Sivaji Ganeshan
-
ప్రభు కూతురు పెళ్లి.. కట్నంగా ఎంత ఇచ్చారంటే
సౌత్ ఇండియాలో స్టార్ నటుడిగా ప్రభుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. కోలీవుడ్ యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ఆమె వివాహం జరిగింది. ఆమెకు గతంలోనే పెళ్లి కావడం ఆపై భర్త నుంచి విడాకులు తీసుకుంది. సుమారు కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు అధిక్ రవిచంద్రన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. 2015లో త్రిష ఇల్లానా నయనతార సినిమాతో తమిళ సినిమాకి దర్శకుడిగా పరిచయం అయిన అధిక్ రవిచంద్రన్.. రీసెంట్గా మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. విశాల్, ఎస్జే సూర్య నటించిన ఈ సినిమా రూ. 100 కోట్లు రాబట్టింది. వివాహం కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సమయంలో నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ వివాహానికి నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం, సుహాసిని, దుల్కర్ సల్మాన్, లెజెండ్ శరవణన్, సుందర్.సి, ఖుష్బూ హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. విడాకులు నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యకు గతంలోనే వివాహం అయింది. ప్రభు సోదరి తేన్మొళి కుమారుడు కునాల్‌తో ఆమెకు వివాహం జరిగింది. కునాల్ లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, కూతురు ఐశ్వర్య కూడా లండన్‌లో స్థిరపడింది. అయితే హఠాత్తుగా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకుని చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. దర్శకుడితో ప్రేమ విడాకుల తర్వాత చెన్నైకి తిరిగి వచ్చిన ప్రభు కూతురు ఐశ్వర్య కేక్‌లు తయారు చేసి విక్రయించే వ్యాపారం చేస్తోంది. ఆమె మెల్ట్జ్ డెసర్ట్స్ (meltz.dessertz) అనే కంపెనీని నడుపుతుంది. ఈ సమయంలో, ఐశ్వర్య, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్‌ల స్నేహం ప్రేమగా మారడం. ఆపై ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. కోట్లాది రూపాయల కట్నం వివాహంతో శివాజీ గణేశన్ (ప్రభు తండ్రి) కుటుంబానికి చెందిన దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్‌కు నగలు, చెన్నైలో విలాసవంతమైన బంగ్లాతో పాటు నగదు రూపంలో కోటి రూపాయలు కట్నం ఇచ్చినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐశ్వర్య వయసు 34 ఏళ్లు కాగా, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ వయసు ఇప్పుడు 32 ఏళ్లు. -
డైరెక్టర్ సాహసం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మూవీ రీమేక్!
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వ శైలి అందరికంటే కాస్తా స్టైలిష్ గా ఉంటుంది. మిన్నలే చిత్రం నుంచి ఇటీవలే శింబు కథానాయకుడిగా రూపొందించిన వెందు తనిందదు కాడు చిత్రం వరకు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ మీనన్ నటుడుగా మారి చాలాకాలమే అయ్యింది. పలు చిత్రాలలో ముఖ్యపాత్రను పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన ఈయన ఇకపై నటించను అనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. నటించడం తనకు ఇష్టం లేదని నిర్ణయాన్ని కూడా శనివారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కాగా.. గౌతమ్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువ నక్షత్రం. ఈ మూవీ అనివార్య కారణాల వల్ల చాలా కాలం నిర్మాణ పనులు సాగాయి. ఎట్టకేలకు ఈ నెల 24వ తేదిన చిత్రం భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. దీని గురించి చెప్పిన దర్శకుడు గౌతమ్ మీనన్ తాను చెప్పిన కథ నచ్చడంతో విక్రమ్ మరో మాట చెప్పకుండా నటించడానికి సమ్మతించారన్నా రు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పలు దేశాల్లో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరు లు సిటీ నేపథ్యంలోనే చిత్రాలు చేస్తున్నారు.. గ్రామీణ నేపథ్యంలో చిత్రం చేసే ఆలోచన లేదా అన్న ప్రశ్నకు తనకు అలాంటి కోరిక ఉందని చెప్పారు. అయితే వెందు తనిందదు కాడు చిత్రంలో ప్లాస్టర్లను గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించారనని.. అయితే అది కొందరికి నచ్చలేదని చెప్పా రు. ఆ కారణంగానే చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిందనే భావన ఉందన్నారు. మీకు పాత చిత్రాల్లో దేనిని రీమేక్ చేయాలని ఉంది అన్న ప్రశ్నకు.. శివాజీ గణేషన్, రాధ నటించిన మొదల్ మర్యాదై చిత్రాన్ని రీమేక్ చేస్తానని చెప్పారు. అందులో శివాజీ గణేషన్ పాత్రలో కమలహాసన్‌ను ఎంపిక చేస్తానని చెప్పారు. మొదటి సినిమా మొదల్ మర్యాదైలో తన నటనతో రాధ ప్రసంశలు అందుకుంది. -
కంటతడి పెట్టిన కమల్‌హాసన్
పెరంబూరు: దివంగత నటుడు, నడిగర్ తిలగం శివాజీ గణేశన్‌కు నటుడు కమలహాసన్ అంటే చాలా ఇష్టం. కమలహాసన్ కూడా ఆయన్ని అప్పా(నాన్న) అని ప్రేమాభిమానంతో సంబో ధించేవారు. ఇక శివాజీ గణేశన్ లేకపోయినా ఇప్పటికీ, ఆయన కుటుంబం కమలహాసన్‌ను తమలో ఒకరిగా భావిస్తారు. కమలహాసన్ ఎంత గొప్ప నటుడైనా, రాజకీయనాయకుడైనా శివాజీగణేశన్ ఇంటి పెద్దకొడుకుగానే వారు భావిస్తారు. కాగా కమలహాసన్ నటుడిగా 60 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని శివాజీ గణేశన్ కుటుంబ సభ్యులు నటుడు ప్రభు, రామ్‌కుమార్ తదితరులు శుక్రవారం స్థానిక బోగి రోడ్డులోని శివాజీ ఇంటికి ఆహ్వానించి విందునిచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె శ్రుతిహాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ గణేశన్ కుటుంబ సభ్యులు రామ్‌కుమార్, ప్రభు కమలహాసన్‌కు జ్ఞాపికను అందించారు. అందులో ఆయన్ని ప్రశంసిస్తూ పేర్కొన్నారు. దాన్ని నటుడు ప్రభు చదివి వినిపించారు. పసందైన విందు జ్ఞాపికను అందుకున్న నటుడు కమలహాసన్ అందులో ప్రశంసలకు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఎప్పటిలానే అన్నై ఇల్లత్తిల్ (శివాజీగణేశన్ ఇల్లు)లో ఎప్పటిలాగే పసందైన విందును ప్రేమాభిమానాలను కలిపి ఇచ్చారు. తమ్ముడు ప్రభు తన గురించి జ్ఞాపికలో రాసిన ప్రశంసలు తనను కంటతడి పెట్టించాయి అని పేర్కొన్నారు. -
పాఠ్యాంశంగా శివాజీ గణేషన్ చరిత్ర
పెరంబూరు: రాష్ట్రప్రభుత్వానికి ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో ప్రపంచంలోనే గొప్పనటుడు, అర్థవంతమైన భావోద్రేకాలను, చక్కని తమిళభాష ఉచ్ఛరణతో నట చక్రవర్తిగా కీర్తీంచబడిన దివంగత నటుడు శివాజీగణేశన్. ఆయన గురించి మలయాళ రచయిత బాలచందర్ కల్లిక్కాట్టు తాను కలిసిన ప్రముఖుల అనుభవాలతో చిదంబర నినైవుగళ్ పేరుతో నవలను రాశారు. అందులో మహానట మేధావి శివాజీగణేశన్ నటనా ప్రతిభ, ఆయన కళానుభావాలు, ఆయన పొందిన అవార్డులు వంటి పలు వివరాలను పొందుపరిచారు. ఆ వివరాలను రాష్ట్రప్రభుత్వం విద్యావేత్తలతో కొత్తగా రాయించి ప్లస్‌టూ తరగతి పాఠ్యపుస్తకంలో శివాజీగణేశన్‌కు కీర్తీని ఆపాదించే విధంగా పాఠంగా చేర్చారు. శివాజీగణేశన్ గురించి ఈ తరం విద్యార్థులు తెలుసుకునే విధంగా చేసినందుకు రాష్ట్రప్రభుత్వానికి ఒక సీనియర్ కళాకారుడిగా చిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని పేర్కొన్నారు. -
సీనియర్ నటుడు షణ్ముగ సుందరం మృతి
కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కోలీవుడ్ సీనియర్ నటుడు షణ్ముగ సుందరం (77) ఈ రోజు (15-08-2017) ఉదయం కన్నుమూసారు. సాలిగ్రామంలోని తన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. నాటకాల్లో హిట్లర్ పాత్రలో ఆయన నటన చూసిన శివాజీ గణేషన్ ఆయనకు సినీ రంగంలో అవకాశం ఇచ్చారు. 1963లో రిలీజ్ అయిన రథ తిలగం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుందరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శింబు హీరోగా తెరకెక్కిన అన్బనవన్ అసరధవన్ అదంగధవన్ ఆయన చివరి చిత్రం. నటి రాధిక శరత్ కుమార్ నటించిన నిర్మించిన అన్నామలై, సెల్వి లాంటి సీరియల్స్ లోనూ నటించారు సుందరం.