కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ప్రముఖ నటిగా రాణిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఏడడుగులు వేయబోతోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాట ఉన్న ప్రముఖలను వివాహానాకి రావాలని వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆహ్వానం అందిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా శరత్‌కుమార్ తన కుమార్తె వరలక్ష్మి వివాహానికి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దంపతులకు ఆహ్వానం అందించారు. శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయకు వరలక్ష్మి జన్మించిందనే విషయం తెలిసిందే. స్టాలిన్‌ను కలుసుకున్న వారిలో రాధిక ఆమె కుమార్తె రియాన్ కూడా ఉంది. వీరందరితో పాటు వరలక్ష్మి సోదరి పూజా కూడా ఉండటం విశేషం. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను కలుసుకున్న సమయంలో శరత్‌కుమార్, రాధిక, వరలక్ష్మి విడివిడిగా ఫొటోలు దిగారు. వరలక్ష్మి తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Met the Hon'ble Chief Minister Thiru @mkstalin sir & Durga mam and seeked their blessings..Congratulations on your win sir...Thank you so much for meeting us..@realsarathkumar @realradikaa @rayane_mithun #poojasarathkumar pic.twitter.com/Gopld9K2dl
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 8, 2024
Comments
Please login to add a commentAdd a comment