
పెరంబూరు: రాష్ట్రప్రభుత్వానికి ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో ప్రపంచంలోనే గొప్పనటుడు, అర్థవంతమైన భావోద్రేకాలను, చక్కని తమిళభాష ఉచ్ఛరణతో నట చక్రవర్తిగా కీర్తీంచబడిన దివంగత నటుడు శివాజీగణేశన్. ఆయన గురించి మలయాళ రచయిత బాలచందర్ కల్లిక్కాట్టు తాను కలిసిన ప్రముఖుల అనుభవాలతో చిదంబర నినైవుగళ్ పేరుతో నవలను రాశారు. అందులో మహానట మేధావి శివాజీగణేశన్ నటనా ప్రతిభ, ఆయన కళానుభావాలు, ఆయన పొందిన అవార్డులు వంటి పలు వివరాలను పొందుపరిచారు. ఆ వివరాలను రాష్ట్రప్రభుత్వం విద్యావేత్తలతో కొత్తగా రాయించి ప్లస్‌టూ తరగతి పాఠ్యపుస్తకంలో శివాజీగణేశన్‌కు కీర్తీని ఆపాదించే విధంగా పాఠంగా చేర్చారు. శివాజీగణేశన్ గురించి ఈ తరం విద్యార్థులు తెలుసుకునే విధంగా చేసినందుకు రాష్ట్రప్రభుత్వానికి ఒక సీనియర్ కళాకారుడిగా చిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని పేర్కొన్నారు.