ప్రతీకాత్మక చిత్రం
జలోర్: గుళ్లో దొంగతనానికి వచ్చి, అడ్డుకున్న 70 యేళ్ల పూజారిని కడతేర్చారు గుర్తుతెలియని అంగతకులు. తాజాగా జిల్లాలో చోటుచేసుకున్నఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. పోలీసుల కథనం ప్రకారం..
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో దుంబాడియా గ్రామానికి చెందిన నెనుదాస్ వైష్ణవ్ (70) అనే పూజారి గత 30 యేళ్లుగా హనుమాన్ దేవాలయంలో పూజలు చేస్తున్నాడు. ఐతే సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎప్పటిలాగే పూజా కార్యక్రమాలు ముగించుకుని పూజారి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో దొంగతనం చేయాడానికి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు, అక్కడ నిద్రిస్తున్న పూజారిపై కత్తితో దాడిచేశారు. పూజారి కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పూజారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐతే పూజారి చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 30) ఉదయం మరణించాడు. ఘటన అనంతరం దేవాలయంలోని విరాళం పాత్ర కూడా కనిపించకుండా పోయింది.
కాగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో అర్చకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ (భీన్మల్) శంకర్ లాల్ తెలిపారు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.
చదవండి: OCD Wife: నావళ్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!
Comments
Please login to add a commentAdd a comment