సినిమాటోగ్రాఫర్, దర్శకుడు తంగర్ బచ్చాన్ లేటెస్ట్ గా తీసిన సినిమా 'కరుమేఘంగళ్ కలైగిండ్రన'. దర్శకుడు భారతీరాజా లీడ్ రోల్ పోషించిన ఇందులో దర్శకుడు గౌతమ్‌మీనన్, ఎస్‌ఏ.చంద్రశేఖర్, ఆర్‌వీ.ఉదయకుమార్, యోగిబాబు, అదితిబాలన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జీ.వీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా బుధవారం ఉదయం చిత్ర యూని ట్ చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
(ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!)
ఈ కార్యక్రమంలో దర్శ కుడు తంగర్‌బచ్చాన్ మాట్లాడుతూ.. ఇది చిత్రం కాదనీ, జీవితం అనీ పేర్కొన్నారు. ఇందులో న్యాయవాది రామనాథ్ పాత్రను భారతీతాజా కాకుండా వేరెవరూ నటించలేరని అన్నారు. 30 ఏళ్ల క్రితం రాసుకున్న నవలే ఈ చిత్రమని తెలిపారు. ఇటీవల వస్తున్న కొన్ని కమర్షియల్ చిత్రాలను ప్రేక్షకుల ఎందుకు ఆదరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తుపాకులతో కాల్చుకోవడం, చంపుకోవడం వంటి చిత్రాలతో భవిష్యత్ తరాలకు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకోవాలన్నారు.
మంచి కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లేదని తంగర్ బచ్చాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరుమేఘంగళ్ కలైగిండ్రన వంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయనీ, చిత్ర పరిశ్రమ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని భారతీరాజా పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment