Gautam Menon
-
ఇది సినిమా కాదు జీవితం: డైరెక్టర్ తంగర్ బచ్చాన్
సినిమాటోగ్రాఫర్, దర్శకుడు తంగర్ బచ్చాన్ లేటెస్ట్ గా తీసిన సినిమా 'కరుమేఘంగళ్ కలైగిండ్రన'. దర్శకుడు భారతీరాజా లీడ్ రోల్ పోషించిన ఇందులో దర్శకుడు గౌతమ్‌మీనన్, ఎస్ఏ.చంద్రశేఖర్, ఆర్వీ.ఉదయకుమార్, యోగిబాబు, అదితిబాలన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జీ.వీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా బుధవారం ఉదయం చిత్ర యూని ట్ చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. (ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!) ఈ కార్యక్రమంలో దర్శ కుడు తంగర్బచ్చాన్ మాట్లాడుతూ.. ఇది చిత్రం కాదనీ, జీవితం అనీ పేర్కొన్నారు. ఇందులో న్యాయవాది రామనాథ్ పాత్రను భారతీతాజా కాకుండా వేరెవరూ నటించలేరని అన్నారు. 30 ఏళ్ల క్రితం రాసుకున్న నవలే ఈ చిత్రమని తెలిపారు. ఇటీవల వస్తున్న కొన్ని కమర్షియల్ చిత్రాలను ప్రేక్షకుల ఎందుకు ఆదరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తుపాకులతో కాల్చుకోవడం, చంపుకోవడం వంటి చిత్రాలతో భవిష్యత్ తరాలకు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకోవాలన్నారు. మంచి కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లేదని తంగర్ బచ్చాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరుమేఘంగళ్ కలైగిండ్రన వంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయనీ, చిత్ర పరిశ్రమ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని భారతీరాజా పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ) -
క్రేజీ కాంబినేషన్: మరో తమిళ దర్శకుడితో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్
టాలీవుడ్ యుంగ్ హీరో రామ్, దర్శకుడు గౌతమ్‌మీనన్‌ల క్రేజీ కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కనుందని టాలీవుడ్లో టాక్. కోలీవుడ్‌లో స్టైలిష్ దర్శకుడుగా పేరు గాంచిన గౌతమ్‌మీనన్‌కు టాలీవుడ్‌లోనూ మంచిపేరు ఉంది. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయచేసావే చిత్రానికి దర్శకుడు ఈయనే అన్నది తెలిసిందే. ఆ చిత్రం ఘనవిజయం సాధించి నాగచైతన్య, సమంతల కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయింది. కాగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి చాలామంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా నటుడు రామ్ ఈయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైపోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గౌతమ్‌మీనన్ ఒక భేటీలో స్వయంగా పేర్కొన్నారు. ఈయన తాజాగా శింబు కథానాయకుడిగా తెరకెక్కించిన వెందు తనిందదు కాడు చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై టాక్‌కు అతీతంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులోనే రూ.10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో స్రవంతి మూవీస్ రవికిషోర్ విడుదల చేశారు. కాగా నటుడు రామ్ హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రాన్ని ఈయనే నిర్మించనున్నట్లు సమాచారం. నటుడు రామ్, నిర్మాత స్రవంతి రవికిషోర్లతో తనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నట్టు గౌతమ్‌మీనన్ పేర్కొన్నారు. తమ కాంబినేషన్లో రూపొందిన చిత్రం చాలా కొత్తగా ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. -
గౌతమ్ మీనన్‌తో ముచ్చటగా మూడోసారి
తమిళ హీరో శింబు, దర్శకుడు గౌతమ్ మీనన్ మూడోసారి ఒక ప్రాజెక్ట్‌కి కలవనున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో ‘విన్నైత్తాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమయడా’ (ఈ రెండు సినిమాలను ‘ఏ మాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’గా నాగచైతన్యతో తెలుగులో తెరకెక్కించారు గౌతమ్ మీనన్) చిత్రాలు వచ్చాయి. లాక్డౌన్లో ‘కార్తీక్ డయల్ సెయ్ ద ఎన్’ అనే షార్ట్‌ఫిల్మ్ కూడా చేశారు శింబు, గౌతమ్ మీనన్. ఐ ఫోన్‌తో ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ లఘు చిత్రం చేశారు. తాజాగా ఓ కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. వేల్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ఇషారీ కే గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘కొన్ని కథలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఈ స్క్రిప్ట్ కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది’’ అన్నారు గౌతమ్ మీనన్. ఇది ‘విన్నైత్తాండి వరువాయా’కు సీక్వెల్ అని ప్రచారంలో ఉంది. -
షార్ట్ ఫిలిం.. లాంగ్ హెయిర్
ఇప్పటివరకూ పెద్ద పెద్ద (నిడివి ఎక్కువ) సినిమాలు చేసిన హీరో సూర్య ఇప్పుడు ఓ చిన్న (షార్ట్) ఫిలిం చేస్తున్నారు. నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథలతో దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వెబ్ మూవీలో ఓ కథలో సూర్య హీరోగా కనిపిస్తారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిలిం చిత్రీకరణ మంగళవారం ఆరంభమైంది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింలో సూర్య లాంగ్ హెయిర్‌తో కనిపిస్తారు. నిజానికి ‘ఆకాశమే నీ హద్దురా’ తర్వాత ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ఈ సినిమా కోసమే జుట్టు పెంచారు. అదే లుక్ లో ‘నవరస’లో కనబడనున్నారు. ‘వెబ్ ఫిలిం స్టార్ట్ చేశాం. ఈరోజు సెట్స్ లో ఎనర్జీ రెండింతలు. దానికి కారణం సూర్య’ అని పేర్కొన్నారు పీసీ శ్రీరామ్. మిగతా ఎనిమిది కథలను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తారు. వాటిలోనూ పేరున్న నటీనటులు కనబడతారు. -
సీక్వెల్‌కి టీజర్?
శింబు, త్రిష జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో నాగ చైతన్య, సమంతలతో ‘ఏ మాయ చేసావే’గా గౌతమ్ తీశారు). ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు గౌతమ్ మీనన్. తాజాగా జెస్సీ, కార్తీక్ (సినిమాలో త్రిష, శింబు పాత్రల పేర్లు) పాత్రలతో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు మీనన్. ‘కార్తీక్ డయల్ సెయ్ద ఎన్’ టైటిల్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ లఘు చిత్రం ట్రైలర్ కూడా విడుదలయింది. శింబు, త్రిష ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ టీజర్లా మీనన్ చూపించబోతున్నారని టాక్. -
ఫైట్స్, చేజింగ్స్‌కు రెడీ అవుతున్న స్వీటీ
అరుంధతి, బాహుబలి, భాగమతి.. ఇవి నటి అనుష్క సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాలు. ఇలా అందాలారబోత పాత్రల నుంచి అభినయ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన నటి అనుష్క. తెలుగు, తమిళం భాషల్లో తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్న ఈ స్వీటీ తాజాగా సైలెన్స్ చిత్రంతో బాలీవుడ్‌ను టచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అవును భాగమతి చిత్రం తరువాత ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రం సైలెన్స్. తెలుగులో నిశ్శబ్దం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సైలెన్స్ పేరుతో రూపొందుతోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో మాధవన్, అంజలి, షాలినీపాండే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సైలెన్స్ చిత్రం త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న అనుష్క తాజాగా దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇదీ లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీన్ని వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇందులో అనుష్కకు ఫైట్స్, చేజింగ్స్ అంటూ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. సాధారణంగా పాత్రలో ఇమిడిపోవడానికి శ్రాయశక్తులా కృషి చేసే అనుష్క ఇంతకుముందు బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాల కోసం కత్తిసాము, గుర్రపుస్వారీ వంటి విద్యలో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య సైజ్ జీరో చిత్రం కోసం ఏకంగా 80 కిలోల వరకూ బరువును పెరిగింది. ఆ తరవాత ఆ బరువును తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడింది. చివరికి అమెరికా వెళ్లి బరువు తగ్గించుకుందని సమాచారం. దీంతో అనుష్క కొన్ని చిత్రాల అవకాశాలనూ కోల్పోయిందనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. కాగా తాజాగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రం కోసం యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అన్నట్టు దీనికి బాలీవుడ్ దర్శక, రచయిత గోవింద్ నిహలాలీ కథను అందిస్తున్నారని తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఇక స్వీటీ యాక్షన్ అవతారం చూడడానికి మనం కూడా వేచి చూద్దాం. -
బాలా అవుట్.. గౌతమ్ ఇన్!
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ అవుట్‌పుట్ నచ్చలేదని సినిమాను మళ్లీ షూట్ చేస్తున్నాం అని నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్టైన్మెంట్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి తమిళ పరిశ్రమ షాక్ అయింది. హీరో ధృవ్ మినహా మిగతా టీమ్‌ను మార్చి రీషూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు సంస్థ అధినేతలు. దాంతో దర్శకుడు బాలా స్థానంలో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. ఈ ప్రాజెక్ట్‌ను గౌతమ్ మీనన్ చేపట్టనున్నారట. ప్రస్తుతం విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ చేసిన ‘ధృవనక్షత్రం’ రిలీజ్‌కి రెడీ అయింది. ఇప్పుడు ‘వర్మ’ సినిమా చేస్తే తండ్రీ–కొడుకులతో గౌతమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినట్లు అవుతుంది. -
ధనుష్ సినిమా వివాదం ముగిసినట్టేనా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాప్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎనై నోకి పాయుం తోటా పేరుతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు కిందటే పూర్తయినా ఇంత వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడినట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ధనుష్, గౌతమ్‌ల సినిమా వివాదం ముగిసినట్టుగా తెలుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కారం కావటంతో చిత్రయూనిట్ రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే చిత్రయూనిట్ రిలీజ్ డేట్ విషయంలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
మూడోసారి మాస్!
‘విన్నైత్తాండి వరువాయా, అచ్చమ్ ఎన్బదు మడమయడా’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ గౌతమ్ మీనన్, శింబులది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సినిమాల్లోని పాటలు ఎంత మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయో తెలిసిందే. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్, హీరో శింబు కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందట. మొదటి రెండు సినిమాలు లవ్ స్టోరీ, యాక్షన్ ఎంటర్టైనర్స్ కాగా మూడోది మాస్ మసాలా ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ చిత్రానికి కూడా ఎఆర్ రెహమానే స్వరకర్త. ‘విన్నైత్తాండి వరువాయా, అచ్చమ్ ఎన్బదు మడమయడా’లను తెలుగులో నాగచైతన్యతో ‘ఏ మాయ చేశావె, సాహశం శ్వాసగా సాగిపో’గా తెరకెక్కించారు గౌతమ్. మరి.. తాజా సినిమాను తెలుగులో తీస్తారా? అందులో నాగ చైతన్య కనిపిస్తారా? వేచి చూడాలి. -
ఆ దర్శకుడిపై నమ్మకం పోయింది
ఆ దర్శకుడిపై నమ్మకం సన్నగిల్లిపోయిందనే అభిప్రాయానికి నటి అనుష్క వచ్చిందా? దీనికి సినీ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ స్వీటీలోని అందం, అభినయం ఏది బెటర్ అంటే రెండూ పోటీ పడతాయనే చెప్పాలి. ఇటీవల అనుష్క నటించిన రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు మచ్చుక అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముందీ అన్న ప్రశ్న తలెత్తవచ్చు. అయితే అంత పేరున్న అనుష్క భాగమతి చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలం అయినా మరో చిత్రానికి కమిట్ కాలేదు. దీంతో ఆమె గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని, కారణం పెళ్లికి సిద్ధం అవడమేనని, ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువగానే ఉంది లాంటి అవాస్తవ ప్రచారాలు జోరుగానే సాగుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే అనుష్కకు చాలా అవకాశాలు వస్తున్నాయట. వాటిలో కొన్ని కథలను వింటున్నారట.అయితే భాగమతి చిత్ర ప్రమోషన్ సందర్భంలోనే అనుష్క చాలా అవకాశాలు వస్తున్నా, ఒక్క గౌతమ్‌మీనన్ చిత్రం మినహా ఏ చిత్రాన్ని అంగీకరించలేదని చెప్పింది. ఆమె ఆ విషయం చెప్పి చాలా కాలమైంది. గౌతమ్‌మీనన్ కూడా ఒక మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు, అందులో నటి అనుష్క నటించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పుటి వరకూ ప్రారంభం కాలేదు. గౌతమ్‌మీనన్ ధనుష్ హీరోగా ఎన్నైనోకి పాయు తూట్టా, విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం చిత్రాలను పూర్తి చేసే పనిలోనే ఉన్నారు. తదుపరి శింబు హీరోగా విన్నైతాండి వరువాయా–2 చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన చిత్రం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అనుష్క ఓపిక నశించడంతో పాటు, దర్శకుడు గౌతమ్‌మీనన్‌పై నమ్మకం సన్నగిల్లిందట. దీంతో ఈయన చిత్రం కోసం ఇంకా వేచి చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చిందన్నది తాజా సమాచారం. అంతే తనతో చిత్రాలు చేస్తామన్న దర్శక నిర్మాతలను పిలిచి కథలు రెడీ చేసుకుని త్వరలో ఆ చిత్రాల వివరాలను ప్రకటించండి అని చెప్పారట. -
సూర్యతో ఓ చిత్రాన్ని ఫ్లాన్ చేస్తున్నా
-
సూర్యతో మనస్పర్థలు ముగిసినట్లే...
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్‌కు కొంత కాలం క్రితం మనస్పర్థలు వచ్చాయి. ‘ధృవ నక్షత్రం’ ప్రాజెక్టు విషయంలో ఇద్దరి మధ్య తేడాలు రావటంతో సూర్య అర్ధాంతరంగా తప్పుకోవటంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత గౌతమ్ మీనన్ అదే చిత్రాన్ని విక్రమ్‌తో తెరకెక్కించాడు. అప్పటి నుంచి సూర్య-గౌతమ్ మీనన్ గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఈ దశలో ఈ కాంబోలో మరో సినిమా రాబోతుందన్న వార్త ఇప్పుడు ఇద్దరి అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. ఓ వీడియో బైట్‌లో గౌతమ్ స్పందిస్తూ...‘సూర్యతో ఓ చిత్రాన్ని ఫ్లాన్ చేస్తున్నానని.. ప్రస్తుతం కథ సిద్ధం చేస్తున్నానని, అన్నీ కుదరితే వచ్చే ఏడాది ఈ చిత్రం ఉంటుందని’ తెలిపారు. మరోవైపు సూర్య కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మనసు నొప్పించటంపై బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఓ లేఖ కూడా రాశాడు. గతంలో వీరిద్దరి కాంబోలో కాఖా కాఖా(తెలుగులో ఘర్షణ), వారనమ్ ఆయిరామ్(సూర్య సన్నాఫ్ కృష్ణన్)లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త చిత్రం ఎలా ఉంటుందోనన్న టాక్ అప్పుడే మొదలైపోయింది. ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ‘ఎన్జీకే’ చిత్రంలో నటిస్తుండగా, దీపావళికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. BREAKING 📣 "#Suriya39" with the magical director @MenonGautham 😍 Madly Waiting 😭💝pic.twitter.com/0ORorNnS7D — Suriya Fans Trends ™ (@Suriya_Trends) June 11, 2018 -
మరోసారి మాయ చేస్తారా..?
నాగచైతన్య కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఏ మాయ చేసావే. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలో ఘనవిజయం సాధించింది. తెలుగులో నాగచైతన్య, సమంతలు హీరో హీరోయిన్లుగా నటించగా.. కోలీవుడ్‌లో శింబు, త్రిషలు జంటగా నటించారు. రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొదించేందుకు దర్శకుడు గౌతమ్ మీనన్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా శింబు విన్నైతాండీ వరువైన్ (ఏ మాయ చేసావే తమిళ టైటిల్)కు సీక్వెల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు. మరోసారి శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ లు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములౌతున్నట్టుగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో ఏ మాయ చేసావే సీక్వెల్ మరోసారి తెర మీదకు వచ్చింది. తొలి భాగం తెరకెక్కించినట్టుగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తారా..? మరోసారి కార్తీక్ పాత్రలో నటించేందుకు చైతూ అంగీకరిస్తాడా..? తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రేమికులుగా నటించిన చైతూ, సమంతలు తరువాత నిజజీవితంలోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు మరోసారి మాయ చేసేందుకు రెడీ అవుతారా.. లేదా? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ధృవ నక్షత్రం టీజర్ విడుదల
-
ఐ స్క్రీమ్
‘‘ఐస్‌క్రీమ్ అంటే నాకు భలే ఇష్టం. కానీ టర్కీలో ఐస్ క్రీమ్‌కు సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్ ‘ఐ–స్క్రీమ్’లా మారింది అంటున్నారు’’ ‘ఛల్ మోహన్‌రంగ’ హీరోయిన్ మేఘా ఆకాశ్. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ను వివరిస్తూ – ‘‘నా ఫస్ట్ తమిళ సినిమా ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోటా’. ఇందులో ధనుష్ హీరో. ఆ సినిమాలో ఓ సాంగ్ షూట్ కోసం టర్కీ వెళ్లాం. ‘రోడ్ మీద ఏది కనిపిస్తే దానికి రియాక్ట్ అవుతూ అలా సరదాగా వెళ్లిపోండి. నేను షూట్ చేసుకుంటాను’ అని చిత్రదర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పారు. అలా కొంచెం దూరం వెళ్లగానే ఐస్‌క్రీమ్ బండి కనిపించింది. ధనుష్ రెండు గ్రీన్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్స్ తీసుకొని ఒకటి నాకు అందించాడు. కవర్ తీసి టేస్ట్ చేశాను. టేస్ట్ చాలా హారిబుల్ అంటే హారిబుల్‌గా ఉంది. కానీ కెమెరా రోల్ అవుతోంది. దాన్ని ఆస్వాదిస్తున్నట్టు నటించాలి. చేసేదేం లేక ఎంజాయ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశా. ధనుష్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే అనిపించింది. కొద్దిసేపటికి దర్శకుడు కట్ అని చెప్పగానే ఇద్దరం ఐస్‌క్రీమ్ పక్కన పడేసి ‘యాక్’ అని కక్కేసి, గట్టిగట్టిగా అరిచేశాం. అప్పటి నుంచి ఎప్పుడు ఐస్‌క్రీమ్ తింటున్నా ఈ ఫన్నీ ఇన్సిడెంటే గుర్తుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు మేఘా ఆకాశ్. -
క్షమాపణలు చెప్పిన గౌతమ్ మీనన్
సాక్షి, చెన్నై : యువ దర్శకుడు కార్తీక్ నరేన్‌తో ఏర్పడ్డ వివాదానికి ఎట్టకేలకు సీనియర్ దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ పుల్‌స్టాప్ పెట్టారు. ఈ మేరకు కార్తీక్‌కు క్షమాపణలు తెలియజేస్తూ ఆయన ఫేస్బుక్లో ఓ లేఖను ఉంచారు. డెబ్యూ చిత్రం ధురువంగల్ పతినారు(తెలుగులో 16)తో కార్తీక్ నరెన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తన రెండో చిత్రం నరగాసూరన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. దానికి నిర్మాతగా వ్యవహరించేందుకు గౌతమ్ మీనన్ ముందుకొచ్చాడు. దీంతో సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. అరవింద్ స్వామి, శ్రీయా, సందీప్ కిషన్, ఇంద్రజిత్ తదితరులతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే సినిమా 50 శాతం పూర్తయ్యాక అర్థాంతరంగా గౌతమ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో చేసేది లేక సొంత డబ్బులతో కార్తీక్ సినిమా కొనసాగించాడు. ట్వీట్లతో మొదలు... గౌతమ్ మీనన్‌పై తాను పెట్టుకున్న నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసి మోసం చేశాడని కార్తీక్ ట్వీట్ చేశాడు. తన కలను ఘోరంగా దెబ్బతీశాడని.. తాను ఇబ్బందులను ఎదుర్కుంటున్నానని, ఇలా పారిపోవటం కరెక్ట్కాదంటూ కార్తీక్.. గౌతమ్‌కు చురకలు అంటించాడు. దానికి బదులుగా గౌతమ్ కూడా తీవ్రస్థాయిలోనే స్పందించాడు. అయితే తనపై ఏడ్చే బదులు యంగ్ టాలెంట్‌ను చూసి బుద్ధితెచ్చుకోండంటూ వెటకారంగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. గౌతమ్ క్షమాపణలు... ఈ వివాదం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో వెనక్కితగ్గిన గౌతమ్ మీనన్ కార్తీక్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు ఫేస్బుక్లో ఓ లెటర్‌ను పోస్ట్ చేశాడు. ‘మీడియా నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌తో మనోవేదనకు గురయ్యా. అందుకే అలాంటి ట్వీట్ చేశాను. కార్తీక్‌కు నా క్షమాపణలు. ఈ చిత్రం కోసం ఇప్పటికే చాలా ఖర్చు అయ్యింది. నా తర్వాతి ప్రాజెక్టు ధ్రువ నక్షత్రం(విక్రమ్ హీరోగా తీస్తున్న చిత్రం) వ్యవహారంలో ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయాను. అందుకే నరగాసురన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టు 50 శాతం పూర్తయ్యేదాకా నా టీం ఖర్చులను భరించింది. కానీ, ఇకపై నాకు చిత్రంతో సంబంధం లేదని ప్రకటిస్తున్నా. కాబట్టి చిత్ర లాభాల్లో కూడా నాకు ఎలాంటి వాటా ఇవ్వనక్కర్లేదు’ అని గౌతమ్ మీనన్ స్పష్టత ఇచ్చేశారు. -
సీక్వెల్ మీద సీక్వెల్
డీసీపీ రామ్‌చందర్ మళ్లీ వస్తే? రాఘవన్ మళ్లీ కనిపిస్తే? సత్యదేవ్ మళ్లీ సందడి చేస్తే ఎంత బాగుండు అని ఆ క్యారెక్టర్స్‌ని ఇష్టపడినవాళ్లు అనుకోవడం సహజం. ‘ఘర్షణ’లో వెంకటేశ్ చేసిన స్టైలిస్ పోలీస్ క్యారెక్టర్ పేరు రామ్‌చందర్ అనీ, ‘రాఘవన్’లో కమల్‌హాసన్ పాత్ర పేరు రాఘవన్ అనీ, ‘ఎంతవాడు గానీ’లో అజిత్ పేరు సత్యదేవ్ అనీ గుర్తుండే ఉంటుంది. మంచి హిట్ సాధించిన ఈ చిత్రాలు, ఆ పాత్రలనూ మరచిపోలేం. అందుకే గౌతమ్ మీనన్ మళ్లీ ఈ క్యారెక్టర్స్‌ని కొనసాగించాలనుకుని ఉంటారు. ఈ మూడు చిత్రాలకూ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఘర్షణ’ తమిళ ‘కాక్క కాక్క’కు రీమేక్. అందులో సూర్య హీరో. అలాగే కమల్ ‘వేటై్టయాడు విలైయాడు’ తెలుగులో ‘రాఘవన్’గా, అజిత్ ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో అనువాదమయ్యాయి. తమిళంలో ఈ మూడు చిత్రాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు గౌతమ్. ఇవి డబ్బింగ్ రూపంలోనో లేక తమిళ్‌తో పాటు తెలుగులో కూడా నిర్మిస్తే టాలీవుడ్ ప్రేక్షకులూ చూడొచ్చనుకోండి. ‘‘ముందు ‘ఎన్నై అరిందాల్’ సీక్వెల్ స్క్రిప్ట్ తయారు చేసి, అజిత్‌ను అప్రోచ్ అవుతాను’’ అన్నారు గౌతమ్. యాక్చువల్లీ ఈ మూడు హై వోల్టేజ్ పోలీస్ స్టోరీలు ఒక పోలీసాఫీసర్ లైఫ్‌లో వివిధ దశల్లో జరిగే కథలని, ఈ మూడు సినిమాలు ఒక ట్రయాలజీ అని, ఎన్నై అరిందాల్‌తో ఈ ట్రయాలజీ ముగుస్తుందని ఓ సందర్భంలో పేర్కొన్నారు గౌతమ్. మరి.. వీటి సీక్వెల్స్ ఎలా ప్లాన్ చేశారు? అన్నది తెలియాల్సి ఉంది. -
మలయాళ సినిమాలోనూ... దర్శకుడిగానే!
తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్‌కి నటన కొత్తేమీ కాదు! ఎక్కువగా ఆయన సినిమాల్లో అతిథి పాత్రల్లో ప్రేక్షకులకు కన్పిస్తుంటారు. అయితే.. ఇప్పటివరకూ తమిళ, తెలుగు సినిమాల్లోనే ఈ దర్శకుడు నటించారు. ఇప్పుడు మలయాళ సినిమా ‘నామ్’లో నటించారు. జోషీ థామస్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కనిపించనున్నారు. విశేషం ఏంటంటే... గౌతమ్ మీనన్ దర్శకుడు అయిన తర్వాత రెండుసార్లు బయట దర్శకుల సినిమాల్లో అతిథి పాత్రల్లో దర్శకుడిగానే కనిపించారు. ఇప్పుడీ మలయాళ సినిమాలోనూ దర్శకుడిగానే నటించారు. ముగ్గురు దర్శకులూ గౌతమ్ మీనన్‌ని దర్శకుడిగా అతిథి పాత్రల్లో కనిపించమని అడగడం యాదృచ్చికం అనుకోవాలేమో!! కొంతమంది స్నేహితులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేసే వ్యక్తిగా ‘నామ్’లో గౌతమ్ మీనన్ కనిపిస్తారట!! -
శింబూ కోసం రైటర్‌గా..
గౌతమ్ మీనన్ మంచి దర్శకుడనే విషయం అందరికీ తెలుసు. ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. తమిళంలో తాను దర్శకత్వం వహించే చిత్రాలకు గౌతమ్ సంభాషణలు రాస్తుంటారు. ఇప్పుడు శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న చిత్రానికి డైలాగ్స్ రాయడానికి అంగీకరించారు. అది కూడా ఇంగ్లిష్ డైలాగ్స్. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌లో తీసి, ఆ తర్వాత తమిళ్, ఇతర దక్షిణాది భాషల్లోకి అనువదించాలనుకుంటున్నామని శింబు పేర్కొన్నారు. గౌతమ్ తీసిన ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో ‘ఏ మాయ చేశావె’)లో, ‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’ (తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’) లోనూ శింబూనే హీరో. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగానే శింబూకి గౌతమ్ డైలాగ్స్ రాస్తున్నారని ఊహించవచ్చు. -
హాట్ సమ్మర్... బల్గేరియన్ బటర్‌మిల్క్!
ఇంకెక్కడి సమ్మర్? ప్రతిరోజూ చిన్నగా కురుస్తున్న చినుకులకు చలి పెడుతోంటే... వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తోంది. ఇంకా చల్ల మిర్చీ, బటర్ మిల్కులు ఏంటండీ! అనుకుంటున్నారా? ఇండియాలో వర్షాలు పడుతున్నాయి. బల్గేరియాలో మాత్రం ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎవ్రీడే మినిమమ్ 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటోందట! అంత ఎండలో ‘ధృవ నక్షత్రం’ టీమ్ షూటింగ్ చేస్తోంది. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిన్మా కోసం ప్రస్తుతం బల్గేరియాలో స్టంట్ సీక్వెన్స్, ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కట్ చెప్పగానే... బటర్‌మిల్క్ బకెట్ల దగ్గరకు చేరుతున్నారంతా. ఓ గ్లాసు బల్గేరియన్ బటర్‌మిల్క్ తాగి సేద తీరుతున్నారు. ఇందులో తెలుగమ్మాయి రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్‌కుమార్, సిమ్రన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. -
క్లైమాక్స్ కూడా రెడీ!
స్టార్టింగ్... ఇంటర్వెల్... క్లైమాక్స్... ఏ సినిమాకైనా ఈ మూడూ ఇంపార్టెంట్. దర్శక–రచయితలు ఎవరికి కథ చెప్పినా... మెయిన్‌గా ఈ మూడూ మిస్ కారు. కానీ, తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ అలా కాదు. ఆయనది సెపరేట్ స్కూల్. ఏ కథ రాసినా, ఇతర రచయితల దగ్గర కథలు తీసుకున్నా... చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు సినిమా క్లైమాక్స్ రాసే అలవాటు ఈయనకు లేదు. సగం షూటింగ్ పూర్తయ్యాక, అప్పటివరకూ వచ్చిన రషెస్ చూసుకుని ఓ ఐడియాకు వచ్చిన తర్వాత క్లైమాక్స్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఓ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను క్లైమాక్స్‌తో సహా కంప్లీట్ చేశారు గౌతమ్ మీనన్. అదే... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో, నాలుగు భాషల్లోని నలుగురు హీరోలతో తీయనున్న మల్టీస్టారర్ ఫిల్మ్. ఓ పెళ్లిలో కలసిన నలుగురు స్నేహితులు, అక్కణ్ణుంచి అడ్వంచరస్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది ఈ చిత్రకథట! గౌతమ్ మీనన్ మాట్లాడుతూ– ‘‘హీరోలు పృథ్వీరాజ్ (మలయాళం), నాగచైతన్య (తెలుగు), పునీత్ రాజ్‌కుమార్ (కన్నడ), హీరోయిన్లు అనుష్క, తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు కూడా చేశారు. శింబు (తమిళం) గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. మంజిమా మోహన్, నివేదా థామస్లలో ఎవరో ఒకరు సినిమాలో నటించే ఛాన్సుంది. ఫస్ట్ టైమ్ నేను క్లైమాక్స్‌తో సహా స్క్రిప్ట్ వర్క్ చేశా’’ అన్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - సాహసం శ్వాసగా సాగిపో