
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5గంటలకు రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకా రం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది.
జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్‌ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్‌చార్జి గవర్నర్‌గా సీపీ
రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.