భారతీరాజా చిత్రంలో విజయలక్ష్మి | vijaya laxmi in bharathiraja movie | Sakshi
Sakshi News home page

భారతీరాజా చిత్రంలో విజయలక్ష్మి

Published Wed, Sep 10 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

భారతీరాజా చిత్రంలో విజయలక్ష్మి

భారతీరాజా చిత్రంలో విజయలక్ష్మి

తమిళ సినిమా : ప్రఖ్యాత దర్శకుడు భారతి రాజా చిత్రంలో నటి విజయ లక్ష్మి హీరోయిన్‌గా నటించనున్నారన్నది తాజా సమాచారం. ఎందరో హీరోయిన్లను పరిచయం చేసిన భారతీ రాజా తాను నిర్మించనున్న చిత్రంలో ఈ చెన్నై చిన్నదాన్ని ఎంపిక చేయడం విశేషం. చెన్నై - 28 చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన సుల్తాన్ ది వారియర్ చిత్రంలో నటించే అవకాశం కూడా విజయలక్ష్మిని వరించింది. అయితే ఆ చిత్రం పూర్తికాకపోవడం ఆమె బ్యాడ్ లక్ అనే చెప్పాలి. దీంతో తన తండ్రే విజయలక్ష్మికి బ్రేక్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఈ బ్యూటీ తండ్రి అగస్థ్యిన్. ఈయన ఇంతకు ముందు పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాదల్ కోట్టై చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. అగస్థ్యన్ చివరిగా 2008లో నెంజత్తైకిల్లాదే చిత్రం చేశారు. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు భారతీ రాజా నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో తన కూతురునే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. హీరోగా కదైతిరైకదై వచనం ఇయక్కం చిత్రం ఫేమ్ సంతోష్ ప్రతాప్ నటించనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాత భారతీ రాజా కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనుండడం. చిత్ర కథ బాగా నచ్చడంతో నిర్మాణానికి ముందు కొచ్చినట్లు భారతీ రాజా వెల్లడించారు. అంతేకాదు హీరోయిన్ పాత్రకు విజయలక్ష్మినే పర్ఫెక్ట్ అంటున్నారు. ఇంకా టైటిల్ నిర్ణరుుంచని ఈ చిత్రంలో క్లాసికల్ ఎలిమెంట్స్‌తోపాటు లవ్, యాక్షన్ ట్విస్ట్ అంటూ జనరంజకమయిన అంశాలన్నీ ఉంటాయంటున్నారు దర్శకుడు అగస్థ్యిన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement