పాటలకు ‘వెల్‌కమ్ ఒబామా’ | 'Welcome Obama' Movie Audio Launch | Sakshi
Sakshi News home page

పాటలకు ‘వెల్‌కమ్ ఒబామా’

Published Wed, Aug 21 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

పాటలకు ‘వెల్‌కమ్ ఒబామా’

పాటలకు ‘వెల్‌కమ్ ఒబామా’

పయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వెల్‌కమ్ ఒబామా’. ఎస్.భారతి, కృష్ణ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఊర్మిళ, సంజీవ్, రేచల్, భువనచంద్ర, అనంత శ్రీరామ్, బలభద్రపాత్రుని రమణి ముఖ్య తారలు. 
 
 పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సింగీతం ఓ కావ్యంలాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రోహిణి స్క్రిప్ట్ ఈ చిత్రానికి బలం. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా.
 
 సింగీతమే సంగీతం అందించారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో పాటలను విడుదల చేస్తున్నాం. సింగీతంగారితో పనిచేసిన ప్రముఖ హీరోలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement