం నుంచి ఫ్యాషన్‌వైపు అడుగులు వేసేలా చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికి బీఎల్ ఫ్యాబ్రిక్ 10 శాతం నికర లాభల మార్జిన్‌తో సుమారు రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే ఈ కంపెనీ 2025 నాటికి రూ. 18 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
అంతేగాదు సోనీ టెలివిజన్ సీరీస్ షార్క్‌ట్యాంక్ ఇండియా 4(Shark Tank India 4)సీజన్‌లో న్యాయూమర్తులుగా వ్యవహరించే కునాల్ బహల్, రితేష్ అగర్వాల్ నుంచి కూడా 5% ఈక్విటీకి ఒక కోటి రూపాయల ఉమ్మడి షరతులతో కూడిన ఆఫర్‌ని అందుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అంతేగాదు ఈ షో కోసం తానే స్వయంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు మయూర్. కుర్తా డిజైన్ కోసం నల్లటి ఫాక్స్ జార్జెట్ ఫాబ్రిక్‌ను ఎంచుకున్నారు. నీలం, గులాబీ, ఆకుపచ్చ , తెలుపు రంగుల బహుళ వర్ణ షేడ్స్‌లో సంక్లిష్టమైన ప్రకృతి-ప్రేరేపిత అలంకరణతో పరిపూర్ణ వైవిధ్యాన్ని అందించారు. ఒక ఇంజనీర్ ఫ్యాషన్ పరిశ్రమలో తన క్రియేషన్స్‌తో అద్భుతాలు సృష్టించి, ఆధాయాలు ఆర్జించడం విశేషం.
(చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!)
Comments
Please login to add a commentAdd a comment