అధ్యక్ష పదవికి భారతీ రాజా రాజీనామా | Bharathi Raja Resigned To President Of Directors Association | Sakshi
Sakshi News home page

నాకు ఏకగ్రీవం వద్దు

Published Tue, Jul 2 2019 9:58 AM | Last Updated on Tue, Jul 2 2019 9:58 AM

Bharathi Raja Resigned To President Of Directors Association - Sakshi

సాక్షి, చెన్నై: దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి సీనియర్‌ దర్శకుడు భారతీరాజా రాజీనామా చేశారు. ఇందుకు తగ్గ ప్రకటనను సోమవారం ఆయన చేశారు. దర్శకుల సంఘానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. గత నెల ఈ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ సమయంలో అధ్యక్ష పదవికి భారతీరాజా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆయన్ను అందరూ ముక్తకంఠంతో అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. మిగిలిన పదవులకు ఈనెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ద్వారా ఎదురయ్యే సమస్యలను తాను బాగానే గుర్తెరిగి ఉన్నట్టు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొంటూ భారతీరాజా ఓ ప్రకటన చేశారు. ఈ దృష్ట్యా, తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈనెల 14న ఇతర పదవులకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, అధ్యక్ష పదవికి అదే రోజున ఎన్నికలు జరిగేనా లేదా, ఈ పదవి కోసం మరోమారు ఎన్నికల ప్రక్రియ సాగేనా అన్నది వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement