taking oath
-
గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర నాలుగో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతికుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజలకు కొత్త గవర్నర్ సందేశం విభిన్న సంస్కృతులు, సుసంపన్నమైన వారసత్వం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన అదృష్టమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచి్చన రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సందేశాన్ని విడుదల చేశారు. సమృద్ధిగా సహజ వనరులు, సారవంతమైన వ్యవసాయ భూములతోపాటు వ్యాపార, వాణిజ్యానికి కేంద్రంగా తెలంగాణ ఉందన్నారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అభినందనలు తెలియజేశారు.ప్రజాస్వామ్యం, న్యాయం, కరుణ వంటి విలువలతో కూడిన మన రాజ్యాంగం నిర్దేశించిన బాటలో కలిసి నడుస్తూ మార్పు దిశగా ప్రయాణాన్ని ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. యువత, విద్య, సాధికారత, ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్య అంశాలుగా తీసుకుంటామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను ప్రశంసించారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం: శంషాబాద్: ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమానాశ్రయంలో గవర్నర్‌కు పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సాయుధ దళాలు గౌరవవందం చేశాయి. -
నేడు గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5గంటలకు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకా రం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
మోదీ అనే నేను..
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకునిగా రికార్డులకెక్కారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 73 ఏళ్ల మోదీతో ప్రధానిగా ప్రమాణంచేయించారు. ఆయన దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అన్ని రంగాలకూ చెందిన అతిరథ మహారథుల సమక్షంలో కార్యక్రమం 155 నిమిషాల పాటు అత్యంత వేడుకగా జరిగింది.మోదీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా కొలువుదీరింది. 30 మందితో కేబినెట్ మంత్రులుగా, ఐదుగురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన ఎన్డీఏ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో 11 బెర్తులతో సముచిత ప్రాధాన్యం దక్కింది. బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ వంటి అతిరథులతో పాటు మిత్రపక్షాల నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), లలన్‌సింగ్ (జేడీయూ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ), హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్) తదితరులు ప్రమాణస్వీకారం చేసిన ప్రముఖుల్లో ఉన్నారు.ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమంలో పాల్గొనగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో పాటు పలు విపక్షాలు గైర్హాజరవడం విశేషం. 140 కోట్ల మంది భారతీయులకు మరోసారి సేవ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని కార్యక్రమం అనంతరం మోదీ పేర్కొన్నారు.‘‘నూతన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రగతి పథంలో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తా. అనుభవం, యువత కలబోతగా కొత్త మంత్రివర్గం అలరారుతోంది. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తాం’’ అంటూ ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. నూతన మంత్రులకు శాఖల కేటాయింపు సోమవారం జరిగే అవకాశముంది. ఆరుగురు మాజీ సీఎంలు మోదీ 3.0 మంత్రివర్గం పలు విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఐదేళ్ల విరామం తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెట్టారు. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, కుమారస్వామిలకు తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వారితో పాటు నూతన మంత్రివర్గంలో 33 మంది కొత్త ముఖాలున్నాయి. శివరాజ్, కుమారస్వామి, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్, జితిన్‌రాం మాంఝీ రూపంలో నూతన మంత్రివర్గంలో ఆరుగురు మాజీ సీఎంలుండటం విశేషం! 43 మందికి మూడుసార్ల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులుగా చేసిన అనుభవముంది. యూపీకి అత్యధికంగా 9 బెర్తులు కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా 9 స్థానాలు దక్కాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న కీలకమైన బిహార్‌కు ఏకంగా 8 బెర్తులు దక్కాయి! ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు కూడా ఆరు బెర్తులు లభించాయి. గుజరాత్‌కు ఐదు; మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు ఐదేసి; హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు మూడేసి; ఒడిశా, అసోం, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశి్చమబెంగాల్‌కు రెండేసి చొప్పున స్థానాలు దక్కాయి.అయితే యూపీకి ఒకే కేబినెట్ హోదా బెర్తు దక్కగా బిహార్‌కు ఏకంగా నాలుగు లభించడం విశేషం! గుజరాత్‌కు కూడా మోదీ, అమిత్ షా, మాండవీ, సీఆర్ పాటిల్ రూపంలో ఏకంగా నాలుగు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు మూడేసి; మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలకు రెండేసి కేబినెట్ మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ, ఏపీలతో పాటు హరియాణా, పంజాబ్‌లకు ఒక్కో కేబినెట్ హోదా బెర్తు దక్కాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి 13 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. 37 మందికి ఉద్వాసన మోదీ 2.0 మంత్రివర్గంలో పని చేసిన వారిలో స్మృతీ ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే సహా ఏకంగా 37 మందికి ఈసారి కేబినెట్లో చాన్స్ దొరకలేదు. వీరిలో పలువురు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2.0 మంత్రివర్గంలోని 19 మంతి కేబినెట్ మంత్రులతో సహా మొత్తం 34 మంది తిరిగి చోటు దక్కించుకున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా చాన్స్ దక్కడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కొత్త మంత్రుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు చొప్పున 12 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 58 మంది లోక్‌సభ సభ్యులు కాగా రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, జార్జి కురియన్ ఏ సభలోనూ సభ్యలు కారు. వారు ఆర్నెల్లలోగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవాల్సి ఉంటుంది. భాగస్వాములకు పెద్దపీట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు నూతన మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది. తాజా మాజీ మంత్రివర్గంలో వాటికి ఒక్క కేబినెట్ హోదా, స్వతంత్ర హోదా మంత్రి పదవి కూడా లేదు. ఈసారి మాత్రం కుమారస్వామి (జేడీఎస్), మాంఝి (హెచ్ఏఎల్), లలన్‌సింగ్ (జేడీయూ), రామ్మోహన్ నాయుడు (టీడీపీ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ) రూపంలో ఏకంగా ఐదు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! ప్రతాప్‌రావ్ జాదవ్ (శివసేన), జయంత్ చౌదరి (ఆరెల్డీ)లకు స్వతంత్ర హోదా కూడిన పదవులు లభించాయి. 2.0 మంత్రివర్గంలో సహాయ మంత్రులైన అనుప్రియా పటేల్ (అప్నాదళ్–యూపీ), రామ్‌దాస్ అథవాలె (ఆర్పీఐఏ–మహారాష్ట్ర)లకు మళ్లీ చాన్సిచ్చారు. వారితో పాటు రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ)లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. కొత్త మంత్రులు 33 మంది మోదీ 3.0 మంత్రివర్గంలో 33 కొత్త ముఖాలకు చోటు దక్కింది. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్, కుమారస్వామి, మనోహర్‌లాల్ ఖట్టర్ తదితర దిగ్గజాలతో పాటు తొలిసారి ఎంపీలుగా నెగ్గిన సురేశ్ గోపి తదితరుల దాకా వీరిలో ఉన్నారు. 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కేంద్ర మంత్రివర్గంలో 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. గోవా, అరుణాచల్ వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే నలుగురు, అంతకంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులున్న ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఏడుగురు మహిళలు నూతన మంత్రివర్గంలో మహిళలు 10 శాతం కంటే తక్కువే ఉన్నారు. మొత్తం ఏడుగురికి స్థానం దక్కింది. ఇదీ కులాల కూర్పు మోదీ 3.0 మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు. కా>గా ఐదుగురు మైనారిటీలున్నారు. అయితే ముస్లింలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. ఇంకో 8 మందికి అవకాశం కేంద్ర మంత్రివర్గ గరిష్ట పరిమాణం 81 (543 మంది లోక్‌సభ సభ్యుల్లో 15 శాతం). దాంతో మరో 9 మందికి మంత్రులుగా అవకాశముంది. అయితే 2019–24 మధ్య మోదీ 2.0 మంత్రివర్గంలో 78 మంది సభ్యులే ఉన్నారు. అత్యంత పిన్న వయసు్కలు రామ్మోహన్, ఖడ్సే నూతన కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే (బీజేపీ) అత్యంత పిన్న వయసు్కలు. వారికి 37 ఏళ్లు. అత్యంత పెద్ద వయసు్కనిగా 79 ఏళ్ల హెచ్ఏఎల్ అధినేత జితిన్‌రాం మాంఝీ నిలిచారు. బాక్సు నేడు కేబినెట్ తొలి భేటీ మోదీ 3.0 మంత్రివర్గ తొలి సమావేశం సోమవారం జరగనుంది. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసంలో సాయంత్రం భేటీ ఉంటుందని సమాచారం. నూతన మంత్రివర్గ సభ్యులందరికీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. -
మేం మీ సేవకులం..
సాక్షి, హైదరాబాద్: తాము పాలకులం కాదని, సేవకులమని.. తమ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములుగా పాలన సాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సేవ చేసేందుకు ప్రజలు తమకు ఇచ్చిన అవకా శాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా నిర్వర్తిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరు గుతుందని పేర్కొన్నారు. పోరాటాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో దశాబ్దకాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, మానవ హక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండ గానే ప్రగతిభవన్ గడీ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టామని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను, అభివృద్ధిని మిళితం చేసి తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామ న్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడి యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వా త ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మిత్రులారా.. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పోరాటాలతో, త్యాగాల పునా దులపై ఏర్పడింది. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో ఆలోచ నలతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి తెలంగాణ లోని నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛనివ్వా లని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు సమాన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసింది. కానీ దశాబ్దకాలంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు లోనైంది. మానవహక్కులకు భంగం కలిగింది. ఈ ప్రాంతంలో ప్రజలు బాధలు చెప్పుకొందామనుకున్నా.. ప్రభుత్వం నుంచి వినేవారు లేక దశాబ్దకాలంగా మౌనంగా భరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి, ఎన్నికల్లో ఎన్నో త్యాగాలు చేసి, తమ రక్తాన్ని చెమటగా మార్చి, భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోశారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ప్రజల రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను అందించ డానికి.. తెలంగాణ రైతాంగం, విద్యార్థి, నిరుద్యోగ యువత, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రి యతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. కొత్త మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ప్రమాణస్వీకారం మొదలైనప్పుడే గడీగా ఏర్పాటు చేసుకున్న ప్రగతిభవన్ చుట్టూ నిర్మించు కున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. ఈ వేది కపై నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా.. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలను కున్నా నిరభ్యంతరంగా ప్రగతిభవన్‌లోకి ప్రవేశించి తమ ఆలోచనలు, ఆకాంక్షలు, అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ ఆలోచనలను, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నేతగా, మీ రేవంతన్నగా నేను తీసుకుంటా. మాట నిలబెట్టుకుంటా. కార్యకర్తలకు అండగా ఉంటా.. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియా అండతో, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో, రాహుల్‌గాంధీ సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడేందుకు లక్షలాది మంది కార్యకర్తలు ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారే తప్ప మువ్వన్నెల జెండాను విడిచిపెట్టలేదు. మీ కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా. గుండెల నిండా మీరిచ్చిన శక్తిని నింపుకొని ఈ పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన చీడ నుంచి విముక్తి కలిగించిన ప్రజలకు, కాంగ్రెస్ జాతీయ నేతలు, సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు, సహచర ఎంపీలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జై కాంగ్రెస్.. జై సోనియమ్మ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ఈరోజు బద్దలు కొట్టాం. రేపు (శుక్రవారం) ఉదయం పదిగంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. తెలంగాణలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుతాం. అభివృద్ధి కోసం శాంతిభద్రతల ను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తాం. పేదలకు, నిస్సహాయుల కు సహాయకారిగా ఉంటాం. నిస్సహాయులె వరూ తమకెవరూ లేరని, తమకే దిక్కూ లేదని అనుకునే పరిస్థితి రానివ్వం. మీ సోదరుడిగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. -
మంత్రుల శాఖలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వంలోని 11 మంది మంత్రులు ప్రమాణం చేసినప్పటికీ వారికి గురువారం ఎలాంటి శాఖలు కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ అభీష్టం మేరకు జరిగే శాఖల కేటాయింపు అధికారికంగా జరగకపోవడం గమనార్హం. వాస్తవానికి, మంత్రులు ప్రమాణం చేసిన రోజునే సాయంత్రానికి సాధారణ పరిపాలన శాఖ ఆయా మంత్రులకు కేటాయించిన శాఖలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. కానీ నూతన ప్రభుత్వంలో అలా జరగలేదు. మధ్యాహ్నం 2 గంటల లోపే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసినప్పటికీ రాత్రి వరకు ఇలాంటి ఉత్తర్వులేవీ రాలేదు. ఈలోపే ఫలానా మంత్రికి ఫలానా శాఖ కేటాయించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఆధారంగా పలువురు మంత్రుల అనుచరులు, సన్నిహితులు తమ నేతకు ఫలానా శాఖ కేటాయించారనే నిర్ధారణకు వచ్చారు. కానీ అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కావని తెలిపాయి. ‘ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలు కేటాయించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రభుత్వం ఇంకా మంత్రులకు శాఖలు కేటాయించలేదు. శాఖల కేటాయింపు వార్తలను ప్రజలు నమ్మొద్దు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఆదేశాలిస్తుంది. ఆ ఆదేశాలు జారీ చేసేంతవరకు శాఖల కేటాయింపుపై ప్రచారాలు నమ్మవద్దు.’ అని గాం«దీభవన్ నుంచి ప్రకటన వెలువడింది. కాగా కొత్త మంత్రులకు శుక్రవారం శాఖల కేటాయింపు జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. -
‘అభయ హస్తం’పై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రేవంత్‌రెడ్డి ‘అభయ హస్తం’ ఫైలుపై తొలి సంతకం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీల హామీల అమలును సుగమం చేసేలా దానిని రూపొందించారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగురాలు రజనికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాలను సీఎస్ శాంతికుమారితో కలసి రేవంత్‌రెడ్డి అందజేశారు. మాట నిలబెట్టుకున్న సీఎం: హైదరాబాద్‌లోని న్యూ బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి కుమార్తె రజని. అక్టోబర్ 17న గాందీ భవన్‌కు వచ్చిన ఆమె.. తన వైకల్యం వల్ల ఉద్యో గం దొరకడం లేదని, ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న రేవంత్.. అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారు. గురువారం రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. రజనిని వేదికపైకి ఆహ్వనించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఆమెకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా నెలకు రూ.50వేల వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చారు. మాటను నిలబెట్టుకున్నారంటూ సీఎం రేవంత్‌కు రజని, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
Revanth Reddy: సోనియా గాంధీ కాళ్లు మొక్కిన రేవంత్ రెడ్డి..!
-
రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపు కొత్త సర్కార్ కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా వేరే మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు, ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు, సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపటి సభలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక.. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేశారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ, ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్ -
26న త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి వెలువరించిన ఉత్తర్వులను (వారెంట్) త్రిపుర గవర్నర్ ఏడీసీ మేజర్ రోహిత్ సేధీ ఇంద్రసేనారెడ్డికి అందజేశారు. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందజేశారు. ఇంద్రసేనారెడ్డి ఈ నెల 25వ తేదీ ఉదయమే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇంద్రసేనారెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఈ నెల 24న త్రిపుర రాజ్‌భవన్ పేషీ సిబ్బంది హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. -
రాజ్యసభ ఎంపీగా జైశంకర్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ సహా తొమ్మిది మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2019లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన జైశంకర్ రెండోసారి గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన బాబూభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్ (గుజరాత్), కేస్రీదేవ్ సింగ్ దిగి్వజయ్‌సింగ్ ఝాలా (గుజరాత్), నాగేంద్ర రాయ్ (పశి్చమ బెంగాల్)లు, ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్ ఒబ్రియాన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, ప్రకాష్ చిక్ బరైక్, సమీరుల్ ప్రమాణ స్వీకారం చేశారు. -
తెలంగాణ హైకోర్టుగా సీజేపగా అలోక్ అరాధే ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణకు వచ్చారు. ఈమేరకు కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయ శాఖ గత వారం ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక నుంచి తెలంగాణకు... మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరాధే 1964, ఏప్రిల్ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశాక 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో పేరు గడించారు. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016, సెప్టెంబర్ 16న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారు. 2018, నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. నాలుగేళ్లలో ఆరో సీజే ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన 2019, జనవరి 1న జరిగింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు సీజేలుగా పనిచేశారు. నాలుగేళ్ల కాలంలో సీజేలుగా జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పనిచేశారు. జస్టిస్ అలోక్ అరాధే ఆరో సీజే కానున్నారు. వీరిలో జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లారు. -
రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారీ బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సాహా చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ప్రమాణం చేయించారు. సాహా తోపాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో గెలిచి మెజారిటీ మార్కును సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహాను ప్రధాని అభినందించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ముగ్గురు గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ కూటమి పార్టీ ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) పార్టీ నేత కూడా ఉన్నారు. సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చిన కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిమా బౌమిక్ కేబినెట్లో చేరలేదు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలకు నిరసనగా విపక్ష వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి. తిప్రా మోతా చీఫ్‌తో షా భేటీ ‘గ్రేటర్ తిప్రాల్యాండ్’ సాధన కోసం ఉద్యమసంస్థగా మొదలై తర్వాత రాజకీయ పార్టీగా మారిన తిప్రా మోతా తరఫున ఆరుగురు సభ్యుల ప్రతినిధుల బృందం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయింది. అగర్తలాలో మొదలైన భేటీలో తిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ కిశోర్ దేవ్ బర్మన్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, నూతన సీఎం మాణిక్ సాహా సైతం పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమని, త్రిపుర ట్రైబల్ అటానమస్ కౌన్సిల్‌కు శాసన, ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతున్న విషయం తెల్సిందే. -
మధ్యప్రదేశ్ లో కొలువుతీరనున్న బీజేపీ ప్రభుత్వం
-
తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీలేదు: నామా
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన లోక్‌సభ సభ్యులు మంగళవారం పదవీ స్వీకారం ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. తెలంగాణ ప్రజలు తమ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని టీఆర్ఎస్ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కలిసి కట్టుగా పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్, మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందేం లేదు. వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించేందుకు కృషి చేస్తాం’ అని అన్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించలేదని, బీజేపీ నాయకులు కేవలం మాటలకు పరితమయ్యారని ఆపార్టీ డిప్యూటి ఫ్లోర్‌లీడర్ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమపై నమ్మకం ఉంచి 9 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల సాధనతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిందని గుర్తుచేశారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గడిచిన ఏళ్లలో అనేక సమస్యలపై పోరాటం చేశాం. హైకోర్టు, జాతీయ రహదారులు ఇలా ప్రతిదాన్నీ పోరాడే సాధించుకున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలాంటి పంథానే అవలంభిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు కృషి చేస్తాం. గత కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు. బీజేపీ నేతలు భ్రమలో ఉన్నారు’’ అని అన్నారు. -
ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం
-
మంత్రిగా ‘ఆర్బీ’ ప్రమాణం
సాక్షి, చెన్నై: సీఎం జయలలిత కెబినెట్లో 13వ సారి మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇసుక దెబ్బకు కీలకమైన ప్రజా పనుల శాఖ నుంచి ప్రాధాన్యత లేని క్రీడల శాఖలో పడ్డ రామలింగానికి పదవీ గండం తప్పలేదు. ఆయన స్థానంలో సాత్తూరు ఎమ్మెల్యే ఆర్బి ఉదయకుమార్‌కు చోటు కల్పించారు. మంత్రులు బివి రమణ, ఎంసి సంపత్, ఎన్డీ వెంకటాచలం శాఖల్లో మార్పులు చేశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అనుమతులు, కేటాయింపుల వ్యవహారం వెంటకటాచలం మెడకు చుట్టుకోవడంతో తాజాగా ఆయనకు ప్రాధాన్యత లేని శాఖకు కేటాయించారు. త్వరలో ఈయనకూ పదవీ గండం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త మంత్రి ఆర్బి ఉదయకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం రాజ్ భవన్లో నిరాడంబరంగా జరిగింది. ప్రమాణ స్వీకారం: ఉదయాన్నే రాజన్ భవన్ పరిసరాలు అధికారులు, మంత్రుల వాహనాలతో నిండిపోయూయి. సరిగ్గా తొమ్మిదిన్నర గంటల సమయంలో సీఎం జయలలిత రాజ్ భవన్‌కు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, గవర్నర్ కొణిజేటి రోశయ్య కార్యదర్శి రమేష్‌చంద్ మీన పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్ద గవర్నర్ రోశయ్యకు కొత్త మంత్రి ఆర్బి ఉదయకుమార్‌ను సీఎం జయలలిత పరిచయం చేశారు. అనంతరం ఉదయకుమార్ చేత రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం జయలలిత ఆశీస్సుల్ని ఉదయకుమార్ అందుకున్నారు. అనంతరం కొత్త మంత్రికి సహచర మంత్రులు, రోశయ్య, జయలలిత శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి సచివాలయం చేరుకున్న ఉదయకుమార్ మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. ఒకే కేబినెట్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఆర్బి ఖాతాలో పడింది. ఇది వరకు జయలలిత కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేసి ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే.