ఒక రోజు సోషల్ సర్వే సాధ్యమా? | indrasena reddy blames kcr | Sakshi
Sakshi News home page

ఒక రోజు సోషల్ సర్వే సాధ్యమా?

Published Thu, Aug 7 2014 6:09 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

ఈ నెల 19 నుంచి జరప తలపెట్టిన సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణపై విమర్శలకు తావిస్తోంది.

హైదరాబాద్:ఈ నెల 19 నుంచి తెలంగాణ ప్రభుత్వం జరప తలపెట్టిన సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణ విమర్శలకు తావిస్తోంది. 625 చ.కి.మీ. మేర విస్తరించిన జీహెచ్‌ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్లున్నట్లు అంచనా వేసిన అధికారులు సర్వే నిర్వహణకు దాదాపు లక్షమంది సిబ్బంది సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒకే రోజు సోషల్ సర్వే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఇంద్రసేనా రెడ్డి.. ఒక్క రోజులో ఇంటింటా సర్వే సాధ్యపడే అంశం కాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.

 

కేసీఆర్ మాట్లాడుతున్న తీరు జిన్నాలా ఉందని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ కు ఓయూలో అడుగుపెట్టే ధైర్యం ఉందా?అని ప్రశ్నించారు. ఆయనకు చేతనైతే మాటల కాదు.. చేతల్లో చూపించాలని ఇంద్ర సేనా రెడ్డి విమర్శించారు. మరో పదిరోజుల్లో తెలంగాణలో సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణకు గ్రేటర్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని సర్వే సేవలకు వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement