మేం మీ సేవకులం.. | Revanth Reddy First Speech Highlights After Taking Oath As Chief Minister Of Telangana - Sakshi
Sakshi News home page

Revanth Reddy First Speech As CM: మేం మీ సేవకులం..

Published Fri, Dec 8 2023 2:45 AM | Last Updated on Fri, Dec 8 2023 12:17 PM

Revanth Reddy First Speech As Chief Minister of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాము పాలకులం కాదని, సేవకులమని.. తమ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములుగా పాలన సాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సేవ చేసేందుకు ప్రజలు తమకు ఇచ్చిన అవకా శాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా నిర్వర్తిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరు గుతుందని పేర్కొన్నారు.

పోరాటాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో దశాబ్దకాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, మానవ హక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండ గానే ప్రగతిభవన్‌ గడీ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టామని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను, అభివృద్ధిని మిళితం చేసి తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామ న్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడి యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వా త ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘మిత్రులారా.. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పోరాటాలతో, త్యాగాల పునా దులపై ఏర్పడింది. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో ఆలోచ నలతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి తెలంగాణ లోని నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛనివ్వా లని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్‌ వరకు సమాన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసింది. కానీ దశాబ్దకాలంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు లోనైంది.

మానవహక్కులకు భంగం కలిగింది. ఈ ప్రాంతంలో ప్రజలు బాధలు చెప్పుకొందామనుకున్నా.. ప్రభుత్వం నుంచి వినేవారు లేక దశాబ్దకాలంగా మౌనంగా భరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి, ఎన్నికల్లో ఎన్నో త్యాగాలు చేసి, తమ రక్తాన్ని చెమటగా మార్చి, భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్‌ పార్టీ జెండాను మోశారు.

తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది
ప్రజల రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను అందించ డానికి.. తెలంగాణ రైతాంగం, విద్యార్థి, నిరుద్యోగ యువత, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రి యతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. కొత్త మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుంది.

ఇక్కడ ప్రమాణస్వీకారం మొదలైనప్పుడే గడీగా ఏర్పాటు చేసుకున్న ప్రగతిభవన్‌ చుట్టూ నిర్మించు కున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. ఈ వేది కపై నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా.. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలను కున్నా నిరభ్యంతరంగా ప్రగతిభవన్‌లోకి ప్రవేశించి తమ ఆలోచనలు, ఆకాంక్షలు, అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ ఆలోచనలను, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నేతగా, మీ రేవంతన్నగా నేను తీసుకుంటా. మాట నిలబెట్టుకుంటా.

కార్యకర్తలకు అండగా ఉంటా..
కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియా అండతో, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో, రాహుల్‌గాంధీ సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడేందుకు లక్షలాది మంది కార్యకర్తలు ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారే తప్ప మువ్వన్నెల జెండాను విడిచిపెట్టలేదు. మీ కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.

గుండెల నిండా మీరిచ్చిన శక్తిని నింపుకొని ఈ పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన చీడ నుంచి విముక్తి కలిగించిన ప్రజలకు, కాంగ్రెస్‌ జాతీయ నేతలు, సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు, సహచర ఎంపీలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జై కాంగ్రెస్‌.. జై సోనియమ్మ అంటూ ప్రసంగాన్ని ముగించారు. 

ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌
ప్రగతిభవన్‌ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ఈరోజు బద్దలు కొట్టాం. రేపు (శుక్రవారం) ఉదయం పదిగంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తాం. తెలంగాణలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుతాం. అభివృద్ధి కోసం శాంతిభద్రతల ను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తాం.

పేదలకు, నిస్సహాయుల కు సహాయకారిగా ఉంటాం. నిస్సహాయులె వరూ తమకెవరూ లేరని, తమకే దిక్కూ లేదని అనుకునే పరిస్థితి రానివ్వం. మీ సోదరుడిగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement