బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రం కావడానికి సీఎం కేసీఆర్ నిర్వాకమే కారణమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే విద్యుత్తు శాఖకు మంత్రిని కేటాయించలేదని, కనీసం పూర్తిస్థాయి ఉన్నతాధికారులు కూడా లేకుండా చేశారని ఆరోపించారు. మూడుశాఖలు పర్యవేక్షించే అధికారిని కార్యదర్శిగా నియమించారని, ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో ఉండాల్సిన సంఖ్యలో డెరైక్టర్లు కూడా లేరన్నారు. ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం రెండు దఫాల్లో 335 మెగావాట్ల కరెంట్‌ను తెలంగాణకు సరఫరా చేసినప్పటికీ, బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో బురద జల్లుతున్నారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తీరు మార్చుకుని కార్యాచరణకు సిద్ధం కావాలని హితవు పలికారు.
కరెంట్ సమస్యకు కేసీఆరే కారకుడు
Published Sun, Nov 9 2014 3:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement