సూర్యతో మనస్పర్థలు ముగిసినట్లే... | Gautam Menon Suriya Rift End | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 12 2018 4:55 PM | Last Updated on Tue, Jun 12 2018 5:34 PM

Gautam Menon Suriya Rift End - Sakshi

హీరో సూర్య

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య.. స్టార్‌ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌కు కొంత కాలం క్రితం మనస్పర్థలు వచ్చాయి. ‘ధృవ నక్షత్రం’ ప్రాజెక్టు విషయంలో ఇద్దరి మధ్య తేడాలు రావటంతో సూర్య అర్ధాంతరంగా తప్పుకోవటంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత గౌతమ్‌ మీనన్‌ అదే చిత్రాన్ని విక్రమ్‌తో తెరకెక్కించాడు. అప్పటి నుంచి సూర్య-గౌతమ్‌ మీనన్‌ గ్యాప్‌ బాగా పెరిగిపోయింది. 

ఈ దశలో ఈ కాంబోలో మరో సినిమా రాబోతుందన్న వార్త ఇప్పుడు ఇద్దరి అభిమానుల్లో సంతోషాన్ని​ నింపుతోంది. ఓ వీడియో బైట్‌లో గౌతమ్‌ స్పందిస్తూ...‘సూర్యతో ఓ చిత్రాన్ని ఫ్లాన్‌ చేస్తున్నానని.. ప్రస్తుతం కథ సిద్ధం చేస్తున్నానని, అన్నీ కుదరితే వచ్చే ఏడాది ఈ చిత్రం ఉంటుందని’ తెలిపారు. 

మరోవైపు సూర్య కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో గౌతమ్‌ మనసు నొప్పించటంపై బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఓ లేఖ కూడా రాశాడు. గతంలో వీరిద్దరి కాంబోలో  కాఖా కాఖా(తెలుగులో ఘర్షణ), వారనమ్‌ ఆయిరామ్‌(సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌)లాంటి బ్లాక్‌ బస్టర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త చిత్రం ఎలా ఉంటుందోనన్న టాక్‌ అప్పుడే మొదలైపోయింది. ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్‌ డైరెక్షన్‌లో ‘ఎన్‌జీకే’ చిత్రంలో నటిస్తుండగా, దీపావళికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement