సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసేందుకే జోనల్ వ్యవస్థపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు దోబూచులాడుతున్నాడని బీజేపీ జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆదివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అయోమయంలో ఉంటూ, నిరుద్యోగులను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. తెలంగాణ వస్తే మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా 10 శాతం కూడా భర్తీ చేయలేదన్నారు.
కొత్తజిల్లాలు ఏర్పాటైన ఏడాదికి జోనల్ వ్యవస్థపై కమిటీ అంటూ సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జోనల్ వ్యవస్థ ఎందుకన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు మాటమారుస్తున్నాడో నిరుద్యోగులు అర్థం చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కాలయాపన చేసేందుకే కమిటీలు, నివేదికలను సీఎం ఏర్పాటు చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment