విశాల్‌పై తిరుగుబాటు | Bharathi Raja And t rajendar Against On Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌పై తిరుగుబాటు

Published Mon, May 14 2018 9:01 AM | Last Updated on Mon, May 14 2018 9:01 AM

Bharathi Raja And t rajendar Against On Vishal - Sakshi

సమావేశంలో పాల్గొన్న భారతీరాజా, టీఆర్‌.రాజేందర్‌

పెరంబూరు: నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్‌పై ఆయన వ్యతిరేక వర్గం మరోసారి ధ్వజమెత్తారు. దక్షిణ భాతర నటీనటుల సంఘం ఎన్నికలు, నిర్మాతల మండలి ఎన్నికల ముందే విశాల్‌ తమిళేతరుడని ఆరోపణలు గుప్పించారు. అయినా ఈ రెండు సంఘాల ఎన్నికల్లోనూ విశాల్‌ విజయదుందుభి మోగించారు. వచ్చే ఎన్నికల్లోనూ విశాల్‌ వర్గం పోటీకి సిద్ధం అని ఇప్పటికే వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్‌ వ్యతిరేక వర్గం అనూహ్యంగా ఆయనపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ వివరాలు చూద్దాం. దర్శకుడు భారతీరాజా, టీ.రాజేందర్, నటుడు రాధారవి, జేకే.రితీశ్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ వెంటనే ఆ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిని, తమిళ సినీ వాణిజ్య మండలిగానూ, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘాన్ని తమిళ సినీ నటీనటుల సంఘంగానూ మార్చాలని ఒత్తిడి చేస్తూ స్థానిక టీ.నగర్‌లోని ఆంధ్రాక్లబ్‌లో దర్శకుడు భారతీరాజ నేతృత్వంలో సమావేశమయ్యారు.

విశాల్‌ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలి
సమావేశం అనంతరం ఈ బృందం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నిర్మాతల మండలి అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. సీనియర్లు తప్పుకోవడంతో ఎవరెవరో వచ్చి తమిళ నిర్మాతల మండలిని ఏలుతున్నారని విమర్శించారు. నిర్మాతల మండలి అధ్యక్ష పదవి కోసమే ఒకరు ఉన్నారని, మండలి అధ్యక్షుడిగా విశాల్‌ చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకుంటానని ఎన్నికల ముందు చెప్పిన ఆయన ఇప్పటికీ వైదొలగకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.

ఇటీవల 48రోజుల పాటు సమ్మెను ఎందుకు నిర్వహించారన్నది తెలియలేదన్నారు. నిర్మాతల సంఘం సర్వసభ్య సమావేశంలో తమిళతాయ్‌ గీతం సమయంలో అందరూ నిలబడి మర్యాద ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. ఆ సమావేశంలో సంఘ నిధి రూ.7 కోట్లకు సంబంధిచిన వివరాలను అడిగినప్పుడు విశాల్‌ ఎందుకు బదులు చెప్పలేదని ప్రశ్నించారు. తమిళ నిర్మాతల మండలిలో తమిళులే కార్య నిర్వాహకులుగా ఉండాలన్నారు. తమిళ సినిమాలో తమిళులే అధిక పెట్టుబడులు పెడుతున్నారని, అయినా ఇతరుల వద్ద బిచ్చమెత్తుకోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే  తమిళులంతా ఏకం కావాలన్నారు.

పలు సమస్యలు
విశాల్‌ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా  బాధ్యతులు చేపట్టిన తరువాత పరిశ్రమలో పలు సమస్యలు నెలకొన్నాయన్నారు. ఒక చిత్రాన్ని అత్యధికంగా తమిళనాడులో 200ల థియేటర్లలో విడుదల చేయవచ్చునని విశాల్‌ చెప్పారని అలాంటిది ఆయన నటించిన ఇరుంబుతిరై చిత్రాన్ని 300 థియేటర్లలో ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. నిబందనలకు విరుద్ధంగా విశాల్‌ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులు పట్టుపడ్డారని చెప్పిన విశాల్‌ ఇçప్పటి వరకూ వారి గురించిన వివరాలను వెల్లడించకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. కావున ఆయన మండలి అధ్యక్ష పదవి నుంచి వెంటనే వైదొలగాలని, మళ్లీ మండలి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలాన్నే సృష్టిప్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement