ఊర్మిళ.. పుట్టింది కోల్‌కతాలో.. పెరిగింది ముంబైలో. నోయిడాలోని ‘ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’లో యాక్టింగ్ కోర్సు చేసి, కెరీర్ ప్రారంభించింది. నటిగా స్థిరపడాలన్నదే ఆమె లక్ష్యం. అందుకే, ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేది కాదు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించి, బుల్లితెర అవకాశాన్ని పొందింది. 2015లో ‘హేమ’ సీరియల్‌లో మొదటిసారి మెరిసింది. ఆ పాత్ర నిడివి కొంతే అయినా ఆమె ప్రతిభ పలువురి దృష్టిలో పడింది.
వరుసగా ‘దిల్ సే దిల్ తక్’, ‘సావధాన్ ఇండియా’, ‘ఆయుష్మాన్ భవ’ సీరియల్లో నటించడంతో పాటు, సినిమాలో చాన్స్ కొట్టేసింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’లో ఓ రిపోర్టర్‌గా నటించి, తన సిల్వర్ స్క్రీన్ కలను సాకారం చేసుకుంది. ప్రస్తుతం వెబ్‌తెరపైనా కనిపిస్తోంది. ‘గందీ బాత్’, ‘క్లైమాక్స్’ సిరీస్‌లతో అలరిస్తోంది.
అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చిన్న విషయమేం కాదు. పెద్ద గెలుపే. అలాంటి విజేతల్లో ఒకరే.. వెబ్‌స్టార్.. ఊర్మిళ సిన్హా రాయ్. చిన్నప్పుడు సినిమాల్లోని హీరోయిన్స్‌ను చూసి, అచ్చం అలాగే ముస్తాబు అయ్యేదాన్ని. అప్పుడే నిర్ణయించుకున్నా హీరోయిన్‌ని కావాలని– ఊర్మిళ సిన్హా రాయ్
Comments
Please login to add a commentAdd a comment