![Naga Chaitanya Shares First Pic With Samantha After Divorce About Ye Maaya Chesave - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/02/26/Naga.jpg.webp?itok=UG02UKol)
సమంత-నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే జెస్సీగా అలరించి కుర్రాళ్ల మనసు దోచుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గానూ క్రేజ్ సంపాదించుకుంది. నాగ చైతన్య అంతకుముందే జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా ఏమాయ చేశావే సినిమాతోనే తొలి హిట్ అందుకున్నాడు.
తెరపైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ చై-సామ్‌ల జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.
నాగచైతన్యతో విడాకుల తర్వాత అతనితో దిగిన ఫోటోలన్నింటిని సామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అటు చై కూడా విడాకుల తర్వాత సామ్‌కు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయలేదు.
అయితే తాజాగా ఏమాయ చేశావే సినిమా వచ్చి నేటితో 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ మూవీలో సమంతతో దిగిన ఓ ఫోటోను నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సెలబ్రేటింగ్ 13ఇయర్స్ అంటూ పోస్ట్ చేశాడు. సమంత కూడా ఏమాయ చేశావేకు పదమూడేళ్లు అంటూ పలు ఫోటోలను షేర్ చేసినా అందులో కేవలం తన ఫోటోలు మాత్రమే నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి ఇన్‌స్టా పోస్టులు ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
❤️🫠#Yemaayachesave pic.twitter.com/9UL9j1528c
— Movie Muthyam (@MovieMuthyam) July 22, 2022
Comments
Please login to add a commentAdd a comment