
పెద్దపల్లి రూరల్: ముం దస్తు ఎన్నికలకు తాము సిద్ధమని బీజేపీ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి ప్రకటించారు. పెద్దపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలంటూ కేసీఆర్ సర్కార్ లీకులు ఇస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమన్నారు. సర్కార్‌ను సాగనంపడానికే ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి, లక్ష ఉద్యోగాలు, పంచాయతీ ఎన్నికలు వాయిదా, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు, భూ రికార్డుల ప్రక్షాళన.. ఇలా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.