Verma
-
క్రిష వర్మ పసిడి పంచ్
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ క్రిష వర్మ పసిడి పతకంతో సత్తా చాటింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో కొలరాడో వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణంతో పాటు ఐదు రజత పతకాలు దక్కాయి. తొలి సారి నిర్వహించిన ఈ చాంపియన్‌షిప్ మహిళల 75 కేజీల విభాగంలో క్రిష వర్మ విజేతగా నిలిచింది. తుది పోరులో క్రిష 5–0 పాయింట్ల తేడాతో సిమోన్ లెరికా (జర్మనీ)పై గెలుపొందింది. మహిళల విభాగంలో చంచల్ చౌదరీ (48 కేజీలు), అంజలీ కుమారి సింగ్ (57 కేజీలు), విని (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజత పతకాలు దక్కించుకోగా... పురుషుల విభాగంలో రాహుల్ కుందు (75 కేజీలు) తుదిపోరులో తడబడి రజతానికి పరిమితమయ్యాడు. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో చంచల్ చౌధరీ 0–5తో మియా టియా ఆటోన్ (ఇంగ్లండ్) చేతిలో... 70 కేజీల ఈవెంట్లో ఆకాంక్ష 1–4తో లిలల్లీ డెకాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడగా... 60 కేజీల విభాగంలో విని 2–3తో ఎల్లా లాన్స్‌డలె (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 75 కేజీల విభాగంలో రాహుల్ కుందు 1–4తో అవినోంగ్య జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడాడు.శనివారం పోటీల్లో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు పాల్గొనగా అందులో ఒకరు గెలిచి ఐదుగురు ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతోంది. -
బాధిత బాలికకు న్యాయం జరిగేనా?
పిఠాపురం/సాక్షి, అమరావతి: పిఠాపురంలో సంచలనం రేపిన బాలిక అత్యాచార ఉదంతంలో కూటమి నేతలు తమ పార్టీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన పిఠాపురానికి చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి భర్త డి.జాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మంగళవారం ప్రకటించారు. నైతిక బాధ్యత వహించాల్సిన నిందితుడి భార్యపై మాత్రం పార్టీ తరఫున ఏ చర్యలూ తీసుకోకుండా ఆమెకు అండగా ఉంటామన్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, జనాలను నమ్మించడానికి వేసిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ కూటమిలో పార్టీకి చెందిన నేత అరాచకానికి పాల్పడితే బాధితురాలికి న్యాయం చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. తన ప్రకటనలో ఎక్కడా టీడీపీకి చెందిన నేతగా పేర్కొనకపోగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో అధికారులను ఆదేశించాం అంటూ పేర్కొనడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని పట్టుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిఠాపురంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయన మంగళవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: పవన్ కళ్యాణ్పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. -
పిఠాపురం: వర్మకు ‘దొరా’ఘాతం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పిఠాపురంలో కూటమి నేతల్లో వర్గపోరు ముదిరి పాకాన పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే వీరి ఆధిపత్య పోరు కొనసాగుతుండగా వారికి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రూపంలో మరో తలపోటు వచ్చి పడింది. పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి పోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచే పిఠాపురంపై పెత్తనం కోసం నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమితో జత కట్టిన పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం స్థానాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ త్యాగం చేసి గెలుపు కోసం కష్టపడ్డారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్సీగా వర్మకు అవకాశం కల్పిస్తామని బాబు మాట ఇచ్చారు. పవన్ కూ డా వర్మను ఆకాశాన్నికెత్తేసినంత పనిచేస్తూ వెంట తిప్పుకున్నారు. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటవడం.. పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయా యి. ఇంతలోనే మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రానే వచ్చింది. తొలి ఎమ్మెల్సీ తనదేనని వర్మ గంపెడాశలు పెట్టుకుని తనకే ఆ ఇస్తారని అనుచరులు అందరికీ వర్మ చెప్పేసుకున్నారు. మాట ఇచ్చి మరచిపోవడంలో దిట్ట అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు జెల్ల కొట్టి ఆ సీటును రామచంద్రయ్యకు ఇచ్చేశారు. జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్‌కు పవన్ సిఫార్సుతో లభించింది. మొదటి అవకాశంలోనే అందలం ఎక్కిస్తారనుకున్న వర్మ ఆశలపై నీళ్లు చల్లారు. వర్మకు ఎమ్మెల్సీ చాన్స్ రాకుండా తెర వెనుక జనసేన నేతలు బ్రేకులు వేశారనే చర్చ ఇరుపార్టీల నేతల మధ్య సాగింది.తార్కాణాలెన్నోఎమ్మెల్సీ దక్కని అవమానం జీర్ణించుకోకుండానే పవన్ అలా వెళ్లగానే ఇలా వర్మ ప్రాధాన్యాన్ని తగ్గించేలా జనసేన నేతలు వ్యవహరిస్తుండటం మొదలు పెట్టారని ఆనోటా ఈనోటా అంటున్న మాట. ఇందుకు అనేక ఉదాహరణలను వర్మ అనుచరవర్గం ఎత్తి చూపుతోంది. పవన్ స్థానే సోదరుడు నాగబాబు నియోజకవర్గంలో అధికార, అనధికార వ్యవహారాలను తనే స్వయంగా చక్కబెడుతున్నారు. అంతే కాకుండా తాను లేదా, మర్రెడ్డి శ్రీనివాస్ సిఫార్సులకే ప్రాధాన్యం ఇవ్వాలని నాగబాబు ఇటీవల పలు సమీక్షల్లో స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా, టీడీపీ ఇన్చార్జిగా ఉన్న వర్మకు కనీస ప్రాధాన్యం లేకుండా చేయడంతో ఆ వర్గం రగిలిపోతోంది. అలాగని బయటపడి వివాదాలకు పోకుండా అతని అనుచరులు సమయం కోసం కాసుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తోంది.త్యాగానికి అడుగడుగునా అవమానంపవన్ కోసం త్యాగం చేసిన పాపానికి వర్మను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆ వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. ఏ క్షణానైన్నా వర్మ వర్గం రోడ్డెక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూటమిలో చేరనున్నట్టు ఇటీవల ప్రకటించడం వర్మ వర్గీయుల్లో అగ్గి రాజేసింది. కూటమిలో చేరుతానన్న దొరబాబును తేదేపాలో చేర్చుకుంటే మాత్రం మూకుమ్మడిగా పార్టీని వీడి బయటకు పోవాలనే యోచనలో వర్మ వర్గం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటు జనసేన నేతలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే పిఠాపురంలో కూటమిలోని తేదేపా, జనసేన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ తలపోట్లు సరిపోవన్నట్టు ఇప్పుడు దొరబాబు కూటమిలోకి వస్తే అతనికిచ్చే ప్రాధాన్యం ఏమిటనే ప్రశ్న కూటమి నేతలు ఆయా పార్టీల ముఖ్య నేతలకు సంధిస్తున్నారు. సీటు త్యాగంచేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రాధాన్యం లేకపోగా, ఇప్పుడు కొత్తగా దొరబాబును తీసుకువచ్చే ప్రయత్నాలపై వర్మ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. వర్మను పొమ్మనకుండా పొగడబెట్టే ఎత్తుగడతోనే దొరబాబును తీసుకువస్తున్నారనే ప్రచారం పిఠాపురంలో విస్తృతంగా జరుగుతోంది. ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు దొరబాబును కూటమిలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇరుపార్టీల నేతలు ముఖ్య నేతలను ప్రశ్నిస్తున్నారు. -
నేడు గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5గంటలకు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకా రం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
కౌన్సిలర్ నుంచి కేబినేట్లోకి
సాక్షి, భీమవరం: ఆయన పేరు భూపతిరాజు శ్రీని వాసవర్మ అయినా.. ప్రజలకు తెలిసింది బీజేపీ వర్మగానే. ఎంపీ అభ్యర్థిగా తన పేరును పార్టీ ప్రకటించినా.. సీటు మార్పు కోసం మిత్రపక్ష నేతల పైరవీలతో బీ ఫాం ఆయన చేతికందే వరకు ఉత్కంఠభరితంగానే సాగింది. అవాంతరాలు అధిగమించి నరసాపురం ఎంపీగా గెలుపొందడమే కాదు.. తొలి విజయంతోనే కేంద్రంలో అమాత్య పదవిని అందుకున్నారు నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాసవర్మ స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరాజు బాపిరాజు మనువడు. 1991లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత 1995లో బీజేపీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా, 1997లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శిగా, 1999లో నరసాపురం పార్లమెంట్ కన్వీనర్‌గా, 2001లో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, 2010 నుంచి పదేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా, 2020 నుంచి రాష్ట్ర కార్యదర్శిగా పదవులు నిర్వర్తించారు. అధికారంతో నిమిత్తం లేకుండా అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైనపాత్ర పోషిస్తూ వచ్చారు. గతంలో నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీచేసిన యూవీ కృష్ణంరాజు, గోకరాజు గంగరాజుల విజయంలో కీలకంగా వ్యవహరించారు. 2014 మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆయన భీమవరం నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. మున్సిపాలిటీ ప్యానెల్ చైర్మన్‌గా సేవలందించారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అందరితోను కలుపుగోలుతనంగా ఉంటారని పేరొందారు. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చారు.సీటు సాధించుకున్నారునరసాపురం ఎంపీ సీటు విషయమై మొదట్లో పెద్ద హైడ్రామానే నడిచింది. ఎంపీ అభ్యర్థిగా తాను పోటీలో ఉండాలని సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భావించారు. బీజేపీ తమ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ పేరును ప్రకటించింది. సీటు మార్పు కోసం రఘురామకృష్ణంరాజు ప్రయత్నాలు చేసినట్టు పెద్ద ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో శ్రీనివాసవర్మే తమ అభ్యర్థి అని.. సీటు మార్పు ప్రచారాన్ని బీజేపీ నాయకులు మీడియా ద్వారా ఖండించాల్సి వచ్చింది. పైస్థాయిలో ఉన్న పలుకుబడితో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలకు శ్రీనివాసవర్మ తెరదించారు. పార్టీ నుంచి బీఫాం అందుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో 2.76 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఎంపీగా తొలి విజయంతోనే శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మకు కేబినేట్లో చోటు దక్కడం విశేషం. -
టీడీపీ అభ్యర్థి కంపెనీలో సోదాలు.. కంటైనర్‌లో భారీగా నగదు
సాక్షి, బాపట్ల: బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో సోదాలు చేపట్టారు. కంటైనర్‌లో రూ.56 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్‌లో ఉన్న నగదును పోలీసులు సీజ్ చేశారు. -
పిఠాపురం మున్సిపల్ ఆఫీసు వద్ద చెత్త వేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం: టీడీపీ ‘కుళ్లు’ రాజకీయాలకు తెర లేపింది. నిరసన పేరుతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ మంగళవారం మురికి కాలువల్లోని మురికి, చెత్త తెచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద వేశారు. ఈ సంఘటన పట్టణ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. గడప గడపకూ మన ప్రభుత్వం కింద సచివాలయాలకు విడుదల చేసిన నిధులతో పట్టణంలోని మురికి కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. తక్షణమే కాలువలను గుర్తించాలన్నారు. నెల రోజులుగా మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పర్యటించి వర్షాలకు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి, కాలువలు మూసుకుపోయి సమస్య ఉత్పన్నమవుతోందని గుర్తించారు. ఆయా కాలువల అభివృద్ధికి పనులు చేపట్టారు. ఏ పని చేస్తూంటే దానిపై ఆందోళన ప్రభుత్వం ఏ మంచి పని చేసినా బురద జల్లి ఆందోళన చేయడం.. పని పూర్తి అవ్వగానే తమ వల్లేనంటూ గొప్పలు చెప్పుకోవడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది. ఇందులో భాగంగానే మురికి కాలువల అభివృద్ధి పనులు చేస్తూంటే.. మరోపక్క ఆ పార్టీ నాయకుడు వర్మ వార్డుల్లో తిరుగుతూ మురికి కాలువలు శుభ్రం చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రధాన కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకున్నా ఏమీ పట్టించుకోవడం లేదంటూ కాలువల మురికిని వాహనాలపై తెచ్చి స్వయంగా మున్సిపల్ కార్యాలయం ముందు వేశారు. ఎమ్మెల్యే దొరబాబుపై విమర్శలు గుప్పించారు. మండిపడిన కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ శ్రేణులు వర్మ తీరుపై మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యత గల నాయకుడు ఇలా మూర్ఖంగా మురికిని తెచ్చి కార్యాయం వద్ద వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తెచ్చిన మురికితోనే వర్మ చిత్రపటానికి అభిషేకం చేశారు. వర్మపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని నినదించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ, వర్మకు పిచ్చి ముదిరి ఇలాంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో పట్టణ పారిశుధ్యాన్ని గాలికొదిలేశారన్నారు. మురికి తెచ్చి ఇక్కడ వేయడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వైఎస్సార్ సీపీ శ్రేణులకు సర్ది చెప్పి, ఆందోళన విరమింపజేశారు. 18 మందిపై కేసు మున్సిపల్ కార్యాలయంపై దౌర్జన్యంగా మురికి వేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ సహా 18 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
టీడీపీ అనే పదాన్ని వదిలేసి ‘మీ ఇంటికి మీ వర్మ’
పిఠాపురం: తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శుక్రవారం టీడీపీ నుంచి కొందరు నేతలను బహిష్కరించగా వారు ఆయన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. గొల్లప్రోలులో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు మాట్లాడుతూ 45 ఏళ్లుగా రామ లక్ష్మణులుగా కలిసిమెలిసి పోతున్న అన్నదమ్ములను (తునిలో యనమల సోదరులను) కుటిల రాజకీయాలతో విడదీసిన ఘనుడవు అంటూ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నియంతలా పరిపాలించడమే కాకుండా పదవి పోయాక కూడా కింది స్థాయి నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు మానలేదని అన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లను కీలు బొమ్మలుగా చేసిన నీచుడని వర్మపై నిప్పులు చెరిగారు. కాకినాడకు చెందిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు మాదేపల్లి శ్రీను మాట్లాడుతూ కాపు సామాజిక వర్గ నేతలను ఎదగనీయకుండా చేశారన్నారు. డబ్బులిచ్చుకుని తనకు సొసైటీ పదవి ఇచ్చారని అన్నారు. టీడీపీ అనే పదాన్ని వదిలేసి ‘మీ ఇంటికి మీ వర్మ’ అని పెట్టుకుని తిరిగినప్పుడే మీరు పార్టీని నాశనం చేస్తున్నారని, ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అధిష్టానానికి అర్థమయ్యిందన్నారు. గతంలో నాయకులందరం కలిసి కట్టుగా పని చేస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యారన్న సంగతి మర్చి పోయి గ్రూపు రాజకీయాలు చేసి అందరిని విడగొట్టి విభజించు పాలించు అనే ధోరణితో పార్టీని ముక్కలు చేస్తున్నారని ఆయన వర్మపై మండిపడ్డారు. నన్ను రెచ్చగొడితే నీ జాతకాన్ని బయటపెడతానంటూ హెచ్చరించారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు జ్యోతుల సతీష్, మాట్లాడుతూ కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడం వర్మ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. అసలు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నది ఎవరో పార్టీ అధిష్టానం దగ్గరే తేల్చుకుంటామని అన్నారు. టీడీపీ నేతలు కె.సత్యనారాయణ, పినకా వెంకట్రావు, వీఎస్ నారాయణ, గురాల వీరాస్వామి, చోడిశెట్టి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి, బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా దంతాలపల్లిలోని పీహెచ్‌సీని ఆయన ఆదివారం సందర్శించారు. తొలుత కురవిలో వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్లో లోక్‌సభ ప్రవాస్ యోజన కోర్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. బీజేపీ అభివృద్ధి పథకాలను తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతోందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద కోట్లాది మంది పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని, ఫ్రీ రేషన్‌తో పేదలందరికీ ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటివాటిని నేటికీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
యూపీ ఎన్నికల ఫలితాలు; వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం
మీరట్: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు యోగేశ్ వర్మ మాత్రం బైనాక్యులర్‌తో చూస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఎదుట యోగేశ్ వర్మ, ఆయన మద్దతుదారులు గస్తీ కాస్తున్నారు. బైనాక్యులర్‌తో కనిపెట్టి మరీ చూస్తున్నారు. 8 గంటల చొప్పున షిప్టులవారీగా 24 గంటలూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సొంతంగా భద్రత ఏర్పాటు చేయడంపై యోగేశ్ వర్మను ప్రశ్నించగా.. ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల తీర్పును జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని మా పార్టీ అధ్యక్షుడు (అఖిలేష్ యాదవ్) ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ’ని యోగేశ్ వర్మ అన్నారు. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) తాజా ఎన్నికల్లో మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. కాగా, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద యోగేశ్ వర్మ ఓవరాక్షన్‌పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (క్లిక్: మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!) -
నాన్న ఎప్పుడూ నా వెనకుంటారు
నటుడికి తొలి సినిమా చాలా ముఖ్యం. ఏ అడ్డంకులు లేకుండా మంచి హిట్ సాధించాలనుకోవడం సహజం. అలాంటిది ఎంతో కష్టపడి తీసిన సినిమా బాగా రాలేదని మళ్లీ మొదటి నుంచి తీయాలని నిర్మాతలు అనుకుంటే? ఆ యాక్టర్ కాన్ఫిడెన్స్‌లో కచ్చితంగా డిస్ట్రబెన్స్ వస్తుంది. అయితే విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌కి ఇలా జరిగినా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు ధృవ్. మొదట బాలా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘వర్మ’ టైటిల్‌తో తీశారు. ఆ చిత్రాన్ని ఆపేసి, ‘ఆదిత్యవర్మ’ పేరుతో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి, పూర్తి చేశారు. ‘ఆదిత్య వర్మ’ పూర్తి కావడం వెనక తన తండ్రి సహకారం ఉందని భావోద్వేగంతో ధృవ్ రాసిన లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘సెట్‌ను ప్రతిరోజూ సందర్శిస్తూ, మమ్మల్ని మా శక్తిమేరకు పని చేసేలా ప్రోత్సహిస్తూ,్త, మా అందరి విజన్‌ను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ నన్ను ‘ఆదిత్య వర్మ’ను చేశారు మా నాన్న. నా మీద నాకున్న నమ్మకాన్ని కోల్పోనివ్వకుండా, నా వెనకే ఉంటూ, నాకన్నీ నేర్పిస్తూ ఉన్నావు, ఉంటావు కూడా నాన్నా! నువ్వు లేకుండా ఏదీ అంత సులువుగా జరిగేది కాదు. నన్నెవరో అడిగారు.. ‘సినిమాకు అంత కష్టపడ్డారు కదా, టీజర్లో మీ నాన్నగారి పేరెక్కడా? అని. ఆయన పేరు నా పేరు వెనక, ఆయనెప్పుడూ నా వెనక ఉంటారు’ అని బదులిచ్చాను. నువ్వు గర్వపడేలా చేస్తాను నాన్నా’’ అని పేర్కొన్నారు. ‘ఆదిత్య వర్మ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
బాలా అవుట్.. గౌతమ్ ఇన్!
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ అవుట్‌పుట్ నచ్చలేదని సినిమాను మళ్లీ షూట్ చేస్తున్నాం అని నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్టైన్మెంట్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి తమిళ పరిశ్రమ షాక్ అయింది. హీరో ధృవ్ మినహా మిగతా టీమ్‌ను మార్చి రీషూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు సంస్థ అధినేతలు. దాంతో దర్శకుడు బాలా స్థానంలో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. ఈ ప్రాజెక్ట్‌ను గౌతమ్ మీనన్ చేపట్టనున్నారట. ప్రస్తుతం విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ చేసిన ‘ధృవనక్షత్రం’ రిలీజ్‌కి రెడీ అయింది. ఇప్పుడు ‘వర్మ’ సినిమా చేస్తే తండ్రీ–కొడుకులతో గౌతమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినట్లు అవుతుంది. -
సునీల్ పాత్ర కొత్తగా ఉంటుంది : ‘దిల్’ రాజు
‘‘మాకు సినిమా అనేది పెద్ద వీక్నెస్. దాన్ని సక్సెస్ చేయాలన్నది మరో వీక్నెస్. మా కోసం కాకున్నా దర్శకుడు వాసూ వర్మ కోసం ఈ చిత్రం సక్సెస్ కావాలి. మా సంస్థ నుంచి మంచి సక్సెస్ ఇచ్చి పంపించాలను కుంటున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సునీల్, నిక్కీ గల్రాని, డింపుల్ చోపడే కాంబినేషన్లో వాసూ వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. దినేష్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రాజమండ్రిలో విడుదల చేశారు. ముఖ్య అతిథులు, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సీడీలను ఆవిష్కరించారు. ‘‘ఇందులో సునీల్ పాత్ర కొత్తగా ఉంటుంది. ఫిబ్రవరి 5న సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని ‘దిల్’ రాజు తెలిపారు. ‘‘రాజుగారింట్లో నేను పుట్టాను అనేంత రేంజ్లో ఈ సినిమా తీశారు. ఆయన రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. నన్ను చూసేందుకు ఇంతమంది వస్తారని ఊహించలేదు. ఛోటా కె.నాయుడు, వాసూ వర్మ గారు చూపించినంత అందంగా నన్నెవరూ చూపించ లేదు’’ అని సునీల్ పేర్కొన్నారు. ‘‘సునీల్‌తో వంద సినిమాలు తీసినా బోర్ కొట్టదు. సినిమా తీయడం ఇంత ఈజీనా అని ఈ చిత్రం తీసిన తర్వాత అనిపించింది. దినేష్ కొత్తవాడైనా అద్భుతమైన పాటలి చ్చాడు’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ ‘దిల్’ రాజుగారి సినిమాల్లో ది బెస్ట్ ఆడియో ఇది. ఈ చిత్రం చూస్తే హిందీ సినిమా చూశామా అనే అనుభూతి కలుగుతుంది’’ అన్నారు కెమెరామెన్ ఛోటా కె. నాయుడు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిక్కి గల్రాని, డింపుల్ తదితరులు మాట్లాడారు.