సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్రమంగా ఉంటున్న ముస్లింలకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని టీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందా? అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ము, ధైర్యముంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో యూనివర్సిటీలను, జీహెచ్‌ఎంసీ, అంగన్ వాడీ, సింగరేణి, ఆర్టీసీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment