
‘విన్నైత్తాండి వరువాయా, అచ్చమ్ ఎన్‌బదు మడమయడా’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ గౌతమ్ మీనన్, శింబులది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సినిమాల్లోని పాటలు ఎంత మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయో తెలిసిందే. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్, హీరో శింబు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందట.
మొదటి రెండు సినిమాలు లవ్ స్టోరీ, యాక్షన్ ఎంటర్‌టైనర్స్ కాగా మూడోది మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని సమాచారం. ఈ చిత్రానికి కూడా ఎఆర్ రెహమానే స్వరకర్త. ‘విన్నైత్తాండి వరువాయా, అచ్చమ్ ఎన్‌బదు మడమయడా’లను తెలుగులో నాగచైతన్యతో ‘ఏ మాయ చేశావె, సాహశం శ్వాసగా సాగిపో’గా తెరకెక్కించారు గౌతమ్. మరి.. తాజా సినిమాను తెలుగులో తీస్తారా? అందులో నాగ చైతన్య కనిపిస్తారా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment