
శ్రీరెడ్డి
పెరంబూరు: టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అంటూ పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన నటి శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌పై పడ్డారు. ఇక్కడ ప్రముఖ దర్శకుడు ఎఆర్.మురుగదాస్, సుందర్.సి, నటుడు శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్) వంటి వారు అవకాశాల కోసం ఆశ చూపి తనను వాడుకున్నారంటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. కాగా శ్రీరెడ్డి చర్యలకు కోలీవుడ్‌లో పలువురు ధ్వజమెత్తుతున్నారు. నటుడు వారాహి ఆమెపై చెన్నై కమిషనర్ కార్యలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందిస్తూ.. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని పేర్కొన్నారు. అలాంటిది ఆమె వాటితో ప్రచారం పొందాలనుకోవడం సరైన పద్ధతి కాదని ధ్వజమెత్తారు. శ్రీరెడ్డి సినిమా వారినందరినీ తప్పుపట్టడం సరికాదని భారతీరాజా సూచించారు.

దర్శకుడు భారతీరాజా
Comments
Please login to add a commentAdd a comment