సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రేవంత్‌రెడ్డి ‘అభయ హస్తం’ ఫైలుపై తొలి సంతకం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీల హామీల అమలును సుగమం చేసేలా దానిని రూపొందించారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగురాలు రజనికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాలను సీఎస్ శాంతికుమారితో కలసి రేవంత్‌రెడ్డి అందజేశారు.
మాట నిలబెట్టుకున్న సీఎం: హైదరాబాద్‌లోని న్యూ బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి కుమార్తె రజని. అక్టోబర్ 17న గాందీ భవన్‌కు వచ్చిన ఆమె.. తన వైకల్యం వల్ల ఉద్యో గం దొరకడం లేదని, ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న రేవంత్.. అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారు.
గురువారం రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. రజనిని వేదికపైకి ఆహ్వనించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఆమెకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా నెలకు రూ.50వేల వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చారు. మాటను నిలబెట్టుకున్నారంటూ సీఎం రేవంత్‌కు రజని, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment