కేసీఆర్ మాటల్లో నిజాయితీ లేదు
కేసీఆర్ మాటల్లో నిజాయితీ లేదు
Published Sat, Apr 22 2017 3:39 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రైతునన్న విషయం మర్చిపోయారా.. గత మూడేళ్లుగా బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక రైతుల పడుతున్న కష్టాలు సీఎంకు కనపడటం లేదా అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. ఆయన శనివారం విలేకరుతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాటల్లో నిజాయితీ కనిపించడం లేదు.. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న ప్రకటన కూడా ఇతర హామీల్లా దాటవేసేదేనా? పత్తి వద్దు, కందులు ముద్దు అని ప్రచారం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కందులకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేక పోతుందో చెప్పాలి.
మూడు నెలలుగా రైతులు అమ్మిన పంటకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. కేంద్రం పంపిన ఆత్మ పథకం నిధులు వెనక్కి మళ్లిపోవాల్సిన దుస్థితికి కారకులెవరు? కేంద్ర ప్రభుత్వం రైతులకు కేటాయించిన ఫసల్ బీమా యోజన నిధులు రైతులకు అందకుండా అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలు లేకుండా.. ప్రభుత్వంలో ఒక్క బిల్లుకు కూడా నిధులు విడుదల చేయడం లేదు. దీనిపై కమిషన్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Advertisement