
లొకేషన్‌లో గౌతమ్ మీనన్, రాధిక, విక్రమ్...
ఇంకెక్కడి సమ్మర్? ప్రతిరోజూ చిన్నగా కురుస్తున్న చినుకులకు చలి పెడుతోంటే... వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తోంది. ఇంకా చల్ల మిర్చీ, బటర్ మిల్కులు ఏంటండీ! అనుకుంటున్నారా? ఇండియాలో వర్షాలు పడుతున్నాయి. బల్గేరియాలో మాత్రం ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎవ్రీడే మినిమమ్ 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటోందట! అంత ఎండలో ‘ధృవ నక్షత్రం’ టీమ్ షూటింగ్ చేస్తోంది.
విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిన్మా కోసం ప్రస్తుతం బల్గేరియాలో స్టంట్ సీక్వెన్స్, ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కట్ చెప్పగానే... బటర్‌మిల్క్ బకెట్ల దగ్గరకు చేరుతున్నారంతా. ఓ గ్లాసు బల్గేరియన్ బటర్‌మిల్క్ తాగి సేద తీరుతున్నారు. ఇందులో తెలుగమ్మాయి రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్‌కుమార్, సిమ్రన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.