'నా ఇంటికి ఎన్యుమరేటర్ రాలేదు' | indrasena reddy takes on telangana sarkar | Sakshi
Sakshi News home page

'నా ఇంటికి ఎన్యుమరేటర్ రాలేదు'

Published Tue, Aug 19 2014 7:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'నా ఇంటికి ఎన్యుమరేటర్ రాలేదు' - Sakshi

'నా ఇంటికి ఎన్యుమరేటర్ రాలేదు'

హైదరాబాద్: ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సర్వే చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు ఎందుకు చేపట్టలేదని బీజేపీ సీనియర్ నేత ఇంద్రాసేనా రెడ్డి ప్రశ్నించారు. దూర ప్రాంత వాసులు ఇబ్బంది పడుతూ వెళ్లినా.. వారికి నమోదు జరగలేదన్నారు. మంగళవారం మరోమారు సమగ్ర సర్వే పై విరుచుకుపడ్డ ఇంద్రసేనా రెడ్డి.. అసలు ప్రభుత్వం ఏలక్ష్యంతో సమగ్ర సర్వే చేపట్టందన్నారు. అసలు తన ఇంటికి ఎన్యుమరేటర్ రాలేదని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న వారి వివరాలను సేకరించకపోవడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉంటున్న కిరాయిదారుల వివరాలను కూడా తీసుకోలేదన్నారు.

 

సమగ్ర సర్వే పత్రాలను ఓల్డ్ సిటీలో అమ్ముతున్నారని ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని సవాల్ విసిరారు.ఈ తరహా పిచ్చి పనులతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement