
ఇంద్రసేనారెడ్డికి ఉత్తర్వులను అందజేస్తున్న త్రిపుర గవర్నర్ ఏడీసీ మేజర్ రోహిత్ సేధీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి వెలువరించిన ఉత్తర్వులను (వారెంట్) త్రిపుర గవర్నర్ ఏడీసీ మేజర్ రోహిత్ సేధీ ఇంద్రసేనారెడ్డికి అందజేశారు.
త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందజేశారు. ఇంద్రసేనారెడ్డి ఈ నెల 25వ తేదీ ఉదయమే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇంద్రసేనారెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఈ నెల 24న త్రిపుర రాజ్‌భవన్ పేషీ సిబ్బంది హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం.