
సాక్షి, చెన్నై: థియేటర్లకు అనుమతివ్వాలని సీనియర్ దర్శకుడు, తమిళనాడు యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు రాజా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. అన్‌లాక్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి సినీ, బుల్లితెర సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతించింది. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళీ, భారతీరాజా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ‘మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. తమిళ భాషాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు షూటింగులకు అనుమతించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. తదుపరి సడలింపులో సినిమా థియేటర్లకు అనుమతిస్తారని ఆశిస్తున్నా’మని భారతీరాజా పేర్కొన్నారు.
చదవండి:
విజయ్ పోస్టర్లతో మరోసారి కలకలం
నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు
Comments
Please login to add a commentAdd a comment