మరోసారి మాయ చేస్తారా..? | Gautham Menon Planning For Ye Maya Chesave Sequel | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 6 2018 2:11 PM | Last Updated on Wed, Jun 6 2018 2:11 PM

Gautham Menon Planning For Ye Maya Chesave Sequel - Sakshi

ఏ మాయ చేసావే సినిమాలో నాగచైతన్య, సమంత

నాగచైతన్య కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్‌ హిట్ సినిమా ఏ మాయ చేసావే. తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలో ఘనవిజయం సాధించింది. తెలుగులో నాగచైతన్య, సమంతలు హీరో హీరోయిన్లుగా నటించగా.. కోలీవుడ్‌లో శింబు, త్రిషలు జంటగా నటించారు. రెండు భాషల్లోనూ సూపర్‌ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొదించేందుకు దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు.

తాజాగా శింబు విన్నైతాండీ వరువైన్‌ (ఏ మాయ చేసావే తమిళ టైటిల్‌)కు సీక్వెల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు. మరోసారి శింబు, గౌతమ్‌ మీనన్‌, ఏఆర్‌ రెహమాన్‌ లు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములౌతున్నట్టుగా అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో ఏ మాయ చేసావే సీక్వెల్‌ మరోసారి తెర మీదకు వచ్చింది. తొలి భాగం తెరకెక్కించినట్టుగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తారా..? మరోసారి కార్తీక్‌ పాత్రలో నటించేందుకు చైతూ అంగీకరిస్తాడా..? తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రేమికులుగా నటించిన చైతూ, సమంతలు తరువాత నిజజీవితంలోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు మరోసారి మాయ చేసేందుకు రెడీ అవుతారా.. లేదా? తెలియాలంటే అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement