
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ అవుట్‌పుట్ నచ్చలేదని సినిమాను మళ్లీ షూట్ చేస్తున్నాం అని నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి తమిళ పరిశ్రమ షాక్ అయింది. హీరో ధృవ్ మినహా మిగతా టీమ్‌ను మార్చి రీషూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు సంస్థ అధినేతలు. దాంతో దర్శకుడు బాలా స్థానంలో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. ఈ ప్రాజెక్ట్‌ను గౌతమ్ మీనన్ చేపట్టనున్నారట. ప్రస్తుతం విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ చేసిన ‘ధృవనక్షత్రం’ రిలీజ్‌కి రెడీ అయింది. ఇప్పుడు ‘వర్మ’ సినిమా చేస్తే తండ్రీ–కొడుకులతో గౌతమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినట్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment