దర్శకుల సంఘం అధ్యక్షుడిగా భారతీరాజా | Bharathi Raja Elected As President To Directors Association | Sakshi
Sakshi News home page

దర్శకుల సంఘం అధ్యక్షుడిగా భారతీరాజా

Published Tue, Jun 11 2019 9:52 AM | Last Updated on Tue, Jun 11 2019 11:08 AM

Bharathi Raja Elected As President To Directors Association - Sakshi

పెరంబూరు: తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సినీ దర్శకుల కోసం తమిళ దర్శకుల సంఘంను నెలకొల్పిన విషయం తెలిసందే. ఈ సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా  దర్శకుడు విక్రమన్, కార్యదర్శిగా ఆర్‌కే.సెల్వమణి, కోశాధికారిగా పేరరసు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా  వీరి కాల పరిమితి పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహించనున్నారు.  దీంతో ఈ సంఘ కార్యవర్గ సమావేశాన్ని సోమవారం స్థానిక వడపళిలోని ఒక ప్రైవేట్‌ సినీ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు విక్రమన్‌ ఆరు సార్లు అధ్యక్ష పదవిలో కొనసాగడంతో ఈ సారి తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. దీంతో ఈ పదవికి సీనియర్‌ దర్శకుడు భారతీరాజాను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇక మిగిలిని పదవులకు త్వరలోనే ఎన్నికలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement