
తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్‌కి నటన కొత్తేమీ కాదు! ఎక్కువగా ఆయన సినిమాల్లో అతిథి పాత్రల్లో ప్రేక్షకులకు కన్పిస్తుంటారు. అయితే.. ఇప్పటివరకూ తమిళ, తెలుగు సినిమాల్లోనే ఈ దర్శకుడు నటించారు. ఇప్పుడు మలయాళ సినిమా ‘నామ్’లో నటించారు. జోషీ థామస్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కనిపించనున్నారు.
విశేషం ఏంటంటే... గౌతమ్ మీనన్ దర్శకుడు అయిన తర్వాత రెండుసార్లు బయట దర్శకుల సినిమాల్లో అతిథి పాత్రల్లో దర్శకుడిగానే కనిపించారు. ఇప్పుడీ మలయాళ సినిమాలోనూ దర్శకుడిగానే నటించారు. ముగ్గురు దర్శకులూ గౌతమ్ మీనన్‌ని దర్శకుడిగా అతిథి పాత్రల్లో కనిపించమని అడగడం యాదృచ్చికం అనుకోవాలేమో!! కొంతమంది స్నేహితులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేసే వ్యక్తిగా ‘నామ్’లో గౌతమ్ మీనన్ కనిపిస్తారట!!
Comments
Please login to add a commentAdd a comment