bharathi raja
-
విజయ్ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్
విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యతో తమిళ చిత్రసీమ తీవ్రమైన శోకంలో ఉంది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అంతకుముందే నటుడు మరిముత్తు మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాంటి సమయాల్లో వార్తాపత్రికలతో పాటు పలు యూట్యూబ్ చానెళ్ల కార్యకలాపాలు పలు వివాదాలకు కారణమయ్యాయి. దీంతో ప్రముఖుల మృతి ఘటనల్లో మీడియాను అనుమతించబోమని సంచలన నిర్ణయాన్ని కోలీవుడ్ తీసుకుంది. అసలు కారణం ఏంటి..? కోలీవుడ్‌లో ఈ మధ్యే జైలర్ నటుడు మరిముత్తు గుండెపోటుతో మరణించారు. ఆ విషాదం మరిచిపోకముందే విజయ్ ఆంటోనీ కుమార్తె మరణించడంతో ఇండస్ట్రీతో పాటు పలువురిని కలచివేసింది. ఈ నేపథ్యంలో వారికి నివాళిలు పలువరు ప్రముఖులు అర్పించారు. ఆ సమయంలో తమిళ ప్రముఖ మీడియా ఛానల్స్‌తో పాటు యూట్యూబ్ సిబ్బంది వ్యవహరించిన తీరు తమిళనాట చర్చనీయాంశం అయింది. నివాళులర్పించేందుకు వచ్చే సెలబ్రిటీలతో పోటీపడి మైక్‌లు పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలకు తప్పుడు తంబ్‌నైల్స్ పెట్టి వ్యూవ్స్ కోసం పలు యూట్యూబ్ ఛానెల్‌లు పోటీపడ్డాయి. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు) అంతేకాకుండా అంత్యక్రియల సమయంలో శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పలు ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెరపైకి వచ్చింది. మీడియా, యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఇలాంటి కార్యకలాపాలపై సినీ పరిశ్రమ నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ నటులు వివేక్, మైలస్వామి, మనోబాల మృతి ఘటనల్లో కూడా మీడియా ఇలాగే ప్రవర్తించిదని వారు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల మృతికి సంబంధించిన సంఘటనలకు మీడియాను అనుమతించబోమని నిర్మాతల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా ప్రకటన చేశారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే సమాజంలో ఈ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని ఆయన కోరారు. ఒక వ్యక్తి చనిపోతే ఎక్కువ నష్టం బాధిత కుటుంబానికే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీడియా వారికి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల అనుమతి ఉన్నా కూడా చనిపోయిన వారి ఇంటి వద్దకు ఎలాంటి మీడియా వారికి అనుమతి ఉండదని ఆయన ప్రకటించారు. -
ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దాదాపు 30 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైన హీరో కన్నుమూశారు. షూటింగ్లో జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన తమిళ హీరో బాబు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన 1990లో వచ్చిన 'ఎన్ ఉయిర్ తోజన్' అనే సినిమాతో అరంగేట్రం చేశారు. కాగా, ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆయన మరణం పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాబు సినీ ప్రస్థానం! 1990ల్లో 'ఎన్ ఉయిర్ తోజన్' అనే సినిమాతో అరంగేట్రం తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత 'పెరుంపుల్లి', 'తాయమ్మ', 'పొన్నుకు చేతి వందచు' చిత్రాల్లో హీరోగా నటించారు. పల్లెటూరి కథలు తనకు బాగా వర్కవుట్ అవుతాయని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్న తరుణంలో తన ఐదవ చిత్రం ‘మనసారా పరిహితంగానే’ చిత్రంలో నటించారు. ఆ సినిమానే బాబు జీవితాన్ని ఒక్కసారిగా మలుపుతిప్పింది. షూటింగ్ సమయంలోనే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఫైట్ సీన్ వల్లే! ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఓ ఫైట్ సీన్ చిత్రీకరించారు. సన్నివేశంలో హీరో నేలపై నుంచి దూకాలి. నిజంగానే జంపింగ్ చేస్తానని బాబు చెప్పడంతో యూనిట్ అందుకు అంగీకరించలేదు. డూప్ పెట్టుకోవచ్చు కదా అని దర్శకుడు చెప్పినా వినకుండా రియలిస్టిక్‌గా ఉంటుందని.. అంటూ బాబు నిజంగానే జంప్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా బాబు ప్రమాదవశాత్తు మరో చోట పడిపోవడంతో వీపుపై బలంగా తగిలి ఎముకలు విరిగిపోయాయి. వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ బాబు నిటారుగా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. అతని కుటుంబం చాలా మంది వైద్యులను సంప్రదించి చికిత్స అందించింది. కానీ అవేమీ పని చేయలేదు. భారతీరాజా సంతాపం సెట్లో జరిగిన ప్రమాదంలో గాయపడి 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన బాబు మరణించాడనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అంటూ సంతాపం ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే దర్శకుడు భారతీరాజా బాబును స్వయంగా సందర్శించి వెళ్లిపోయారు. అయితే ఆ షూటింగ్ సమయంలో బాబు దెబ్బలు తిన్న తర్వాత మరో హీరోతో ‘మనసారా పరిహితంగానే’ సినిమా తీసినట్లు తెలుస్తోంది. బలమైన కోరికతో సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి జీవితాన్ని ఫైట్ సీన్ ముగించింది. బాబుకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఎంజీఆర్, జయలలిత కాలంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా స్పీకర్‌గా అనేక పదవులను నిర్వహించిన కె. రాజారాం అతని మామ అవుతారు. -
ఇది సినిమా కాదు జీవితం: డైరెక్టర్ తంగర్ బచ్చాన్
సినిమాటోగ్రాఫర్, దర్శకుడు తంగర్ బచ్చాన్ లేటెస్ట్ గా తీసిన సినిమా 'కరుమేఘంగళ్ కలైగిండ్రన'. దర్శకుడు భారతీరాజా లీడ్ రోల్ పోషించిన ఇందులో దర్శకుడు గౌతమ్‌మీనన్, ఎస్ఏ.చంద్రశేఖర్, ఆర్వీ.ఉదయకుమార్, యోగిబాబు, అదితిబాలన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జీ.వీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా బుధవారం ఉదయం చిత్ర యూని ట్ చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. (ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!) ఈ కార్యక్రమంలో దర్శ కుడు తంగర్బచ్చాన్ మాట్లాడుతూ.. ఇది చిత్రం కాదనీ, జీవితం అనీ పేర్కొన్నారు. ఇందులో న్యాయవాది రామనాథ్ పాత్రను భారతీతాజా కాకుండా వేరెవరూ నటించలేరని అన్నారు. 30 ఏళ్ల క్రితం రాసుకున్న నవలే ఈ చిత్రమని తెలిపారు. ఇటీవల వస్తున్న కొన్ని కమర్షియల్ చిత్రాలను ప్రేక్షకుల ఎందుకు ఆదరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తుపాకులతో కాల్చుకోవడం, చంపుకోవడం వంటి చిత్రాలతో భవిష్యత్ తరాలకు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకోవాలన్నారు. మంచి కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లేదని తంగర్ బచ్చాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరుమేఘంగళ్ కలైగిండ్రన వంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయనీ, చిత్ర పరిశ్రమ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని భారతీరాజా పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ) -
థియేటర్లకు అనుమతివ్వండి .. సీఎంకు భారతీరాజా విజ్ఞప్తి
సాక్షి, చెన్నై: థియేటర్లకు అనుమతివ్వాలని సీనియర్ దర్శకుడు, తమిళనాడు యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు రాజా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. అన్‌లాక్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి సినీ, బుల్లితెర సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతించింది. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళీ, భారతీరాజా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ‘మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. తమిళ భాషాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు షూటింగులకు అనుమతించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. తదుపరి సడలింపులో సినిమా థియేటర్లకు అనుమతిస్తారని ఆశిస్తున్నా’మని భారతీరాజా పేర్కొన్నారు. చదవండి: విజయ్ పోస్టర్లతో మరోసారి కలకలం నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు -
సినీ పరిశ్రమలో మరో విషాదం..
సాక్షి, చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నన్(69) శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు భీమ్ సింగ్ కుమారుడైన కన్నన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అయన ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దిగ్గజ దర్శకుడు భారతీరాజాతో కలిసి దాదాపు 40 సినిమాలకు పనిచేశారు. దీంతో కన్నన్ను భారతీరాజా రెండు కళ్లు అని పిలుస్తుండేవారు. వీరద్దరి కాంబినేషనలో వచ్చిన మొదటి చిత్రం నిజల్గళ్ కాగా, చివరి చిత్రం బొమ్మలాట్టమ్. ఇక తెలుగులో పగడాల పడవ, కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన చిత్రాలకు పనిచేసిన కన్నన్ తన కెమెరా పనితనం చూపించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కన్నన్ పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. రేపు(ఆదివారం) అంత్యక్రియలు నిర్వహిస్తామని కన్నన్ సన్నిహితులు తెలిపారు. -
అధ్యక్ష పదవికి భారతీ రాజా రాజీనామా
సాక్షి, చెన్నై: దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి సీనియర్ దర్శకుడు భారతీరాజా రాజీనామా చేశారు. ఇందుకు తగ్గ ప్రకటనను సోమవారం ఆయన చేశారు. దర్శకుల సంఘానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. గత నెల ఈ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ సమయంలో అధ్యక్ష పదవికి భారతీరాజా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆయన్ను అందరూ ముక్తకంఠంతో అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. మిగిలిన పదవులకు ఈనెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ద్వారా ఎదురయ్యే సమస్యలను తాను బాగానే గుర్తెరిగి ఉన్నట్టు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొంటూ భారతీరాజా ఓ ప్రకటన చేశారు. ఈ దృష్ట్యా, తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈనెల 14న ఇతర పదవులకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, అధ్యక్ష పదవికి అదే రోజున ఎన్నికలు జరిగేనా లేదా, ఈ పదవి కోసం మరోమారు ఎన్నికల ప్రక్రియ సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. -
విశాల్ పందికొక్కు లాంటి వాడంటూ..
సాక్షి,చెన్నై : సీనియర్ దర్శక దిగ్గజం భారతీరాజా నటుడు విశాల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగటం సంచలనం సృష్టింస్తుంది. నిర్మాతల మండలిలో అధ్యక్షుడిగా విశాల్ వంటి పందికొక్కు దూరిందని, దాన్ని తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. మండలిలో మొలిచిన కలుపు మొక్కను పీకేయాల్సిన బాద్యత మనందరిపై ఉందన్నారు. నిర్మాతల మండలిలో చేరిన చీడపురుగులను తొలగించాలని బాద్యత మనందరిపై ఉందన్నారు. నడిగర్ సంఘం తమిళేతరుల చేతిలో నడుస్తుండటం బాధగా ఉందన్నారు. నడిగర్ సంఘానికి జరిగే ఎన్నికల్లో బాగ్యరాజా టీమ్ ను గెలిపించుకోవటం ద్వారానే తమిళ నటుల ఉనికిని కాపాడుకునే అవకాశం ఉందన్నారు. బాగ్యరాజ్ గెలవగానే దక్షిణాది నటీనటుల సంఘాన్ని తమిళ నటుల సంఘంగా మార్చాలని, నడిగర్ సంఘానికి తమిళనటుల సంఘంగా మార్చటమే తన ద్యేయమని బారతీరాజా వ్యాఖ్యనించటం ఇప్పుడు తమిళ చిత్రసీమలో కలకలం సృష్టిస్తుంది. తమిళ నిర్మాతల మండలి అద్యక్షుడిగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా విశాల్ ఉండగా ఆయన్ను టార్గెట్ చేస్తూ బారతీరాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. -
దర్శకుల సంఘం అధ్యక్షుడిగా భారతీరాజా
పెరంబూరు: తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ దర్శకుడు భారతీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సినీ దర్శకుల కోసం తమిళ దర్శకుల సంఘంను నెలకొల్పిన విషయం తెలిసందే. ఈ సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా దర్శకుడు విక్రమన్, కార్యదర్శిగా ఆర్కే.సెల్వమణి, కోశాధికారిగా పేరరసు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా వీరి కాల పరిమితి పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఈ సంఘ కార్యవర్గ సమావేశాన్ని సోమవారం స్థానిక వడపళిలోని ఒక ప్రైవేట్ సినీ థియేటర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు విక్రమన్ ఆరు సార్లు అధ్యక్ష పదవిలో కొనసాగడంతో ఈ సారి తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. దీంతో ఈ పదవికి సీనియర్ దర్శకుడు భారతీరాజాను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇక మిగిలిని పదవులకు త్వరలోనే ఎన్నికలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
పాఠ్యాంశంగా శివాజీ గణేషన్ చరిత్ర
పెరంబూరు: రాష్ట్రప్రభుత్వానికి ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో ప్రపంచంలోనే గొప్పనటుడు, అర్థవంతమైన భావోద్రేకాలను, చక్కని తమిళభాష ఉచ్ఛరణతో నట చక్రవర్తిగా కీర్తీంచబడిన దివంగత నటుడు శివాజీగణేశన్. ఆయన గురించి మలయాళ రచయిత బాలచందర్ కల్లిక్కాట్టు తాను కలిసిన ప్రముఖుల అనుభవాలతో చిదంబర నినైవుగళ్ పేరుతో నవలను రాశారు. అందులో మహానట మేధావి శివాజీగణేశన్ నటనా ప్రతిభ, ఆయన కళానుభావాలు, ఆయన పొందిన అవార్డులు వంటి పలు వివరాలను పొందుపరిచారు. ఆ వివరాలను రాష్ట్రప్రభుత్వం విద్యావేత్తలతో కొత్తగా రాయించి ప్లస్‌టూ తరగతి పాఠ్యపుస్తకంలో శివాజీగణేశన్‌కు కీర్తీని ఆపాదించే విధంగా పాఠంగా చేర్చారు. శివాజీగణేశన్ గురించి ఈ తరం విద్యార్థులు తెలుసుకునే విధంగా చేసినందుకు రాష్ట్రప్రభుత్వానికి ఒక సీనియర్ కళాకారుడిగా చిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని పేర్కొన్నారు. -
విశాల్‌తో ఢీకి భారతీరాజా రెడీ
తమిళ నిర్మాతలమండలి ఎన్నికల్లో సీనియర్ దర్శకుడు భారతీరాజా, ప్రస్తుతం మండలి అధ్యక్షుడు విశాల్‌ను ఢీ కొనడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. విశాల్‌పై ఇటీవల ఆయన వ్యతిరేక వర్గం పలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిందే. అదేవిధంగా గత 18వ తేదీన విశాల్ వ్యతిరేక వర్గం మండలి కార్యాలయానికి తాళం వేసి చేసిన రచ్చ గురించి తెలిసిందే. విశాల్ మండలి అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, వెంటనే మళ్లీ మండలి ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో పాటు ఆయనపై పలు ఆరోపణల చిట్టాతో భారతీరాజా నేతృత్వంలో వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు విశాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసే వరకూ పరిస్థితులను తీసుకొచ్చారు. మార్చిలోనే ఎన్నికలు మూడు ఏళ్లకొకసారి జరిగే నిర్మాతల మండలి ఎన్నికలు 2019 మార్చిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు నటుడు విశాల్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గానికి నేతృత్వం వహిస్తున్న దర్శకుడు భారతీరాజానే అధ్యక్ష పదవికి పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చిన విశాల్ వ్యతిరేక వర్గం ఆ ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలెట్టింది. అంతే కాదు పోటీ చేయాలని భారతీరాజాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. విశాల్‌తో ఢీ కొనడానికి భారతీరాజా సిద్ధంగానే ఉన్నట్లు, అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో నిర్మాతలు కొన్ని వర్గాలుగా విడిపోయినట్లు వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొస్తే తాను విశాల్‌ను ఢీకొంటానని భారతీరాజా చెప్పినట్లు, ఆయన అనుకూల వర్గానికి చెందిన ఒకరు చెప్పారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఒక తమిళుడు ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికలే చాలా రసవత్తరంగాజరిగాయి. ఆ పోటీలో అందరి ఊహలను తలకిందులు చేస్తూ విశాల్ జట్టు విజయం సాధించింది.ఈ సారి కూడా గట్టి పోటీ నెలకొననుందన్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా మూడు నెలలు ఉందిగా! -
శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకుడు ఫైర్
పెరంబూరు: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అంటూ పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన నటి శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌పై పడ్డారు. ఇక్కడ ప్రముఖ దర్శకుడు ఎఆర్.మురుగదాస్, సుందర్.సి, నటుడు శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్) వంటి వారు అవకాశాల కోసం ఆశ చూపి తనను వాడుకున్నారంటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. కాగా శ్రీరెడ్డి చర్యలకు కోలీవుడ్‌లో పలువురు ధ్వజమెత్తుతున్నారు. నటుడు వారాహి ఆమెపై చెన్నై కమిషనర్ కార్యలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందిస్తూ.. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని పేర్కొన్నారు. అలాంటిది ఆమె వాటితో ప్రచారం పొందాలనుకోవడం సరైన పద్ధతి కాదని ధ్వజమెత్తారు. శ్రీరెడ్డి సినిమా వారినందరినీ తప్పుపట్టడం సరికాదని భారతీరాజా సూచించారు. -
విశాల్‌పై తిరుగుబాటు
పెరంబూరు: నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్‌పై ఆయన వ్యతిరేక వర్గం మరోసారి ధ్వజమెత్తారు. దక్షిణ భాతర నటీనటుల సంఘం ఎన్నికలు, నిర్మాతల మండలి ఎన్నికల ముందే విశాల్ తమిళేతరుడని ఆరోపణలు గుప్పించారు. అయినా ఈ రెండు సంఘాల ఎన్నికల్లోనూ విశాల్ విజయదుందుభి మోగించారు. వచ్చే ఎన్నికల్లోనూ విశాల్ వర్గం పోటీకి సిద్ధం అని ఇప్పటికే వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ వ్యతిరేక వర్గం అనూహ్యంగా ఆయనపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ వివరాలు చూద్దాం. దర్శకుడు భారతీరాజా, టీ.రాజేందర్, నటుడు రాధారవి, జేకే.రితీశ్ ఆదివారం విలేకరుల సమావేశంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ వెంటనే ఆ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిని, తమిళ సినీ వాణిజ్య మండలిగానూ, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘాన్ని తమిళ సినీ నటీనటుల సంఘంగానూ మార్చాలని ఒత్తిడి చేస్తూ స్థానిక టీ.నగర్‌లోని ఆంధ్రాక్లబ్‌లో దర్శకుడు భారతీరాజ నేతృత్వంలో సమావేశమయ్యారు. విశాల్ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలి సమావేశం అనంతరం ఈ బృందం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నిర్మాతల మండలి అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. సీనియర్లు తప్పుకోవడంతో ఎవరెవరో వచ్చి తమిళ నిర్మాతల మండలిని ఏలుతున్నారని విమర్శించారు. నిర్మాతల మండలి అధ్యక్ష పదవి కోసమే ఒకరు ఉన్నారని, మండలి అధ్యక్షుడిగా విశాల్ చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకుంటానని ఎన్నికల ముందు చెప్పిన ఆయన ఇప్పటికీ వైదొలగకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల 48రోజుల పాటు సమ్మెను ఎందుకు నిర్వహించారన్నది తెలియలేదన్నారు. నిర్మాతల సంఘం సర్వసభ్య సమావేశంలో తమిళతాయ్ గీతం సమయంలో అందరూ నిలబడి మర్యాద ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. ఆ సమావేశంలో సంఘ నిధి రూ.7 కోట్లకు సంబంధిచిన వివరాలను అడిగినప్పుడు విశాల్ ఎందుకు బదులు చెప్పలేదని ప్రశ్నించారు. తమిళ నిర్మాతల మండలిలో తమిళులే కార్య నిర్వాహకులుగా ఉండాలన్నారు. తమిళ సినిమాలో తమిళులే అధిక పెట్టుబడులు పెడుతున్నారని, అయినా ఇతరుల వద్ద బిచ్చమెత్తుకోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే తమిళులంతా ఏకం కావాలన్నారు. పలు సమస్యలు విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా బాధ్యతులు చేపట్టిన తరువాత పరిశ్రమలో పలు సమస్యలు నెలకొన్నాయన్నారు. ఒక చిత్రాన్ని అత్యధికంగా తమిళనాడులో 200ల థియేటర్లలో విడుదల చేయవచ్చునని విశాల్ చెప్పారని అలాంటిది ఆయన నటించిన ఇరుంబుతిరై చిత్రాన్ని 300 థియేటర్లలో ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. నిబందనలకు విరుద్ధంగా విశాల్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తమిళ్ రాకర్స్ వెబ్సైట్ నిర్వాహకులు పట్టుపడ్డారని చెప్పిన విశాల్ ఇçప్పటి వరకూ వారి గురించిన వివరాలను వెల్లడించకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. కావున ఆయన మండలి అధ్యక్ష పదవి నుంచి వెంటనే వైదొలగాలని, మళ్లీ మండలి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలాన్నే సృష్టిప్తోంది. -
నిజానికి అతనికేమీ తెలియదు పాపం..
తమిళసినిమా: దర్శకుడు భారతీరాజా సందర్భం వచ్చినప్పుడల్లా రజనీకాంత్‌పై విరుచుకు పడుతున్నారు. ఆ మధ్య కన్నడిగుడైన రజనీకాంత్‌ను తమిళ సినిమాలో ఆదరించాం కానీ, రాష్ట్రాన్ని ఏలతానంటే ఒప్పుకునేది లేదని ధ్వజమెత్తారు. తాజాగా మరోసారి రజనీపై దండెత్తారు. ఇంతకు ముందు మధురై సంభవం, తొప్పి, శివప్పు ఎనక్కు పిడిక్కుమ్ చిత్రాలను తెరకెక్కించిన యురేకా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కాట్టు ప్పయ సార్ ఇంద కాళీ. నటుడు జయంత్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజస్థాన్‌కు చెందిన ఐరా కథానాయకిగా పరిచయం అవుతోంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ సోమవారం ఉదయం వడపళనిలోని కమలా థియేటర్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ తమిళ మట్టి, సంస్కృ తి, సంప్రదాయాలు తనకు తల్లితో సమానం అన్నారు. వాటికి చెడు కలుగుతుంటే చూస్తూ ఊరుకోనని అన్నారు. కొన్ని చిత్రాల పేర్లతో తాను ఏకీభవించలేనని, కాట్టు ప్పయ సార్ ఇంద కాళీ కూడా అలానే ఉందన్నారు. ఇలాంటి టైటిల్స్‌తో నటులను మనమే పైకి ఎత్తేస్తున్నామన్నారు. మనం రాసిన సంభాషణలు చెప్పి, పాటల్లో ఆడి రేపు రాష్ట్రాన్ని ఏలతామని బయలుదేరతారన్నారు. ఇలానే అతను రెడీ అయ్యాడు. నిజానికి అతనికేమీ తెలియదు పాపం అని (రజనీకాంత్‌నుద్దేశించి) విమర్శించారు. అభిమానులను మోసం చేస్తున్నారని, కటౌట్లకు పాలాభిషేకాలు చేసే వారిని అప్పుడే నిలువరించాల్సిందని,ఇదంతా మనం చేస్తున్న తప్పు అని వ్యాఖ్యానించారు. చిత్ర దర్శకుడు యురేకా ఇంతకు ముందు చేసిన చిత్రాలను చూశానని, సినీరంగానికి వచ్చామా, వెళ్లామా అన్నట్టు కాకుండా సమాజానికి ఏమైనా చెప్పాలన్న తపన ఉన్న దర్శకుడు యురేకా అని భారతీరాజా పేర్కొన్నారు. -
‘రజనీ ఆలోచనలు ప్రమాదకరం’
తమిళ సినిమా : రజనీకాంత్ ప్రమాదకరమైన ఆలోచనపరుడని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ధ్వజమెత్తారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం జరుగుతున్న తమిళుల పోరాటం సినీ రంగంలోనూ సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్‌పై పలువురు సినీ ప్రముఖులు మాటల దాడి చేస్తున్నారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం సినీ దర్శకుడు కే.భారతీరాజా నేతృత్వంలో తమిళగ కళై ఇళక్కియ పన్బాటు పేరవై అనే సంఘాన్ని నెలకొల్సి పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఆందోళన కార్యక్రమంలో ఒక పోలీస్ దాడికి గురయ్యారు. ఈ సంఘటనపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రజనీ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా వర్గం మండిపడుతోంది. ఇదే విషయంపై నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ కావేరి మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం తాము శాంతియుత పోరాటం చేస్తున్నామన్నా రు. ఈ పోరాటంలో ఒక పోలీస్‌ను బాధించటం బాధాకరమేనన్నారు. అయితే ఈ అంశంపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొనే ముందు పోరాటంలో ఏం జరిగిందన్నది తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. పోరాటంలో పాల్గొన్న దర్శకుడు భారతీరాజా, గీతరచయిత వైరముత్తు వంటి వారు ఆయన స్నేహితులేనని, వారిని అడిగి తెలుచుకోవచ్చుగా అని ప్రశ్నించారు. జల్లికట్టు పోరాటంలో జరిగిన దాడి గురించి రజనీ స్పందించలేదని, ఒక పోలీసు ఎత్తిపడేయడంతో మహిళ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన గురించి ఆయన స్పందించలేదన్నారు. అలాంటిది కావేరి మేనేజ్మెంట్ బోర్డు కోసం జరుగుతున్న పోరాటంతో గాయాలపాలైన పోలీస్ విషయంలో హింసకు పరాకాష్ట అని పేర్కొన్న రజనీకాంత్ ఆలోచనలు ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇటీవల అత్యాచారం కారణంగా బలైన చిన్నారి ఆసిఫా ఉదంతంపై కూడా రజనీ స్పందించలేదన్నారు. అలాంటి రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. తమిళనాడును తమిళుడే పాలించాలన్నది తమ లక్ష్యమని సీమాన్ పేర్కొన్నారు. -
‘సినీ కార్మికులు కష్టాన్ని చూస్తూ ఊరుకోం’
తమిళ సినిమా : చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు రోజుల్లో సమగ్ర చర్చా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర సమాచార, ప్రచార శాఖామంత్రి కడంబూర్ రాజు వెల్లడించారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, నిర్మాతలమండలి, థియేటర్ల యాజమాన్యానికి మధ్య నెలకొన్న సమస్యలపై పలు దపాలు జరిగిన చర్యలు విఫలం కావడంతో నిర్మాతల మండలి మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపివేయడంతో పాటు, మార్చి 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు, అన్ని సినిమా కార్యక్రమాలను నిలిపివేసి సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో లక్షలాది సినీ కార్మికులు పని లేక ఆర్థిక ఇబ్బందులను చవిచూస్తున్న పరిస్థితి. నిర్మాతల మండలి, థియేటర్ల సంఘం. క్యూబ్ సంస్థల అధినేతలు ఎవరికి వారు పట్టు విడవకుండా పంతాలకు పోవడం ఈ క్లిష్ట పరిస్థితికి కారణం. ప్రస్తుతం నెల కొన్న సమస్యను ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ బుధవారం సాయంత్రం రాష్ట్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి కడంబూర్ రాజు కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రి కడంబూర్ రాజు సినీ సంఘాల నిర్వాహకులతో రెండు రోజుల్లో సమగ్ర చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లక్షలాది మంది సినీ కార్మికులు భృతిని కోల్పోవడాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల చార్జీలు తగ్గించడం, థియేటర్ల టికెట్ ధర, ఆన్లైన్ బుకింగ్, పార్కింగ్ చార్జీలు, తినుబండారాల ధరల నియంత్రణ వంటి విషయాలపై మంత్రి కడంబూర్ రాజుకు వివరించానన్నారు. అన్ని సమస్యలౖను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. భారతీరాజా హెచ్చరిక : దర్శకుడు భారతీరాజ్ ఐపీఎల్ క్రికెట్ పోటీలపై ధ్వజమెత్తారు. రాష్ట్రం ఒక పక్క కావేరి బోర్డు వంటి సమస్యలతో పోరుబాట పడుతుంటే ఐపీఎల్ క్రికెట్ పోటీలను నిర్వహించడం సబబు కాదన్నారు. ఈ పోటీలను నిర్వహించొద్దని తాము చెప్పడం లేదని, రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం లభించిన తరువాత జరుపుకోవాలని అన్నారు. లేని పక్షంలో జల్లికట్టు పోరు తీరులో తమిళుల ఆగ్రహాన్ని చవిచూస్తారని హెచ్చరించారు. -
రజనీ, కమల్‌లకు తమిళ చరిత్ర తెలియదు
తమిళసినిమా: నటులు రజనీకాంత్, కమలహాసన్‌లకు తమిళనాడు చరిత్ర తెలియదని సీనియర్ దర్శకుడు భారతీరాజా వ్యాఖ్యానించారు. ఆయన «మధురైలో సోమవారం జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికపై భారతీరాజా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ, నటులు రజనీకాంత్, కమలహాసన్‌లపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో, ఐసీయూలో ఉందన్నారు. రాష్ట్రంలో ఐక్యత కరువవ్వడంతో విభజన దారులు చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తమిళులందరూ భేషజాలు విడిచి సంఘటితంగా నిలిస్తే తమిళనాడును ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న ఏడుగురిని విడుదల చేయాలని శాసనసభతో అప్పటి ముఖ్యమంత్రి తీర్మానం చేశారని, ఆమె బాటలో పయనిస్తున్నామని చెప్పుకుంటున్న ఈపీఎస్, ఓపీఎస్లు వారిని విడుదల చేస్తేనే తాను వారితో కలిసి పనిచేయడానికి సిద్ధం అన్నారు. ఈపీఎస్, ఓపీఎస్లు ఫ్యూజు లేని బల్పులని, వారు బీజీపీ బల్బు వెలుతురు కింద నిలబడటంతో వెలుగుతున్నట్లు కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. రజనీ, కమల్ తమిళనాట నేతలను బలపరచే విధంగా ఉండాలిగానీ, వారే అధినేతలు కావాలని ఆశ పడకూడదన్నారు. వారు తమిళులకు ఏం చేశారని నమ్మాలని ప్రశ్నించారు. వీరిద్దరికీ తమిళనాడు చరిత్ర తెలియదని విమర్శించారు. కటౌట్లకు పాలాభిషేకాలు చేసి చెడగొట్టిన రాష్ట్రాన్ని ఇకపై తమిళులందరం ఐక్యంగా కాపాడుకుందాం అని దర్శకుడు భారతీరాజా ప్రజలకు హితవు పలికారు. -
నలభై ఏళ్లలో రెండు సార్లు మాత్రమే మాట్లాడారు
చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజాపై తమిళ సూపర్‌స్టార్ రజినీ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తనను ఎప్పుడూ మంచి నటుడని చెప్పలేదని, తనతో రెండుసార్లుమాత్రమే మాట్లాడారని చెప్పారు. శనివారం ఆయన భారతీరాజా నెలకొల్పిన భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా (బీఐఐసీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. భారతీరాజా తనను ఎప్పుడు మంచి యాక్టర్‌నని చెప్పలేదని, ఓమంచి మనిషి అని మాత్రమే అనేవారని గుర్తు చేసుకున్నారు. నలబై ఏళ్ల తన నట జీవితంలో భారతీరాజా తనతో రెండుసార్లు మాత్రమే మాట్లాడారని సూపర్‌స్టార్ తెలిపారు. అందులో మొదట 16 వయధినిలె సినిమా కాల్షీట్ కోసం కాగా, రెండోది బీఐఐసీ ప్రారంభం కోసమని వివరించారు. సినిమా సెట్స్‌లో ఎలా ఉండాలో తన గురువైన కె.బాలచందర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఫిల్మ్స్కూల్లో విద్యార్థులు నటనకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశాలున్నాయని తెలిపారు. అనంతరం నిరాడంబరంగా ఉండే రజినీకాంత్ చిన్న నటుడిగా జీవితం ప్రారంభించి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని భారతీరాజా కొనియాడారు. -
భారతీరాజా చిత్రంలో విజయలక్ష్మి
తమిళ సినిమా : ప్రఖ్యాత దర్శకుడు భారతి రాజా చిత్రంలో నటి విజయ లక్ష్మి హీరోయిన్గా నటించనున్నారన్నది తాజా సమాచారం. ఎందరో హీరోయిన్లను పరిచయం చేసిన భారతీ రాజా తాను నిర్మించనున్న చిత్రంలో ఈ చెన్నై చిన్నదాన్ని ఎంపిక చేయడం విశేషం. చెన్నై - 28 చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన సుల్తాన్ ది వారియర్ చిత్రంలో నటించే అవకాశం కూడా విజయలక్ష్మిని వరించింది. అయితే ఆ చిత్రం పూర్తికాకపోవడం ఆమె బ్యాడ్ లక్ అనే చెప్పాలి. దీంతో తన తండ్రే విజయలక్ష్మికి బ్రేక్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఈ బ్యూటీ తండ్రి అగస్థ్యిన్. ఈయన ఇంతకు ముందు పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాదల్ కోట్టై చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. అగస్థ్యన్ చివరిగా 2008లో నెంజత్తైకిల్లాదే చిత్రం చేశారు. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు భారతీ రాజా నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో తన కూతురునే హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. హీరోగా కదైతిరైకదై వచనం ఇయక్కం చిత్రం ఫేమ్ సంతోష్ ప్రతాప్ నటించనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాత భారతీ రాజా కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనుండడం. చిత్ర కథ బాగా నచ్చడంతో నిర్మాణానికి ముందు కొచ్చినట్లు భారతీ రాజా వెల్లడించారు. అంతేకాదు హీరోయిన్ పాత్రకు విజయలక్ష్మినే పర్ఫెక్ట్ అంటున్నారు. ఇంకా టైటిల్ నిర్ణరుుంచని ఈ చిత్రంలో క్లాసికల్ ఎలిమెంట్స్‌తోపాటు లవ్, యాక్షన్ ట్విస్ట్ అంటూ జనరంజకమయిన అంశాలన్నీ ఉంటాయంటున్నారు దర్శకుడు అగస్థ్యిన్. -
సహజ సినిమాల 'భారతీ'య 'రాజా'
-
స్టార్లను ఆవిష్కరించిన స్టార్ డెరైక్టర్!
ఆయన ఏ సినిమా తీసినా అందులో హృదయాన్ని స్ప ృశించే కథనం ఉంటుంది. ఆ సినిమా రీమేక్ గానో, డబ్బింగ్గానో మరో భాష సినీ ప్రేమికులను పలకరిస్తుంటుంది. దాని ద్వారా పరిచయం అయ్యే నటీనటులు లేదా సాంకేతిక నిపుణులు తర్వాత సినీ పరిశ్రమకే వరంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా మూడు రకాలుగా గుర్తుండి పోతాయి ఆయన సినిమాలు. ఆయనే భారతీ రాజా... మద్రాస్ ప్రెసిడెన్సీలోని తేని ప్రాంతంలో ఉండే అల్లినగరంలో పుట్టిన చిన్నస్వామికి జింకలను వేటాడటం, సాహిత్యం చదవడం చాలా ఇష్టం. ఆ ఊరికి పక్కనే పెద్ద అడవి. అక్కడ అతడి వేట సాగేది. వేట... సరదాను తీరిస్తే, సాహిత్యం... సృజనాత్మకతను వెలికితీసింది. సినీదర్శకుణ్ణి చేసింది. చిన్నస్వామిగా అడవిలో జింకలను వేటాడిన అతడు... భారతీరాజాగా మారి సినీ పరిశ్రమలో అనేకమంది ప్రతిభావంతులను వేటాడి పట్టుకొన్నాడు. వారి ప్రతిభకు మరింత పదును పెట్టాడు. వారిని స్టార్స్‌ని చేసి తాను స్టార్ డెరైక్టర్ అయ్యాడు! నల్లమనుషులను, సముద్రంపై ఆధారపడి బతికే వారి యాస, భాషలను, పచ్చని ప్రకృతిని తెరపై చూపించే ప్రయత్నం చేశారు భారతీరాజా. అసలు సిసలు పల్లెలను తెరమీద ఆవిష్కరించాడు. అందుకే... దక్షిణాది సినిమా స్వరూపాన్ని మార్చేసిన దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారు భారతీరాజా. ‘పదునారు వయదునిలే’తో బాలనటి శ్రీదేవిని హీరోయిన్గా పరిచయం చేయడంతో బోణీ చేశారు భారతీరాజా. అది ఆయనకు కూడా తొలి సినిమానే. రెండో సినిమా ‘కిళక్కే పోగుమ్ రైల్’తో రాధికను తెరమీదికి తెచ్చారు. అదే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తెలుగు నటుడు సుధాకర్. రచయితగా, దర్శకుడిగా, హీరోగా ఒక వెలుగు వెలిగిన భాగ్యరాజా కూడా భారతీరాజా శిష్యుడే. భారతీరాజా దగ్గర అసి స్టెంట్గా పనిచేస్తూ, ఆయన సినిమాల్లో చిన్నచిన్న పాత్రలను చేస్తూ వచ్చిన భాగ్యరాజాను హీరోని చేశారు భారతీరాజా. ఆ సినిమాతోనే రతీ అగ్నిహోత్రి కూడా హీరోయిన్గా పరిచయం అయ్యింది. తమిళనటుడు, దర్శకుడు మణివణ్ణన్కి కూడా భారతీరాజాయే గురువు. ‘సీతాకోక చిలుక’ తమిళ వెర్షన్‌తో కార్తీక్, రాధల్ని హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఆ సినిమా తెలుగు రీమేక్‌తో కార్తీక్ తెలుగు వాళ్లకు పరిచయమైతే... ముచ్చర్ల అరుణ హీరోయిన్ అయ్యింది. ప్రసిద్ధ తమిళ గీత రచయిత వైరముత్తు కూడా భారతీరాజా కనిపెట్టిన కవే. ‘డాన్స్‌మాస్టర్’లో కమల్‌కి జోడీగా నటించిన రేఖ, ‘మంగమ్మగారి మనవడు’ తమిళ వెర్షన్ ‘మన్వాసనై’తో రేవతిలు హీరోయిన్లు అయ్యారు ఆయన చలువ వల్లే. ఆయన ‘నిళల్గల్’ సినిమాతో పరిచయం చేసిన రవి ఆ తరువాత నిళల్గల్ రవిగానే స్థిరపడిపోయారు. ఇంకా భానుప్రియ, సుకన్య, రంజిత, రియాసేన్, ప్రియమణి, కాజల్... వీళ్లందరి తొలి సినిమాల కెప్టెన్ కూడా భారతీరాజానే. ఇంతమంది గొప్ప నటీనటులను వెలికి తీయడం మామూలు విషయం కాదు. ఒక వ్యక్తిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను వెలికి తీయడమంటే మాటలూ కాదు. అది భారతీరాజాకు మాత్రమే సాధ్యమేమో! ఏకలవ్యులలా ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు వసంత బాలన్, బాల, శివకుమార్ వంటి తమిళ దర్శకులు. ఇంతమంది స్టార్లనూ, డెరైక్టర్లనూ ప్రభావితం చేసిన భారతీరాజాను స్టార్లను ఆవిష్కరించిన స్టార్ డెరైక్టర్ అనొచ్చు. - జీవన్