
ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు ఈ దుస్థితి
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే హైదరాబాద్‌కు ప్రస్తుతం ఈ దుస్థితి పట్టిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు.
బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే హైదరాబాద్‌కు ప్రస్తుతం ఈ దుస్థితి పట్టిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. నగరాన్ని ముంచింది వర్షాలు కాదని, రాష్ర్ట ప్రభుత్వమేనని గురువారం విమర్శించారు. భవిష్యత్‌లో వర్షాల వల్ల హైదరాబాద్‌కు, ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు హైకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ కమిషన్ ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని, స్కైవేలు, ఫ్లై ఓవర్లతో మొత్తం స్వరూపాన్నే మార్చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.