
కుమారుడు గౌస్‌బాబాతో నౌహీరా
అనంతపురం, తనకల్లు: మండల పరిధిలోని ఉస్తినిపల్లికి చెందిన నౌహీరా, చాంద్‌బాషాలకు గౌస్‌బాబా, గౌసియా అనే ఇద్దరు సంతానం. చాంద్‌బాషా కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో నౌహీరా చిన్న చిన్న కూలిపనులకు వెళ్లి వచ్చే అరకొర డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. పిల్లలిద్దరినీ బాగా చదివించుకోవాలనుకుంది. అందుకుతగ్గట్టే పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. ఇంటర్‌లో గౌస్‌బాబా ఎంపీసీలో 977 మార్కులు, గౌసియా బైపీసీలో 918 మార్కులు సాధించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం గౌస్‌బాబా మదనపల్లిలోని మిట్స్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతుండగా, గౌసి యా తిరుపతిలో బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది.
అయితే ఇన్నాళ్లూ ఎలాగో లా ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ వస్తున్న నౌహీరాకు రెండేళ్లుగా స్థానికంగా కూలి పనులు కూడా లేకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఈ దశలో పిల్ల లకు పుస్తకాలు, ఫీజు కూడా చెల్లించలేకపోతోంది. తనగోడు ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు చెప్పుకొని ఆర్థికసాయం చేయాలని వేడుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్య క్తం చేస్తోంది. బంధుమిత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదని, పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ఆమె వాపోతోంది. ఎవరైనా దాతలు ఫీజు చెల్లించడానికి ముందుకొస్తే జీవితాంతం వారికి రుణపడి ఉంటానంటూ కన్నీటి పర్యంతమవుతోంది.
సహాయం చేయాలనుకుంటే... వివరాలు
బ్యాంకు అకౌంట్ నెంబర్ : 36760979571
ఐఎఫ్‌ఎస్సీ కోడ్: SBIN0002797
తనకల్లు, కదిరి రోడ్
మొబైల్ నెంబర్ : 9515409735
Comments
Please login to add a commentAdd a comment