Samantha Emotional Post On Her 12 Years Career: 'ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తి కావొస్తుంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం విడుదలైన నేటికి 12ఏళ్లు. ఈ సందర్భంగా తన సినీ జర్నీని తెలియజేస్తూ సామ్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. 'చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటికి 12 సంవత్సరాలు. చదవండి: 'ప్రాణహాని ఉంది.. నా ప్రైవసీని అతిక్రమించారు' సమంత పోస్ట్ వైరల్
లైట్స్, కెమెరా, యాక్షన్.. వీటి చుట్టూ నాకున్న మధుర ఙ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా' అంటూ సమంత పేర్కొంది. కాగా ఈ సినిమాతోనే సమంత-నాగ చైతన్య తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా గురించి సమంత పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్: 24 గంటలు, 84 రోజులు, 17మంది కంటెస్టెంట్లు
Comments
Please login to add a commentAdd a comment