రాజకీయాలకు అతీతం | Indrasena Reddy on the presidential election | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు అతీతం

Published Fri, Jun 30 2017 2:29 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

రాజకీయాలకు అతీతం

రాజకీయాలకు అతీతం

రాష్ట్రపతి ఎన్నికలపై ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాలకు అతీ తమైనదని, సీబీఐ విచారణకు భయపడి టీఆర్‌ఎస్, ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం సరికాదని బీజేపీ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.

గురువారం ఆయన పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ మాటలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నదన్నారు. గతంలో అబ్దుల్‌ కలాం పోటీచేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఎస్‌.కె.సిన్హా ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. భూముల కుంభకోణంపై వార్తలు రాసిన పత్రికలపై మంత్రి కేటీఆర్‌ బెదిరింపులకు దిగడం మంచిదికాదని ఇంద్రసేనారెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement